S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/22/2018 - 01:41

హైదరాబాద్, ఏప్రిల్ 21: దక్షిణాది రాష్ట్రాల్లో కుటీర, చిన్న పరిశ్రమలకు రుణాలు ఇచ్చే లక్ష్యంతో ఈ ఏడాది అదనంగా 15 బ్రాంచిలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయ్ ఫైనాన్స్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో తమకు 19 బ్రాంచిలు ఉన్నాయని, ఈ ఏడాది 7 బ్రాంచిలను తెలంగాణలో నెలకొల్పనున్నట్లు ఆయ్ ఫైనాన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమ్ జైట్లీ తెలిపారు.

04/22/2018 - 01:40

ఊటీకి సమీపంలోని ఒక గ్రామంలో శనివారం చేతికొచ్చిన వెల్లుల్లి పంటను వేరు చేస్తున్న కూలీలు

04/22/2018 - 01:37

ముంబయి, ఏప్రిల్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో వారం బలపడ్డాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 222.93 పాయింట్లు పుంజుకొని 34,415.58 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమయిన 10,500 పాయింట్ల స్థాయికి పైన 10,564.05 పాయింట్ల వద్ద ముగిసింది.

04/21/2018 - 03:59

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు గని సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) కొత్త యాక్టింగ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) గా సీనియర్ బ్యూరోక్రాట్ సురేశ్ కుమార్ నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుడు సెప్టెంబర్ నుంచి కోల్ ఇండియా సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న గోపాల్ సింగ్ స్థానంలో సురేశ్ కుమార్ నియమితులు కానున్నారు.

04/21/2018 - 01:37

ముంబయి, ఏప్రిల్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఎదుగూబొదుగా లేకుం డా స్వల్ప నష్టాలతో ముగిశాయి. జూన్‌లో కఠిన వైఖరిని అవలంబించబోతున్నట్టు ఇటీవల జరిగిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశ మినట్స్ సూచనప్రాయంగా వెల్లడించడంతో వడ్డీ రేట్లు పెరగనున్నాయనే ఆందోళన మదుపరులను పట్టుకుంది. దీని ప్రభావం శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూలంగా పడింది.

04/21/2018 - 01:35

హైదరాబాద్, ఏప్రిల్ 20: సింగరేణి కాలరీస్ సంస్థ జనరల్ మేనేజర్, ముఖ్య ప్రజా సంబంధాల అధికారి జనగామ నాగయ్య ప్రతిష్టాకరమైన డాక్టర్ సివి నరసింహారెడ్డి పీఆర్ మేనేజర్ అవార్డుకు ఎంపికయ్యారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండి యా హైదరాబాద్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ఈ పోటీల్లో 2018 సంవత్సరానికి ఆయన ఎంపికయ్యారు.

04/21/2018 - 01:34

భీమవరం, ఏప్రిల్ 20: ఎకరం భూమిలో వంద రకాల పంటలు..! అవును ఇది నిజమే. మహారాష్టల్రోని కొల్హాపూర్ జిల్లా రైతాంగం సేంద్రీయ పద్దతులతో ఇలా వంద పంటలను పండిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఒక కుటుంబానికి కావాల్సినవన్నీ ఆ ఎకరం భూమిలోనే సాగు చేసుకుంటున్నారు. సేంద్రీయ విధానంలో జరుగుతున్న ఈ సాగుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ పరిశీలనచేస్తోంది.

04/21/2018 - 01:32

హైదరాబాద్, ఏప్రిల్ 20: భారతదేశం తూర్పుతీరంలో ఉన్న దేశంలో అతి పెద్ద ఆల్ వెదర్ డీప్ వాటర్ పోర్ట్ కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ 2017-18 సంవత్సరంలో 45 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండ్లింగ్ చేసినట్లు ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే 25 శాతం వృద్ధిరేటును సాధించినట్లు పోర్టు సిఇవో, డైరెక్టర్ అనిల్ యెండ్లూరి తెలిపారు.

04/20/2018 - 03:24

వాషింగ్టన్: అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలన్న లక్ష్యంతో జన్‌ధన్ వంటి పథకాలు అమలుచేస్తున్నా 19 కోట్ల మంది భారతీయులకు బ్యాంకు ఖాతాలే లేవు. ప్రపంచ బ్యాంక్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ విషయంలో చైనా తరువాత స్థానం భారత్‌దే. అంతేకాదు గత ఏడాదికి సగానికి సగం బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని తేలింది.

04/20/2018 - 02:44

న్యూఢిల్లీ: వివిధ వాణిజ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పీఓఎస్ మెషిన్ల నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను కోరింది. వివిధ రాష్ట్రాల్లో నగదుకొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బ్యాంకు ఈ చర్య తీసుకుంది. వేరే బ్యాంకులకు చెందిన కస్టమర్లు కూడా ఈ పీఓఎస్ మెషిన్లనుంచి తమ డెబిట్ కార్డు సహాయంతో నగదును విత్‌డ్రా చేసుకోవచ్చునని బ్యాంక్ తెలిపింది.

Pages