S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/28/2018 - 00:10

ముంబయి, ఏప్రిల్ 27: దశాబ్దాల తరబడి శతృత్వం ఉన్న ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం జరగడంతో శుక్రవారం ఆసియాలోని అన్ని స్టాక్ మార్కెట్లలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. దీని సానుకూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా రెండో రోజు 200కు పైగా పాయింట్లు పుంజుకుంది.

04/27/2018 - 23:58

హైదరాబాద్, ఏప్రిల్ 27: రెండు రోజుల పాటు నిర్వహించే ఫార్మా ప్రాక్టీస్ జాతీయ కాంగ్రెస్ ఈ నెల 28 నుండి హైదరాబాద్‌లో జరుగుతుందని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె రామదాస్ తెలిపారు.

04/27/2018 - 23:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారతదేశ క్రెడిట్ రేటింగ్ వరుసగా 12వ సంవత్సరం పెరగలేదు. భారత్ సావరిన్ రేటింగ్‌ను రేటింగ్ సంస్థ ఫిచ్ శుక్రవారం ‘బీబీబీ-’గా యథాతథంగా ఉంచింది. ఇది స్టేబుల్ ఔట్‌లుక్‌తో కూడిన దిగువ స్థాయి ఇనె్వస్ట్‌మెంట్ గ్రేడ్ విత్. భారతదేశ బలహీనమయిన ద్రవ్య సమతుల్యత సావరిన్ రేటింగ్ పెరగకపోవడానికి కారణమని ఫిచ్ పేర్కొంది.

04/28/2018 - 00:16

భీమవరం, ఏప్రిల్ 27: అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొనివున్న పరిస్థితుల్లో రొయ్యలు కొనుగోలు చేయలేమని ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, ఎగుమతిదారులు తేల్చిచెప్పేశారు. ఇప్పటికే కోట్లాది రూపాయల నష్టాలను చవిచూస్తున్నామని వాపోయారు. మరో మూడు మాసాల పాటు ఇవే పరిస్థితులు కొనసాగుతాయన్నారు.

04/27/2018 - 16:54

ముంబయి: వరుసగా రెండో రోజు స్టాక్‌మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. ఈ ఉదయం

04/27/2018 - 04:09

హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్తాన్‌లో 45 బ్రాంచిలతో విస్తరించి ఉన్న మహేష్ అర్బన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.3500 కోట్ల టర్నోవర్‌తో రికార్డు సృష్టించినట్లు ఆ బ్యాంకు చైర్మన్ పురుషోత్తం దాస్ మందానా ప్రకటించారు. గురువారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు పన్నులు చెల్లించకముందు 2018 మార్చి 31వ తేదీ వరకు రూ.42.85 కోట్ల లాభాలను సాధించిందని చెప్పారు.

04/27/2018 - 00:10

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: నాలుగో త్రైమాసికంలో విప్రో నికర లాభం 20 శాతానికి పైగా పడిపోవడంతో ఆ కంపెనీ షేర్ ధర గురువారం రెండు శాతం దిగజారింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్‌ఈ)లో విప్రో షేర్ విలువ గురువారం రూ. 281.45 వద్ద ముగిసింది.

04/27/2018 - 00:09

హైదరాబాద్, ఏప్రిల్ 26: రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్, జువారీ సిమెం ట్స్ లిమిటెడ్‌తో దక్షిణ మధ్య రైల్వే దీర్ఘకాలిక టారిఫ్ కాంట్రాక్ట్ (ఎల్‌టిటిసి) ఒప్పందం చేసుకుంది. గురువారం నాడిక్కడ రైల్ నిలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందం జరిగింది.

04/26/2018 - 23:58

హైదరాబాద్, ఏప్రిల్ 26: భారతదేశపు సుప్రసిద్ధ ఫైనాన్షియల్ మార్కెట్ ప్లేస్ బ్యాంక్ బజార్.కామ్ ఈ ఏడాది 400 మిలియన్ల విజిటర్ల అంచనాలను ఆశిస్తున్నట్లు, వీరికి వాణిజ్య వివరాలను అందిస్తామని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి తెలిపారు. కొత్తగా ఈ ఏడాది 800 మందిని రిక్రూట్ చేయనున్నట్లు చెప్పారు. హైరింగ్‌తో క్లిష్టతలేని సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

04/26/2018 - 23:57

ముంబయి, ఏప్రిల్ 26: యెస్ బ్యాంక్ నాలు గో త్రైమాసికంలో ఆర్జించిన ఆకర్షణీయ నికర లాభం కారణంగా ఆ బ్యాంకు నేతృత్వంలో బ్యాంకింగ్ షేర్లలో వచ్చిన ర్యాలీ వల్ల గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ) షేర్లకు కూడా మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ పుంజుకున్నాయి.

Pages