S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/26/2018 - 23:56

హైదరాబాద్, ఏప్రిల్ 26: హైదరాబాద్ సిగలోకి మరో ఆభరణం రానుంది. హైదరాబాద్ నగర శివార్లలో ఆభరణాల పరిశ్రమకు ఒక సెజ్‌ను, అలాగే బంగారం శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఆభరణాల పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. వీరికి సెజ్ ఏర్పాటు చేసే విషయమై రాష్ట్ర పరిశ్రమల శాఖ కేంద్ర అనుమతులకు ప్రతిపాదనలు పంపింది.

04/26/2018 - 23:55

హైదరాబాద్, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్రంలో 2017-18 సీజన్‌కు జొన్న, మొక్కజొన్న పంటల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. జొన్న, మొక్కజొన్న కొనుగోలు సందర్భంగా మార్కెట్ ఫీజును తొలగించారు. మొక్కజొన్నను క్వింటాల్‌కు 1425 రూపాయలకు, జొన్నను క్వింటాల్‌కు 2000 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు.

04/27/2018 - 00:12

ముంబయి: దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 10,600 మార్క్‌ను దాటేసింది. ఉదయం దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 212 పాయింట్లు ఎగబాకి 34,714 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 47 పాయింట్ల లాభంతో 10,618 వద్ద ముగిసింది.

04/26/2018 - 04:28

గుంటూరు: పొగాకు కొనుగోళ్లలో మాంద్యం ఏర్పడింది. కర్నాటకలో సీజన్ ముగిసి, ఏపీలో నెలరోజుల క్రితం కొనుగోళ్లను ప్రారంభించారు. గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు బేళ్లను అమ్మకానికి తరలించే విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఈ ఏడాది గత ఏడాది నుంచి ఎగుమతులు కూడా తగ్గుముఖం పట్టాయి. 2020 నాటికి పొగాకు రహిత సమాజం నినాదంతో అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఏటా పొగాకు సాగుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది.

04/26/2018 - 01:56

వాషింగ్టన్, ఏప్రిల్ 25: చమురు, సహజవాయువు, బొగ్గు వంటి ఇంధనాల ధరలు ఈ ఏడాది మరో 20 శాతం పెరగనున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. ఈ పెరుగుదల వల్ల 80 శాతం ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి విదేశాలపై ఆధారపడుతున్న భారత్‌పై పెను భారం పడనుంది. గత అక్టోబర్ నెలనుంచి పరిశీలిస్తే వీటి ధరల్లో 16 శాతం వృద్ధి నమోదైందని, ప్రపంచ బ్యాంకు తన 3ఏప్రిల్ వస్తు మార్కెట్ సమీక్ష2లో పేర్కొంది.

04/26/2018 - 01:55

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో ఇంతవరకు వస్తు సేవా పన్ను వసూలైంది. వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి జాతీయ స్థాయిలో అమలవుతున్న విషయం విదితమే. ఏప్రిల్ 24వ తేదీ వరకు దాదాపు రూ. 3040 కోట్ల వరకు వస్తు సేఆ పన్ను వసూలైంది.

04/26/2018 - 01:54

ముంబయి, ఏప్రిల్ 25: రెండు రోజుల పాటు బలపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలను చవిచూశాయి. ఓవైపు ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నిరుత్సాహకరమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో డెరివేటివ్‌ల కాలపరిమితి గురువారంతో ముగియనుండటంతో బుధవారం సెషన్ చివరలో మదుపరులు అమ్మకాలకు హడావుడి పడటంతో మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి.

04/25/2018 - 16:22

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ 10,600 మార్క్‌ దిగువకు పడిపోయింది.మార్కెట్‌ ముగిసే సమయానికి 115 పాయింట్లు నష్టపోయిన సూచీ 34,501 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 44 పాయింట్ల నష్టంతో 10,570 వద్ద ముగిసింది.

04/25/2018 - 04:13

విశాఖపట్నం: వాణిజ్య పరమైన అవరోధాలను అధిగమించి స్టీల్‌ప్లాంట్ వార్షిక వృద్ధిరేటు సాధించే దిశగా సంస్థ ముందుకు సాగుతోందని విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ వీ మధుసూదన్ అన్నారు. విశాఖలో ఆలిండియా కస్టమర్ల మీట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది వార్షిక టర్నోవర్ రూ.16,500 కోట్లను ఈ సారి అధిగమించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

04/25/2018 - 04:10

ముంబయి, ఏప్రిల్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంగళవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మూడేళ్ల గరిష్ఠ స్థాయికి పెరిగిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇంధన రంగ షేర్లకు మదుపరుల నుంచి భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో కీలక సూచీలు పైకి ఎగబాకాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 3.70 శాతం లబ్ధి పొందింది.

Pages