S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/18/2018 - 00:27

ముంబయి, ఏప్రిల్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా తొమ్మిదో సెషన్ మంగళవారం లాభపడ్డాయి. గత మూడేళ్ల కాలంలో వరుసగా తొమ్మిది సెషన్ల పాటు లాభపడటం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరం రుతుపవనాలు సాధారణ స్థాయిలో ఉంటాయన్న వాతావరణ కేంద్రం అంచనా మదుపరులలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో మంగళవారం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 90 పాయింట్లు పుంజుకుంది.

04/18/2018 - 00:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: సెల్‌ఫోన్ల అమ్మకాల్లో గట్టి అభివృద్ధి సాధించినట్టు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. 2020 నాటికి ఈ మార్కెట్‌ను 40 శాతం వరకు ఆక్రమించాలన్నది తమ లక్ష్యమని పేర్కొంది. ఇందుకోసం ‘మొబైల్స్ 40బై 20’ వ్యూహాన్ని అమలు పరుస్తున్నట్టు తెలిపింది. ‘దాదాపుగా భారత్‌లో కొన్న ప్రతి నాలుగు మొబైల్ ఫోన్లలో ఒకటి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొన్నదే.

04/18/2018 - 00:16

హైదరాబాద్, ఏప్రిల్ 17: జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో దక్షిణ మధ్య రైల్వే మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. 63వ జాతీయ రైల్వే వారోత్సవాల్లో భాగంగా భోపాల్‌లో ఈ నెల 15 నుంచి 17 వరకు ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ఆకర్షణీయమైన ప్రదర్శన కనబరిచినందుకు గాను ఈ అవార్డు దక్కింది.

04/18/2018 - 00:29

ముంబయి, ఏప్రిల్ 17: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందింది జీఎస్టీ అమల్లోకి వచ్చిన గత ఏడాది జూలై తర్వాత చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులకేనని ఒక నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా గృహాల కొనుగోలుదార్లకు జీఎస్టీ ఫలాలు అందినప్పటికీ, ప్రభుత్వం ఆశించినంత స్థాయిలో లేవని పేర్కొంది.

04/18/2018 - 00:12

హైదరాబాద్, ఏప్రిల్ 17: డబుల్ బెడ్‌రూమ్ పథకానికి సహకరించాలని స్టీల్ ఉత్పత్తిదారులను గృహ నిర్మణ శాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామ చంద్రన్ కోరారు. మంగళవారం గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

04/17/2018 - 04:28

ముంబయి: భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదవరోజు కూడా లాభాల్లో ముగిసాయి. నవంబర్ నుంచి ఇంతటి దీర్ఘకాలం మార్కెట్లు లాభాల్లో నడవడం ఇదే ప్రథమం. ప్రారంభంలో మార్కెట్లు కొద్దిగా తడబడినా తర్వాత స్థూల ఆర్థిక స్థిరత్వంపై సూచనలు అందడంతో మార్కెట్లుపుంజుకొని ఇక వెనుదిరగలేదు. సోమవారం సెనె్సక్స్ ఒకదశలో 34,341.46ను తాకినా చివరకు 112.78 పాయింట్ల లాభంతో 34,305.43 వద్ద ముగిసింది.

04/17/2018 - 00:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: యూకో బ్యాంకు షేర్లు సోమవారం 6 శాతం నష్టాన్ని నమో దు చేశాయి. రూ.621 కోట్ల రుణ కుంభకోణం నేపథ్యంలో యూకో బ్యాంకు మాజీ ఛైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కౌల్ తదితరులను సీబీఐ కేసు నమోదు చేయడమే ఇందుకు కారణం. ఫలితంగా బ్యాంకు మార్కెట్ మూలధనీకరణ రూ.1,256 కోట్ల మేర పడిపోయి, రూ.3,901.79 కోట్లకు చేరుకుంది. సోమవారం బ్యాంకు షేర్లు గత 52 వారాల్లో కనిష్ఠానికి కుంచించుకుపోయాయి.

04/17/2018 - 00:24

ముంబయి, ఏప్రిల్ 16: గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం చేర్చాలనుకున్న అదనపు సౌరవిద్యుత్ సామర్థ్యం 40 శాతం తగ్గిపోయే అవకాశముంది. గత 12-15 నెలల కాలంలో టెండర్లు ఇతర ప్రక్రియల్లో చోటుచేసుకుంటున్న విపరీత జాప్యమే ఇందుకు కారణమని ఒక నివేదిక వెల్లడించింది.

04/17/2018 - 00:21

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, ఈ వాహనాలు చార్జింగ్ బ్యాటరీలను సేవా విభాగం కింద పరిగణిస్తోంది. ఫలితంగా చార్జింగ్ స్టేషన్ల నిర్వహణకు లైసెన్సులు అవసరం లేదు. అయితే విద్యుత్ చట్టంకింద విద్యుత్ ప్రసారం, పంపిణీ, వ్యాపారం నిర్వహించడానికి లైసెన్స్ తప్పనిసరి.

04/17/2018 - 04:26

* ఆందోళనలో 30 వేలమంది ఫ్లాట్ల కొనుగోలుదారులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: తమ రిజిస్ట్రీ వద్ద రూ.100 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా ప్రముఖ రియాల్టీ సంస్థ జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్‌ను (జేఏఎల్) సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. డిపాజిట్ చేసేందుకు మే 10 వరకు గడువు ఇచ్చింది.

Pages