S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/24/2018 - 01:47

హైదరాబాద్, ఏప్రిల్ 23: భారత్‌లో భారీ విద్యుత్ యంత్ర పరికరాల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు చైనాకు చెందిన వీఈఎం సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. 1886లో స్థాపించబడిన సంస్థ 86 దేశాల్లో వివిధ ప్రాజెక్టులకు విద్యుత్ యంత్ర పరికాలను సరఫరా చేస్తోంది.

04/23/2018 - 18:11

ముంబయి: స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెనె్సక్స్ 11.71 పాయింట్లు, నిఫ్టీ 28.75 పాయింట్ల వద్ద పడిపోయాయి. తరవాత బీఎస్‌ఈ 35.19 పాయింట్లు వద్ద లాభపడి 34,450.77 వద్ద ముగిసింది. నిఫ్టీ 20.65 పాయింట్లు వద్ద లాభంతో 10,584,57 వద్ద స్వల్ప లాభాలతో ముగిసింది.

04/23/2018 - 04:20

న్యూఢిల్లీ: అత్యంత విలువయిన పది భారత కంపనీలలోని ఆరు కంపనీల మొత్తం మార్కెట్ విలువ (ఎం-క్యాప్) శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో రూ. 91,152.73 కోట్లకు చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ వేగంగా పెరగడం ఇందుకు దోహదపడింది.

04/23/2018 - 02:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: భారతి ఎయిర్‌టెల్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్లూచిప్ కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారం దేశీయ స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా.

04/23/2018 - 02:52

వాషింగ్టన్, ఏప్రిల్ 22: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగే సత్తా భారత్‌కు ఉందని, భారత్‌లో గత కొనే్నళ్లుగా అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభమయిందని, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2025 నాటికి అయిదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భారతదేశ ఉన్నత స్థాయి అధికారి ఒకరు ప్రపంచ బ్యాంకుకు చెప్పారు.

04/23/2018 - 02:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశ ముడి ఉక్కు ఉత్పత్తి ఈ సంవత్సరాంతం నాటికి 38 శాతం వృద్ధి రేటుతో 140 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేసినట్టు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ తెలిపారు. దేశంలో 2017లో 101.4 మిలియన్ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తి అయినట్టు ఆయన చెప్పారు. ఈ సంవత్సరం ఇది 140 మిలియన్ టన్నులకు పెరిగే అవకాశం ఉందని ఆయన ఒక వార్తాసంస్థ ప్రతినిధికి తెలిపారు.

04/23/2018 - 02:49

భీమవరం, ఏప్రిల్ 22: ‘ఆక్వా పాలసీ’ని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సంబంధించిన విధివిధానాలను కూడా ఖరారుచేసింది. ఈ మేరకు జీవో 16ను విడుదలచేసింది. రానున్న రోజుల్లో ఆక్వా రైతులకు బాసటగా ఉంటూ ప్రభుత్వం తన నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి వీలుగా ఈ జీవోను రూపొందించింది. 2019-20 నాటికి 27.66 లక్షల టన్నులున్న ఆక్వా ఉత్పత్తులను 42 లక్షల టన్నులకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

04/23/2018 - 01:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత నాలుగేళ్లలో ఎన్నడూలేని రీతిలో పెట్రో ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్ ధర లీటర్‌కు రూ.74.40 పైసలకు చేరుకోగా, డీజిల్ ధర రికార్డుస్థాయిలో రూ.65.65 పైసలకు చేరింది. పెట్రో ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తక్షణమే వినియోగదారులకు ఉపశమనం కలిగించే రీతిలో ఎక్సైజ్ సుంఖాన్ని తగ్గించాలన్న డిమాండ్ మొదలైంది.

04/22/2018 - 04:35

వాషింగ్టన్: భారత్‌లో ఉత్పత్తి, మా ర్కెట్ రంగంలో మహిళల భాగస్వామ్యం మ రింత పెరగాలని, దీనిపై దృష్టి సారించాలని అం తర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) స్పష్టం చే సింది. ఐఎంఎఫ్ ఆసి యా, పసిఫిక్ దేశాల డిప్యూటీ డైరెక్టర్ కెన్ కాంగ్ మాట్లాడుతూ ఈ రెండు విభాగాల్లోనూ భారత్ గణనీయమైన ప్రగతి సాధించిందని తెలిపారు. ‘్భరత పన్నుల విభాగంలో ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్‌టీని ఓ విప్లవాత్మకమైన సంస్కరణగా చెప్పవచ్చు.

04/22/2018 - 01:43

ముంబయి, ఏప్రిల్ 21: ప్రభుత్వం త్వరలో తీసుకు రానున్న కొత్త పారిశ్రామిక విధానం కొత్తగా పెట్టుబడులను తీసుకొస్తుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. అలాగే ఈ విధానం వల్ల దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వస్తు తయారీ (మాన్యుఫాక్చరింగ్) రంగం వాటా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Pages