S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/16/2018 - 05:01

ముంబయి: ఐటీ థిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సహా పలు కార్పొరేట్ కంపెనీల నాలుగో త్రైమాసిక (క్యూ 4) ఫలితాలు, స్థూలార్థిక గణాంకాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయనేది నిపుణులు అంచనా.

04/16/2018 - 03:39

భీమవరం, ఏప్రిల్ 15: డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సాగు విలవిల్లాడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకో విధంగా ఉంటున్న వాతావరణం ఆక్వా రంగంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. ఇటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీంతో ఆక్వా రైతాంగం హుటాహుటిన పట్టుబడులు చేస్తున్నారు. ఈ వ్యాధుల కారణంగా రూ.కోట్లు నష్టం వాటిల్లితోంది.

04/16/2018 - 03:36

హైదరాబాద్, ఏప్రిల్ 15: చైనాలో భారత్‌కు చెందిన స్టార్టప్‌లకు, చిన్న ఎగుమతిదారుల ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, ఈ ఏడాది 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కున్మింగ్ డియాంచ్‌లో అంతర్జాతీయ సదస్సు, ప్రదర్శన జరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (ఫైయో) పేర్కొంది. చైనాకు భారత్ ఎగుమతులలు 53 శాతం పెరిగాయని, వీటి విల్వు 1.24 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు ఆ సంస్థ పేర్కొంది.

04/16/2018 - 03:35

బీజింగ్, ఏప్రిల్ 15: అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్యపోరులో ఎవరి పక్షం వహించ బోనని భారత్ స్పష్టం చేసింది. ఒకపక్క బీజింగ్‌తో వన్ బెల్ట్ అండ్ రోడ్ (బీఆర్‌ఐ) వివాదం కొనసాగుతున్నప్పటికీ ఈ అంశంపై తటస్థ వైఖరికే ప్రాధాన్యతనివ్వడం గమనార్హం.

04/15/2018 - 01:17

పనాజి, ఏప్రిల్ 14: విమానాల ద్వారా సరుకు రవాణా (ఎయిర్ కార్గోను) మరింత పెంపొందించడానికి త్వరలోనే ఒక విధానాన్ని రూపొందించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. ఉత్తర గోవాలోని మోపాలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతిని సమీక్షించేందుకు మంత్రి ఇక్కడికి వచ్చారు. జీఎంఆర్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది.

04/15/2018 - 01:00

హైదరాబాద్, ఏప్రిల్ 14: దేశంలో అన్ని విభాగాల్లో ఉన్న సమాచార టెక్నాలజీ ఆస్తులను, వ్యవస్థను పర్యవేక్షించేందుకు, సైబర్ ఫ్రాడ్స్ నేరాలను అరికట్టేందుకు సెంట్రల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్‌ఓసీ)ని ఏర్పాటు చేయాలని అసోచామ్ అనే జాతీయ వాణిజ్య సంస్థ కేంద్రానికి సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది. ఈ వివరాలను అసోచామ్ ప్రకటనలో విడుదల చేసింది.

04/15/2018 - 01:13

ముంబయి, ఏప్రిల్ 14: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో వారం లాభపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో 565.68 పాయింట్లు పుంజుకొని, 34,192.65 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమయిన 10,400 స్థాయికి పైన 10,480.60 పాయింట్ల వద్ద స్థిరపడింది.

04/15/2018 - 01:15

హైదరాబాద్, ఏప్రిల్ 14: సింగరేణి సంస్థను అత్యుత్తమ కంపెనీగా తీర్చిదిద్దినందుకు ఆ సంస్థ చైర్మన్, సిఎండి ఎన్ శ్రీ్ధర్‌కు ప్రతిష్టాత్మక ఆసియా పసిఫిక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్-2018 అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగినకార్యక్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వికెసింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును ఎన్ శ్రీ్ధర్ స్వీకరించారు.

04/15/2018 - 00:53

హైదరాబాద్, ఏప్రిల్ 14: రాష్ట్ర ఖజానాకు పన్నులు తెచ్చే వాణిజ్య శాఖ పన్ను ఆదాయాలను సమకూర్చే విభాగాలను ప్రక్షాళన చేపట్టడం వల్ల రాబడి పెరిగింది. కాని సేవారంగం (సర్వీసు సెక్టార్) పరిధిలో పన్ను వల్ల వచ్చే ఆదాయం కోల్పోకుండా గట్టిచర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య శాఖ నిర్ణయించింది.

04/13/2018 - 23:48

ముంబయి, ఏప్రిల్ 13: ఉక్కు ఉత్పత్తి దిగ్గజం టాటా స్టీల్ దేశీయ విక్రయాలు మార్చి 31తో ముగిసిన 2017-18 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 6.23 శాతం తగ్గాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ 3.01 మిలియన్ టన్నుల ఉక్కును విక్రయించింది. అలాగే కంపెనీ ఉక్కు ఉత్పత్తి కూడా నాలుగో త్రైమాసికంలో 4.06 శాతం తగ్గింది. కంపెనీ ఈ కాలంలో 3.07 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది.

Pages