S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/13/2018 - 23:51

ముంబయి, ఏప్రిల్ 13: స్థూలార్థిక గణాంకాల దన్నుతో రూపాయి మరింత బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆరు పైసలు పెరిగి, 65.20కు చేరుకుంది. ఆర్థిక వృద్ధి, చిల్లర ద్రవ్యోల్బణం వంటి స్థూలార్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటంతో పాటు విదేశీ మదుపరుల నుంచి అంతరాయం లేకుండా వస్తున్న పెట్టుబడుల మద్దతు దేశీయ కరెన్సీ బలపడటానికి ప్రధాన కారణాలని నిపుణులు విశే్లషించారు.

04/13/2018 - 23:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 : భారతీయ మూలధన మార్కెట్లలోకి, విదేశీ పెట్టుబడి ప్రవాహాలను పెంచేందుకు వీలుగా, కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలోవిదేశీ పోర్ట్‌పోలియో నిధుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడి పరిధిని పెంచాలని సెబీ నిర్ణయించింది. ఈ పరిధిని మొత్తం రెండు విడతల్లో అంటే ఏప్రిల్ 12, అక్టోబర్ 1 తేదిలనుంచి ఈ విస్తరించాల్సి ఉంటుంది.

04/13/2018 - 23:49

ముంబయి, ఏప్రిల్ 13: స్థూలార్థిక గణాంకాలు అంచనాలకు మించి సానుకూలంగా ఉండటంతో పాటు కార్పొరేట్ కంపెనీల నాలుగో త్రైమాసిక (క్యూ 4) ఫలితాలు బాగుంటాయన్న మదుపరుల అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మధ్యాహ్నం తరువాత కొంత అనిశ్చితి నెలకొన్నప్పటికీ మార్కెట్ కీలక సూచీలు దానిని అధిగమించి, ఆరు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.

04/13/2018 - 23:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: భారత కార్పొరేట్ రంగం మార్చి నెలలో 1.5 బిలియన్ డాలర్ల మేర విలీనాలు, స్వాధీనాలు చేపట్టాయని ఒక నివేదిక వెల్లడించింది. దీంతో 2018 తొలి త్రైమాసికంలో మొత్తం చోటుచేసుకున్న డీల్‌లు 18.58 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకున్నాయని నివేదిక వెల్లడించింది.

04/13/2018 - 23:32

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: నాలుగు నెలల వ్యవధి తర్వాత మార్చి నెలలో భారత్ ఎగుమతులు పడిపోయినప్పటికీ, 2017-18 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 9.78 శాతం పెరుగుదల నమోదు చేసి, 302.84 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే మార్చి నెలలో ఎగుమతులు 0.66 శాతం పడిపోవడానికి ప్రధాన కారణం కొన్ని రంగాలకు చెందిన ముఖ్యంగా పెట్రోలియం, రత్నాలు, ఆభరణాల ఉత్పత్తులు తగ్గిపోవడమే.

04/13/2018 - 00:03

న్యూయార్క్, ఏప్రిల్ 12: భారత్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను సరిగా అమలు చేయవచ్చునని, అది పరిష్కారం లేని సమస్యేమీ కాదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది బాగా ఆలోచించి, ప్రణాళికాబద్ధంగా చేసిన పని కాదని ఆయన పునరుద్ఘాటించారు.

04/13/2018 - 00:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ప్రముఖ ఫ్రెంచ్ టెలివిజన్ల తయారీ సంస్థ థామ్సన్ దేశీయ మార్కెట్‌లోకి పునఃప్రవేశించింది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం థామ్సన్ కంపెనీ తక్కువ ధరలకే అద్భుత ఫీచర్లతో మూడు సైజుల స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ టెలివిజన్‌లు కేవలం ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్ కార్డు ద్వారా నేటి నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

04/13/2018 - 00:06

ముంబయి, ఏప్రిల్ 12: ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నిరుత్సాహపూరిత వాతావరణం నెలకొన్నప్పటికీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ) షేర్లలో వచ్చిన ర్యాలీతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా ఆరో సెషన్‌లో పుంజుకొని, కీలకమయిన 34,000 స్థాయికి పైన ముగిసింది. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ 3.18 శాతం పుంజుకుంది.

04/13/2018 - 00:04

ముంబయి, ఏప్రిల్ 12: ఐడీబీఐ బ్యాంకుకు, రిజర్వ్ బ్యాంకు రూ.3 కోట్ల జరిమానా విధించింది. తాను నిర్దేశించిన మార్గదర్శక సూత్రాకనుగుణంగా చెడ్డ రుణాలకు సంబంధించిన నివేదికను సమర్పించలేదన్న కారణంగా ఐడీబీఐపై ఈ చర్య తీసుకున్నట్టు రిజర్వ్ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.

04/12/2018 - 23:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో 4.44 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, మార్చిలో 4.28 శాతానికి తగ్గింది. కాగా వినియోగవస్తువుల ధరల సూచి (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత ఐదునెలల కనిష్ఠానికి చేరుకోవడం గమనార్హం. కాగా గత డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల్లో గరిష్ఠస్థాయికి ఎగసింది.

Pages