S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/25/2018 - 04:07

ముంబయి, ఏప్రిల్ 24: ఆరు సెషన్ల పాటు పడిపోయిన రూపాయి విలువ మంగళవారం పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం పది పైసలు పెరిగి, 66.38 పైసల వద్ద ముగిసింది. ఎగుమతిదారులు, బ్యాంకులు తాజాగా అమెరికన్ కరెన్సీ అమ్మకాలకు పూనుకోవడం వల్ల రూపాయి విలువ పెరిగింది. మంగళవారం తొలుత జరిగిన లావాదేవీల్లో రూపాయి విలువ 66.29 పైసల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, తరువాత కాస్త తగ్గింది.

04/25/2018 - 04:12

హైదరాబాద్, ఏప్రిల్ 24: హైదరాబాద్ జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిష్టాకరమైన గోల్డ్ ఎసిఐ ఆసియా పసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ 2018 గుర్తింపు లభించింది. సాలీనా 5 నుంచి 15 మిలియన్ల ప్యాసింజర్లు ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణిస్తున్నారు. ఈ అవార్డును జిఎంఆర్ సిఇవో ఎస్‌జికె కిషోర్ అందుకున్నారు.

04/25/2018 - 04:02

ముంబయి, ఏప్రిల్ 24: ముంబయి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో సెషన్‌లో మంగళవారం తగ్గాయి. స్టాకిస్టులు తమ నిల్వలు తగ్గించుకోవడంతో పాటు స్థానికుల నుంచి కొనుగోళ్లు తగ్గడం వల్ల బంగారం ధరలు తగ్గాయి. వెండి ధర కూడా కిలోకు రూ. 40వేల స్థాయికన్నా కిందకు పడిపోయింది. వెండి ధర రూ. 760 పడిపోయి, కిలోకు రూ. 39,270 వద్ద ముగిసింది.

04/25/2018 - 03:14

విజయవాడ, ఏప్రిల్ 24: ఎర్రచందనం వేలం ద్వారా 36కోట్ల రూపాయల ఆదాయం లభించిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. 10వ విడత 1368 టన్నుల ఎర్ర చందనం తిరుపతిలో వేలం వేసేందుకు ప్రతిపాదించగా 685 టన్నులను వేలానికి సిద్ధం చేశామన్నారు. ఇందులో 94.2 టన్నుల ఎర్రచందనం అమ్ముడుపోయిందని తెలిపారు. నాలుగు లాట్ల ఏ గ్రేడ్ ఎర్రచందనం విక్రయం ద్వారా ఈ ఆదాయం సమకూరిందన్నారు.

04/24/2018 - 17:28

ముంబయి: ఆసియా మార్కెట్లు సానుకూల సంకేతాలతో నడుస్తుంటంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఉదయం వరకు వందకు పైగా పాయింట్లతో లాభాలో బాటలో పయనించిన స్టాక్ మార్కెట్లు ఆదే జోరును కొనసాగించాయి. చివరకు 29.65 పాయింట్ల లాభంతో 10614.35 వద్ద ముగిసింది. డాలరు మారకం విలువ 66.37 వద్ద ట్రేడయింది.

04/27/2018 - 10:36

ముంబయి: సోమవారంనాడు సాధారణ స్థాయిలో సాగిన లావాదేవీల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 35 పాయింట్లు పెరిగి 34,450.77 పాయింట్లకు చేరుకుంది. రియల్టీ, హెల్త్‌కేర్, వినియోగ వస్తువులు, ఐటీ రంగాల్లో జరిగిన నిలకడైన లావాదేవీల కారణంగా గత రెండు నెలల్లో ఎన్నడూ లేని రీతిలో సెన్సెక్స్ ఈ స్థాయికి చేరుకుంది. కొన్ని బ్లూచిప్ కంపెనీలు లాభాల బాట పట్టడం కూడా సెన్సెక్స్ పెరగడానికి బలంగా కారణమైందని విశ్లేషకులు తెలిపారు.

04/24/2018 - 01:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: భారతీయ ఐటీ కంపెనీల్లో టాటా కనె్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిరుపమాన ఘనత సాధించింది. వంద బిలయన్ డాలర్ల మేర మార్కెట్ విలువను సంతరించుకుని కీర్తిపతాకను ఎగురవేసింది. సోమవారం జరిగిన మార్కెట్ లావాదేవీల్లో టీసీఎస్ కంపెనీ షేర్ల మొత్తం విలువ ఒక దశలో వంద బిలియన్ డాలర్లకు (6,80,912.10కోట్ల రూపాయలు) చేరుకుంది.

04/24/2018 - 01:38

ఆదాయం పన్ను ఎగవేత కేసులో అరెస్టయన విన్ పవర్ ఇఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సురేష్ కుమార్ అగర్వాల్‌ను సోమవారం గౌహతిలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువస్తున్న పోలీసులు

04/24/2018 - 01:36

వాషింగ్టన్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు భారత్‌కు పంపుతున్న మొత్తం గత ఏడాది అత్యధిక స్థాయికి చేరుకుందని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. మొత్తం 69 బిలియన్ డాలర్ల మేర భారత సంతతి ప్రజలు స్వదేశానికి జమ చేశారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ప్రవాస భారతీయులకు జమయ్యే మొత్తం 9.9 శాతం మేర పెరిగిందని తెలిపింది.

04/24/2018 - 01:33

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్‌లో భాగంగా వాటాదారుల హక్కుల వివాదాలు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కుల్లోని వివాదాలను పరిష్కరించే అత్యుత్తమ పద్ధతులపై ఈనెల 28న సెమినార్ నిర్వహిస్తున్నట్లు ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ (ఐసిఏడిఆర్) తెలిపింది.

Pages