S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/04/2018 - 03:41

కాకినాడ: కాకినాడ యాంకరేజి పోర్టు నుండి 2017-18 ఆర్ధిక సంవత్సరానికి గాను సరుకుల రవాణా ద్వారా ప్రభుత్వానికి రూ.40కోట్ల ఆదాయం సమకూరిందని పోర్టు డైరెక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని పోర్టులో మంగళవారం ప్రవీణ్ విలేఖరులతో మాట్లాడారు. యాంకరేజి పోర్టు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకున్నామన్నారు.

04/04/2018 - 02:47

వరుసగా రెండోరోజు కూడా స్టాక్‌మార్కెట్లు పుంజు కున్నాయి. మంగళవారం జరిగిన లావాదేవీల్లో సా నుకూల పరిస్థితులు నెలకొనడంతో ఈక్విటీలు మరింత బలపడటంతో పాటు ఆర్‌బీఐ ఇచ్చిన తాజా ఊతంతో బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. ఇటు సెనె్సక్స్, ఇటు నిఫ్టీ కూడా లావాదేవీల చివరి దశలో బాగా రాణించాయి. సెనె్స క్స్ 115.27 పుంజుకుంది. అలాగే నిఫ్టీ కూడా 33.20 పా యింట్లు బలపడింది.

04/04/2018 - 02:45

ముంబయి, ఏప్రిల్ 3: దేశ ఆర్థిక వ్యవస్థ బలాన్ని సంతరించుకున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు, హైరింగ్ కార్యకలాపాలు గణనీయంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తాజాగా జరిగిన ఓ సర్వేలో స్పష్టమైంది. ముఖ్యంగా తయారీ రం గం, టెక్నాలజీ, పునర్వినియోగ ఇంధనం తదితర రంగాల్లో వెల్లువెత్తనున్న అవకాశాల దృ ష్ట్యా ఈ హైరింగ్ అన్నది భారీగా పెరగవచ్చునని ఈ నివేదిక స్పష్టం చేసింది.

04/04/2018 - 02:51

విశాఖపట్నం, ఏప్రిల్ 3: విశాఖ స్టీల్ ప్లాంట్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి సాధించినట్టు స్టీల్ ప్లాంట్ సీఎండీ మధుసూదన్ మంగళవారం తెలియచేశారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో ప్లాంట్ ప్రగతిని ప్లాంట్ అధికారులకు వివరించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో ప్లాంట్ టర్నోవర్ 16,500 కోట్లకు చేరుకుని, 31 శాతం వృద్ధి సాధించిందని అన్నారు.

04/04/2018 - 02:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: రిజర్వ్ బ్యాంకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించే ద్రవ్యవిధానంలో ప్ర స్తుత విధానాలనే అనుసరించే అవకావముంది. అం తర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ద్రవ్యవిధానాన్ని కొంతమేర సరళతరం చే యాలని వస్తున్న ఒత్తిళ్లను బ్యాంకు పెద్దగా పట్టించుకోకపోవచ్చు.

04/04/2018 - 02:39

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఆధార్ హోల్డర్లకు సంబంధించిన బ్యాంకు అకౌంట్లు, హెల్త్ రికార్డులు, ఆర్థి క లేదా ఆస్తుల వివరాలు తమ డేటా బేస్‌లో ఉం డవని యుఐడీఏఐ మంగళవారం స్పష్టం చేసింది. ఐడీ హోల్డర్లకు సంబంధించిన కనీస సమాచారం మాత్రమే తమ వద్ద ఉంటుందని పేర్కొంది.

04/04/2018 - 02:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3:వీడియోకాన్ బ్యాంకు రుణాల కేసుకు సంబంధించి పన్నుల ఎగవేతకు పాల్పడ్డారనే అభియోగంపై ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీచేసింది. ‘ను పవర్ రెన్యువబుల్స్’ సంస్థ ఎండీగా వ్యవహరిస్తున్న దీపక్‌కు ఐటీ యాక్ట్‌లోని 131 సెక్షన్ ప్రకారం ఈ నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు.

04/04/2018 - 02:37

మదనపల్లి, ఏప్రిల్ 3: చింతపండు పేరెత్తితేనే ఎవరికైనా నోట్లో నీళ్లూరుతాయి. కాని ఈసారి చింతపండు ధరలను చూస్తే ఆందోళన కలిగిస్తోంది. నిత్యావసరం కావడంతో చింతపండు లేని ఇళ్లంటూ ఉండవు. చింతచెట్టు లేని ఊరుండదు. అయితే ఈసారి ఆశించిన స్థాయిలో చింతకాయ కాపు లేకపోవడంతో దీని రేటు పెరిగిపోతోంది. 25 శాతం వరకు మాత్ర మే చింత పంట చేతికి వచ్చినట్లు చిత్తూరు జిల్లా వ్యాపారులు చెబుతున్నారు.

04/04/2018 - 03:59

విజయవాడ, ఏప్రిల్ 3: జీఎస్టీ అమలు చేయడం వల్ల రాష్ట్రాలకు ఇబ్బందులు పెరిగాయని, కేంద్రం పెత్తనం కూడా పెరిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బ్యాంకులకు వెళితే డబ్బులివ్వరని, ఎక్కడ చూసినా ఏటీఎంలు ఖాళీగా ఉంటున్నాయని ధ్వజమెత్తారు.

04/03/2018 - 02:43

న్యూయార్క్:అమెరికా స్టాక్‌మార్కెట్‌లను టెక్నాలజీ షేర్ల పతనం సోమవారం కుదిపేసింది. డవ్‌జోన్స్ ఏకంగా 600 పాయింట్లు పడిపోయింది. నాస్‌డాక్ 3.3 శాతం మేర నష్టపోయింది. అమెజాన్ డాట్‌కామ్ వ్యవహారంపై దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రతికూల వ్యాఖ్యలతో రెండో త్రైమాసికం ప్రారంభంలోనే అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి. మరోపక్క చైనా అమలు చేస్తున్న ప్రతీకార సుంకాలు కూడా మార్కెట్ పతనంపై ప్రభావం చూపాయి.

Pages