S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/11/2018 - 02:57

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: జీఎస్‌టీ నెట్‌వర్క్‌ను (జీఎస్‌టీఎన్) ప్రభుత్వ సంస్థగా మార్చాలన్న అంశం కేంద్ర పరిశీలనలో ఉన్నదని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కొత్త పరోక్షపన్ను విధానంలో, ఐటీ వౌలిక సదుపాయాలను జీఎస్‌టీ నిర్వహిస్తోంది. జీఎస్‌టీ నెట్‌వర్క్‌లో ప్రస్తుతం ప్రైవేటు ఆర్థిక సంస్థలు 51శాతం వాటాను కలిగివుండగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 49 శాతానికే పరిమితమైంది.

04/10/2018 - 03:29

ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిసాయి. వరుసగా మూడవ సెషన్‌లో కూడా సెనె్సక్స్ 162 పాయింట్లు లాభంతో, 33,788 వద్ద ముగియగా, నిఫ్టీ 47.75 పాయింట్ల లాభంతో 10,379.35 వద్ద ముగిసింది. మదుపర్లు ఉత్సాహంగా బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల కొనుగోళ్లు చేపట్టడంతో మార్కెట్లు మొదటినుంచి లాభాలబాటలోనే నడిచాయి.

04/10/2018 - 03:27

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఇటీవల చోటు చేసుకున్న రూ.13వేల కోట్ల స్కాం వల్ల ఉత్పన్నమైన సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, ఈ విషయంలో ప్రభు త్వ సహాయం అర్థించలేదని పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా స్పష్టం చేశారు. నీరవ్ మోదీ అక్రమాల వల్ల వాటిల్లిన నష్టంనుంచి బయటపడే సామర్థ్యం బ్యాంకునకు ఉన్నదని ఆయన తెలిపారు. ‘ఇది పూర్తిగా బ్యాంకు సమస్య. దీన్ని మేమే పరిష్కరించుకుం టాం.

04/10/2018 - 03:26

పరకాల, ఏప్రిల్ 9: నిర్మాణ రంగంపై ఉక్కు పిడుగు పడింది. ఇన్నాళ్లు ఊసురుమన్న నిర్మాణ రంగం ఎట్టకేలకు పుంజుకుంటున్న సమయంలో ఉక్కు ధరలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ధరలు బాగా పెరగటంతో నిర్మాణదారులను ఇబ్బందుల్లోకి నెట్టింది. మార్చి చివరి నాటికి టన్ను ధర సాధారణ కంపెనీల ఉక్కు రూ. 53వేలు, బ్రాండెడ్ కంపెనీల ఉక్కు రూ. 60 వేలకు చేరిందనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి.

04/10/2018 - 03:25

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ టర్నోవర్ ఈ ఆర్థిక సంవత్సరంలో నూరు శాతం వృద్ధి సాధించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. 2015-16, 2016-17లో సరాసరి టర్నోవర్ రూ.113 కోట్లు ఉండగా, 2017-18లో రూ.220 కోట్లకు చేరి రికార్డు స్ధాయిలో 95 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు.

04/09/2018 - 17:18

ముంబయి: స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆది నుంచి ఇనె్వస్టర్ల నుంచి పాజిటివ్ టాక్ రావటంతో లాభాల బాటలో పయనించాయి. సెనె్సక్స్ 162 పాయింట్ల వద్ద, నిఫ్టీ 48 పాయింట్ల వద్ద లాభాలతో ముగిశాయి.

04/09/2018 - 04:22

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన రూ.13,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి పూర్తి విజిలెన్స్ నివేదిక కోసం ఎదు రు చూస్తున్నామని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) తెలియజేసింది. కాగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సమగ్ర వివరాలతో బ్యాంకుకు సంబంధించిన ఆడిటర్లను విచారణకు హాజరు కావాలంటూ ఆదివారం ఆదేశించినట్టు కూడా వెల్లడించింది.

04/09/2018 - 00:57

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కార్పొరేట్ కంపెనీల ఫలితాలు వెలువడనున్న తరుణంలో స్థూలార్థిక గణాంకాల వంటి దేశీయ పరిణామాలు, వాణిజ్య సుంకాల పోరు వంటి ప్రపంచ పరిణామాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో భారత స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయని నిపుణుల అంచనా.

04/09/2018 - 00:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఈ సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశముంది. అప్పటికి దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం2కానుండటంతో, ఆర్‌బీఐ ఈ చర్యకు ఉపక్రమించవచ్చునని, మోర్గాన్ స్టాన్లీ నివేదిక అంచనా వేసింది. తన అంచనాకు ఈ సంస్థ ప్రధానంగా రెండు కారణాలను సూచించింది.

04/09/2018 - 00:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ముంబయి ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం, నీరవ్ మోదీ ఆయన బంధువు మెహుల్ ఛోక్సీలపై నాన్ బెయిలబుల్ వారంట్లను జారీచేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న 2 బిలియన్ల యుఎస్‌డి అక్రమాలపై వీరికి ఈ వారంట్లు జారీ అయినట్ల అధికార్లు ఆదివారం వెల్లడించారు.

Pages