S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/11/2017 - 03:59

ముంబయి, డిసెంబర్ 10: నీటిలో దిగే, ఎగిరే విమానాలను (సీ ప్లేన్‌లను) భారత్‌లో తయారు చేయాలని జపాన్‌కు చెందిన సంస్థ సిటౌచీని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. సిటౌచీ తయారు చేసిన సీ ప్లేన్‌ను శనివారం ముంబయి తీరంలో విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో మంత్రి ఈ విజ్ఞప్తి చేశారు.

12/10/2017 - 05:04

ముంబయి, డిసెంబర్ 9: దేశీయ మార్కెట్లు ఈ వారంలో మొత్తం మీద లాభాలనే ఆర్జించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 417.36 పాయింట్లు పుంజుకొని 33,000 వేల స్థాయిని అధిగమించి, 33,250.30 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 10,250 పాయింట్ల కీలక స్థాయిని అధిగమించి, 10,265.65 పాయింట్ల వద్ద ముగిసింది.

12/10/2017 - 05:03

ముంబయి, డిసెంబర్ 9: దేశంలోని అతిపెద్ద కంటెయినర్ పోర్ట్ జేఎన్‌పీటీ పక్కన గల జేఎన్‌పీటీ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్)లో రూ. 60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 24 కంపెనీలు ముందుకు వచ్చాయని కేంద్ర షిప్పింగ్, ఓడరేవుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జెఎన్‌పీటీ ఎస్‌ఈజెడ్‌లో ఎగుమతులకు ఉద్దేశించిన వెంచర్లు ఏర్పాటు చేసేందుకు 24 కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని ఆయన వివరించారు.

12/10/2017 - 05:02

ముంబయి, డిసెంబర్ 9: నిరుటితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ నెలల మధ్య కాలంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నికరంగా 14.4 శాతం పెరిగాయి. ఈ కాలంలో ప్రత్యక్ష పన్నులు నికరంగా రూ. 4.8 లక్షల కోట్లు వసూలు అయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. 2017-18 బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల అంచనా రూ.

12/10/2017 - 05:02

మహబూబాబాద్, డిసెంబర్ 9: గత కొన్ని సంవత్సరాలుగా ఊరిస్తున్న బయ్యారం ఉక్క్ఫ్యుక్టరీ హుళక్కేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖమ్మం జిల్లా పాల్పంచలో ఉక్కు ఫ్కాక్టరీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయ. విభజన చట్టం హామీల్లో భాగంగానే ఖమ్మం జిల్లాలో కొత్త స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.

12/10/2017 - 05:00

వడోదర, డిసెంబర్ 9: ఎన్‌డీయే ప్రభుత్వం చేపట్టిన వ్యవస్థీకృత సంస్కరణల దన్నుతో దేశ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి రేటు పథంలో దూసుకెళ్లడానికి రంగం సిద్ధమయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రస్తుతం వౌలిక సౌకర్యాల రంగం, గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంపై కేంద్రీకరించిందని ఆయన వెల్లడించారు.

12/10/2017 - 04:59

విశాఖపట్నం, డిసెంబర్ 9: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలికి బలపం కట్టుకుని దేశ దేశాలూ తిరుగుతున్నారు. పారిశ్రామిక రాజధాని అయిన విశాఖకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావాలన్నది సీఎం ఆకాంక్ష. గడచిన మూడేళ్ళలో రెండు సిఐఐ భాగస్వామ్య సదస్సులు జరిగాయి. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులకు హాజరయ్యారు.

12/10/2017 - 04:58

హైదరాబాద్, డిసెంబర్ 9: ఈ నెల 12, 13 తేదీల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌లోని 13 కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు సిఐటియు మద్దతు ప్రకటించింది.

12/10/2017 - 04:57

హైదరాబాద్, డిసెంబర్ 9: రైల్వేలో భద్రత, డిజిటల్ మార్పులతో కూడిన శిక్షణ అందిస్తున్న రైల్వే జోనల్ శిక్షణ సంస్థ (జడ్‌ఆర్‌టిఐ) కృషి అభినందనీయమని దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. ఎప్పటికప్పుడు తాజా సమాచార విప్లవ విశేషాలను ఉద్యోగులకు అందించే మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన జడ్‌ఆర్‌టిఐని అభినందించారు.

12/10/2017 - 05:06

కొలంబో, డిసెంబర్ 9: లంక దక్షిణాది రేవు హంబంటోటాను చైనాకు అప్పగించింది. 99 ఏళ్ల లీజు పద్ధతిలో కీలకమైన రేవును కమ్యూనిస్టు దేశానికి అప్పగించడాన్ని పార్లమెంటులో అన్ని ప్రతిపక్షాలు నిరసించాయి. అయితే ముందు చేసుకున్న ఒడంబడిక ప్రకారం హంబంటోటాను లాంఛనంగా అప్పగిస్తున్నట్టు శ్రీలంక ప్రధాన మంత్రి రనీల్ విక్రమసింఘే శనివారం పార్లమెంటులో ప్రకటించారు.

Pages