S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/14/2017 - 00:32

న్యూఢిల్లీ, జూలై 13: దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) రాకలో ఇబ్బందులను తొలగించే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రత్యక్ష పెట్టుబడుల విధానంపై సమీక్ష నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలో ఎఫ్‌డిఐ విధానాన్ని స్ట్రీమ్‌లైన్ చేయడం కోసం చేయనున్న మార్పులపై ఈ సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రజంటేషన్ ఇవ్వనుంది.

07/14/2017 - 00:31

న్యూఢిల్లీ, జూలై 13: దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రయాణికుల రవాణాకు ఉపయోగించే చిన్నపాటి వాణిజ్య వాహనం ‘జీతో’ మినీ వ్యాన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ముంబయిలో దీని (బిఎస్-4 డీజిల్ వేరియంట్) ఎక్స్-షోరూమ్ ధర రూ.3.45 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

07/14/2017 - 00:35

న్యూఢిల్లీ, జూలై 13: వ్యక్తులు అమ్మే పాత బంగారం, పాత వాహనాలపై ఎలాంటి వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) ఉండదని, ఎందుకంటే ఈ అమ్మకం వ్యాపారాన్ని పెంచుకోవడం కిందికి రాదని రెవిన్యూ డిపార్ట్‌మెంట్ గురువారం వివరణ ఇచ్చింది. బుధవారం రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చేసిన వ్యాఖ్యలపై రెవిన్యూ డిపార్ట్‌మెంట్ వివరణ ఇస్తూ ఒక ప్రకటన జారీ చేసింది.

07/14/2017 - 00:29

హైదరాబాద్, జూలై 13: దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు కోసం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు అవసరమైన సమగ్ర డిజిటల్ ఎంటర్‌ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ)ను అందిస్తామని డెల్‌ఈఎంసి ప్రకటించింది. భారత దేశంలోని 15 నగరాల్లో 30 సొల్యూషన్స్ సెంటర్స్ ద్వారా జిఎస్‌టి ఇన్ ఏ బాక్స్‌తో కూడిన ప్రిప్యాకేజ్డ్ ఎస్‌ఎపిలు ఎంఎస్‌ఎంఈలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

07/14/2017 - 00:28

హైదరాబాద్, జూలై 13: హైదరాబాద్ జోన్ జిఎస్‌టి, కస్టమ్స్ విభాగం చీఫ్ కమిషనర్‌గా బంకే బెహరీ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టింది హైదరాబాద్ జోన్ వరకే అయినప్పటికీ ఆయన తెలంగాణ మొత్తం జిఎస్‌టి, కస్టమ్స్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. దీనికి తోడు అదనంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జోన్ చీఫ్ కమిషనర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

07/14/2017 - 00:27

కొత్తపేట, జూలై 13: పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో లేపాక్షి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు, అలాగే విదేశాల్లో సైతం లేపాక్షి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరనున్నట్టు ఆంధ్రప్రదేశ్ హస్తకళల ఛైర్మన్ పాలి ప్రసాద్ తెలిపారు.

07/13/2017 - 01:57

హైదరాబాద్, జూలై 12: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విషయంలో వ్యాపారులు, వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. సమాజంలో వివిధ వర్గాల వారిలో జిఎస్‌టిపై అవగాహన కల్పించేందుకు, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అవగాహనా సదస్సులను (ఓరియంటేషన్ ప్రోగాం) లను నిర్వహిస్తున్నారు.

07/13/2017 - 01:56

న్యూఢిల్లీ, జూలై 12: రిటైల్ ద్రవ్యోల్బణం చారిత్రక స్థాయికి తగ్గింది. గత నెల జూన్‌లో 1.54 శాతంగానే నమోదైంది. 2012 జనవరిలో ప్రస్తుత కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సిరీస్ మొదలవగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్థాయిలో తగ్గినది లేదు. కూరగాయలు, పప్పు్ధన్యాలు, పాల ఉత్పత్తులు తదితర ఆహారోత్పత్తుల ధరలు తగ్గడమే ఇందుకు కారణం.

07/13/2017 - 01:56

న్యూఢిల్లీ, జూలై 12: రద్దయిన పాత పెద్ద నోట్ల లెక్కింపు ఇంకా జరుగుతూనే ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ బుధవారం పార్లమెంటరీ కమిటీకి తెలిపారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే.

07/13/2017 - 01:55

న్యూఢిల్లీ, జూలై 12: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి (డిఇఎ)గా సుభాష్ చంద్ర గార్గ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. శక్తికాంత దాస్ స్థానంలో ఈయన వచ్చారు. నిజానికి ఈ ఏడాది మే 31నే దాస్ పదవీ విరమణ జరగాల్సి ఉండగా, కొత్తవారు రాకపోవడంతో ఇప్పటిదాకా దాన్ని పొడిగించారు. కాగా, రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన గార్గ్..

Pages