S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/11/2017 - 00:34

హైదరాబాద్, మార్చి 10: నిర్మాణ రంగ కార్మికుల జీవితాలను మెరుగుపరిచేందుకు వారి పిల్లల కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా హైదరాబాద్‌లో హపీజ్‌పేట, గౌలి దొడ్డి వద్ద ఎడ్యుకేషన్ కమ్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పిఎన్‌బి హౌసింగ్ ఎండి సంజయ్ గుప్తా తెలిపారు. 3-6, 6-10 సంవత్సరాల మధ్య ఉన్న రెండు గ్రూప్‌ల చిన్నారుల విద్య, పౌష్ఠికాహార, అభివృద్ధి కోసం ఈ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

03/11/2017 - 00:33

హైదరాబాద్, మార్చి 10: ఇంజినీరింగ్, మ్యానుఫాక్చరింగ్, డేటా అనలిటిక్స్, నెట్‌వర్క్, ఆపరేషన్స్ సొల్యూషన్స్ సంస్థ సైయెంట్‌ను తమ నూతన సేవలైన గిగావరల్డ్ బ్రాడ్‌బ్రాండ్ ప్రచార నిమిత్తం ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ కేబుల్ టివి, బ్రాడ్‌బాండ్ సంస్థ అయన లిబర్టీ గ్లోబల్ ఎంపిక చేసింది.

03/11/2017 - 00:32

హైదరాబాద్, మార్చి 10: తమిళనాడులోని జివికె పెరంబలూర్ సెజ్ ప్రైవేట్ లిమిటెడ్‌లోగల జివికె గ్రూపునకు చెందిన భూమిని వేలం వేస్తున్నట్లు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ సిండికేట్ బ్యాంకు ప్రకటించింది. జివికె సంస్థ నుంచి 175 కోట్ల రూపాయల రుణాలను రికవరీ చేసేందుకే ఈ ల్యాండ్ బ్యాంక్‌ను వేలం వేస్తున్నట్లు సిండికేట్ బ్యాంక్ అధికారులు ప్రకటించారు.

03/11/2017 - 00:31

న్యూఢిల్లీ, మార్చి 10: బ్యాంకులతో వన్‌టైమ్ సెటిల్మెంట్‌కు సిద్ధమని లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా ప్రకటించారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే. ప్రస్తుతం లండన్‌లో ఉన్న మాల్యా.. ఈ బకాయిలను చెల్లించడంలో విఫలమయ్యే విదేశాలకు పారిపోయారన్న అపవాదును మోస్తున్నదీ విదితమే.

03/10/2017 - 00:34

ముంబయి, మార్చి 9: కీలక రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్ సహా ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులకు గురవుతూ చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి.

03/10/2017 - 00:32

హైదరాబాద్, మార్చి 9: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నుంచి కాకినాడ మధ్య ప్రతిష్టాకరమైన పెట్రోకెమికల్స్ ప్రాజెక్టును నెలకొల్పాలన్న ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం విరమించుకుంది. పదేళ్లుగా ఈ ప్రాంతంలో పెట్రోలియం కెమికల్స్ పెట్రో కెమికల్ ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్‌ను నెలకొల్పుతామని గత ప్రభుత్వాలు గొప్పగా చెప్పాయి.

03/10/2017 - 00:31

హైదరాబాద్, మార్చి 9: తమ వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలు మరింత సౌకర్యవంతం చేసేందుకు గాను కరూర్ వైశ్యా బ్యాంక్ దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా ఫాస్టాగ్ సర్వీసులను ప్రారంభించింది. ఫాస్టాగ్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్, భారత్ బిల్ పేమెంట్ సిస్టం పేరిట మూడు కొత్త సాంకేతిక సేవలను ప్రారంభించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

03/10/2017 - 00:31

హైదరాబాద్, మార్చి 9: పేరొందిన హైదరాబాద్ బిర్యానీకి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ట్యాగ్ దక్కలేదు. తొలిసారిగా నిజాం నవాబు హైదరాబాద్ ప్రజలకు పరిచయం చేసిన ఈ బిర్యానీ ఎంతోమందికి నచ్చింది. హైదరాబాద్ విచ్చేసిన ప్రపంచలోని ఎక్కడి వారైనా మెచ్చుకోవాల్సిందే, ఆ రుచికి దాసాహం కావాల్సిందే. కానీ జీఐ ట్యాగ్ సంపాదించలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

03/10/2017 - 00:29

ముంబయి, మార్చి 9: భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) త్వరలో మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన కొత్త 10 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురానుంది.

03/10/2017 - 00:29

న్యూఢిల్లీ, మార్చి 9: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ)లో గురువారం ఒకే రోజు 50 వేల కోట్ల రూపాయల విలువైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు చేతులు మారాయి. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ గ్రూపు సంస్థల మధ్య షేర్‌హోల్డింగ్స్‌లో భారీ మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఆ కంపెనీ షేర్లు భారీ ఎత్తున చేతులు మారాయి.

Pages