S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/01/2017 - 00:17

న్యూఢిల్లీ, జనవరి 31: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 లక్షల మంది అనుమానిత డిపాజిట్లను కలిగి ఉన్నట్లు గుర్తించింది ఆదాయ పన్ను శాఖ. వీరిలో కొందరి డిపాజిట్ల విలువ 5 లక్షల రూపాయల పైమాటేనని తెలిపింది. ఈ సొమ్ము ఈ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఈ-మెయిల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా వివరణ కోరామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సిబిడిటి) చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు.

02/01/2017 - 00:16

రాజమహేంద్రవరం, జనవరి 31: రాష్ట్రంలో అపరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి మూడో పంటగా వేసవిలో అపరాల సాగుపై ప్రత్యేక దృష్టిసారించామని, ఇందుకోసం మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ కె ధనుంజయరెడ్డి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం రాష్టస్థ్రాయి వేసవి అసరాల సాగుపై కార్యాచరణ ప్రణాళిక సదస్సు నిర్వహించారు.

01/31/2017 - 00:57

న్యూఢిల్లీ, జనవరి 30: బ్రిటన్‌కు చెందిన టెలికామ్ దిగ్గజం వొడాఫోన్ గ్రూప్.. భారత్‌లోని తమ వ్యాపారాన్ని ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్‌లో విలీనం చేయాలని చూస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సోమవారం వొడాఫోన్ గ్రూప్ తెలియజేసింది. మొత్తం షేర్ లావాదేవీల్లో జరిగే ఈ డీల్‌తో దేశంలోనే అతిపెద్ద టెలికామ్ సంస్థగా వొడాఫోన్, ఐడియా విలీనానంతర సంస్థ అవతరించనుంది.

01/31/2017 - 00:53

హైదరాబాద్, జనవరి 30: ట్యాక్సీ సేవల సంస్థ ఉబర్ క్యాబ్.. హైదరాబాద్‌లో ఇప్పుడు బైక్ షేరింగ్ సేవలను మొదలుపెట్టింది. ఉబర్‌మోటో పేరిట ఈ సేవలను సోమవారం పరిచయం చేసింది. గత నెల డిసెంబర్‌లోనే ఈ సేవలను టి-హబ్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఉబర్ ప్రకటించింది. తెలంగాణ ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కెటిఆర్ సమక్షంలో సంస్థ వ్యవస్థాపక సిఇఒ ట్రవిస్ కలనిక్ ఈ ప్రకటన చేశారు.

01/31/2017 - 00:52

హైదరాబాద్, జనవరి 30: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐకి చెందిన అనుబంధ బీమా సంస్థ ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్.. తమ పబ్లిక్ ఇష్యూలో 10 శాతం వాటాను అమ్మకానికి పెట్టనుంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ద్వారా ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ క్యాపిటల్ మార్కెట్లలోకి ప్రవేశించనుంది. అయితే ఈ ఐపిఒ ఎప్పుడనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.

01/31/2017 - 00:52

న్యూఢిల్లీ, జనవరి 30: ప్రభుత్వరంగ సంస్థ, భారతీయ తపాలా శాఖకు చెందిన పేమెంట్స్ బ్యాంక్ సోమవారం తమ కార్యకలాపాలను ప్రారంభించింది. రాయ్‌పూర్‌లో పైలట్ సర్వీసులను పరిచయం చేయగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 650 శాఖలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

01/31/2017 - 00:50

హెచ్‌డిఎఫ్‌సి

01/31/2017 - 00:49

న్యూఢిల్లీ, జనవరి 30: నల్లధన కుబేరులపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ ఆదాయ పన్ను శాఖ సోమవారం నూతన బినామీ చట్టం క్రింద 87 నోటీసులు ఇవ్వడమేగాక, కోట్లాది రూపాయల విలువైన బ్యాంక్ డిపాజిట్లను అటాచ్‌మెంట్ చేసింది. దేశవ్యాప్తంగా 42 కేసులకు సంబంధించి ఐటి శాఖ ఈ చర్యలకు దిగింది. బినామీ లావాదేవీల చట్టం ప్రకారం దోషులుగా తేలితే భారీ జరిమానాలతోపాటు గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తారు.

01/31/2017 - 00:48

ముంబయి, జనవరి 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. వరుస నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ వేస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 32.90 పాయింట్లు కోల్పోయి 27,849.56 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 8.50 పాయింట్లు పడిపోయి 8,632.75 వద్ద నిలిచింది.

01/31/2017 - 00:48

విజయవాడ, జనవరి 30: వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) లో ప్రస్తుత కేటాయింపుల కంటే అదనంగా 435 కోట్ల రూపాయలను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడును కోరినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు.

Pages