S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/24/2017 - 00:53

విజయవాడ, జూన్ 23: ఇప్పటికే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చేనేత రంగానికి మరో ఎదురుదెబ్బ తగలబోతున్నది. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వల్ల కాటన్ చిలప నూలుపై ఐదు శాతం పన్ను పడనుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ చేనేత రంగంపై సాలీనా దాదాపు పది కోట్ల రూపాయల భారం పడనుంది. దీనిపై ఇప్పటికే వస్త్ర వ్యాపారులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు.

06/24/2017 - 00:52

న్యూఢిల్లీ, జూన్ 23: ప్రభుత్వరంగ సంస్థ, బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ఏప్రిల్-మే వ్యవధిలో విద్యుదుత్పాదక సంస్థలకు 64.7 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-మేలో 65.8 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేయడంతో ఈసారి దాదాపు 2 శాతం తగ్గుముఖం పట్టినట్లైంది.

06/24/2017 - 00:51

ముంబయి, జూన్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 152.53 పాయింట్లు క్షీణించి 31,138.21 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 55.05 పాయింట్లు పడిపోయి 9,574.95 వద్ద నిలిచింది.

06/24/2017 - 00:50

న్యూఢిల్లీ, జూన్ 23: దేశీయ మార్కెట్‌లో 39,315 యూనిట్ల ఫియస్టా క్లాసిక్, పాత ఫిగో మోడల్ వాహనాలను ఫోర్డ్ శుక్రవారం రీకాల్ చేసింది. 2004 నుంచి 2012 మధ్య చెన్నై ప్లాంట్‌లో ఈ రెండు మోడల్స్ తయారవగా, పవర్ స్టీరింగ్‌కు సంబంధించి గుర్తించిన సమస్యను తొలగించడానికే ఈ రీకాల్ అని ఫోర్డ్ ప్రకటించింది. వాహనదారులు తమ డీలర్ల వద్దకు వెళ్తే సమస్యను తొలగిస్తారని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

06/24/2017 - 00:50

ముంబయి, జూన్ 23: రష్యా ప్రభుత్వరంగ సంస్థ రాస్‌నెఫ్ట్‌కు తమ గుజరాత్ రిఫైనరీని అమ్మేయడానికి ఉన్న అడ్డంకులను ఎస్సార్ గ్రూప్ ఎట్టకేలకు అధిగమించగలిగింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 23 బ్యాంకుల కూటమి.. శుక్రవారం 86,000 కోట్ల రూపాయల విలువైన ఎస్సార్ ఆయిల్-రాస్‌నెఫ్ట్ డీల్‌కు అనుమతిచ్చింది.

06/23/2017 - 00:24

విజయవాడ, జూన్ 22: దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జిఎస్టీ) అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వస్తు, సేవల పన్ను (ఎపి జిఎస్టీ) చట్టం నోటిఫికేషన్‌ను ప్రభుత్వం గురువారం జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో జిఎస్టీ అమలుకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి నాలుగు జీవోలను ప్రభుత్వం జారీ చేసింది.

06/23/2017 - 00:23

ముంబయి, జూన్ 22: పెట్టుబడులను ఆకర్షించే విధంగా మార్కెట్ ప్రవేశపెట్టిన నిబంధనలను సరళీకృతం చేయనున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఆరంభంనుంచి లాభాల బాటలో పరుగులు పెట్టిన దేశీయ సూచీలు చివరివరకు ఆ జోరును కొనసాగించలేక పోయాయి.

06/23/2017 - 00:22

న్యూఢిల్లీ, జూన్ 22: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా రుణాలు తలకు మించి భారంగా మారాయని, అందువల్ల దాన్ని ప్రైవేటు పరం చేయడం మంచిదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా అంటూ, ఎయిరిండియా భవితవ్యంపై ప్రభుత్వ కార్యాచరణ ఆరునెలల్లోనే ఉండవచ్చని చెప్పారు.

06/23/2017 - 00:20

వాషింగ్టన్, జూన్ 22: భారత ఐటి సంస్థలు తమ వ్యాపారం కోసం హెచ్-1బి వీసాలపై అధికంగా ఆధారపడుతున్నాయన్న అభిప్రాయం సరైంది కాదని ఇన్ఫోసిస్ సంస్థ సిఇఓ విశాల్ సిక్కా పేర్కొన్నారు. తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను చేర్చుకునేందుకు వీసా నిబంధనలను దుర్వినియోగం చేస్తున్న సంస్థలపై అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

06/23/2017 - 00:17

న్యూఢిల్లీ, జూన్ 22: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం లేదని, అందుకే జిఎస్‌టి అమలును వాయిదా వేయాల్సిందిగా పారిశ్రామిక సంఘాలు కోరలేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు.

Pages