S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/16/2016 - 00:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు ఉపసంహరణల (విత్‌డ్రాయల్స్)పై విధించిన ఆంక్షలను సడలించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్త కరెన్సీని 80 శాతం మేరకు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత సహకార బ్యాంకులతో మొదలు పెట్టి ఈ ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు.

12/16/2016 - 00:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: వడ్డీ రేట్లను పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆటుపోట్లకు గురయ్యే అవకాశం లేకపోలేదని, అయితే భారత్ మాత్రం ఈ ప్రభావాన్ని తట్టుకోగల స్థితిలో ఉందని కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ గురువారం ఇక్కడ అన్నారు.

12/16/2016 - 00:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ)లోని నాలుగు కోట్ల మందికిపైగా చందాదారుల ఇపిఎఫ్ డిపాజిట్లపై ప్రస్తుతం చెల్లిస్తున్న 8.8 శాతం వడ్డీని ప్రస్తుత (2016-17) ఆర్థిక సంవత్సరంలో కూడా అలాగే కొనసాగించాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఈ విషయమై ఆర్థిక శాఖను ఒప్పించేందుకు కార్మిక శాఖ ప్రయత్నిస్తోంది.

12/16/2016 - 00:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా వసూలయ్యే పన్నులు, ఇతర ప్రభుత్వ రాబడులపై బ్యాంకులకు ఎండిఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలను తిరిగి చెల్లించేందుకు (రీయింబర్స్‌మెంట్‌కు) బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

12/16/2016 - 00:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: కొన్ని టాటా గ్రూపు కంపెనీలకు స్వతంత్య్ర డైరెక్టర్‌గా ఉన్న పారిశ్రామిక వేత్త నస్లి వాడియా రతన్ టాటా, టాటాసన్స్ వాటి డైరెక్టర్లపై 3వేల కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ముంబయి హైకోర్టులో గురువారం ఈ దావా పిటిషన్ దాఖలైనట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్ తదితర టాటా కంపెనీల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వాడియా కొనసాగుతున్నారు.

12/16/2016 - 00:26

హైదరాబాద్, డిసెంబర్ 15: స్టార్టప్ వాణిజ్యానికి ఊతం ఇచ్చే విధంగా నాస్కాం, ఐబిఎం సంస్ధలు గురువారం ఇక్కడ టెక్‌స్టార్టప్.ఇన్ అనే స్టార్టప్‌ను ప్రారంభించాయ. ఈ సందర్భంగా నాస్కాం ఉపాధ్యక్షుడు కెఎస్ విశ్వనాథం మాట్లాడుతూ, నగరంలోని అన్ని స్టార్టప్‌లతో అనుసంధానమై తాజా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతిభ, వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నరు.

12/15/2016 - 08:41

హైదరాబాద్, డిసెంబర్ 14: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభమవగా, ఈ మేరకు బుధవారం సంస్థ ప్రకటించింది.

12/15/2016 - 08:39

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 14: వార్ధా తుపాను ప్రభావం కారణంగా గత వారం రోజులుగా నెలకొన్న వాతావరణ మార్పులు ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆక్సిజన్ అందక రొయ్యలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయ. దీంతో గత్యంతరం లేక యుద్ధ ప్రాతిపదికన రైతులు పట్టుబడి చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో రొయ్యలు కొద్ది సంఖ్యలోనే చనిపోయనప్పటికీ.. బుధవారం మాత్రం భారీగా మృత్యువాత పడ్డాయ.

12/15/2016 - 08:38

విజయవాడ, డిసెంబర్ 14: నవ్యాంధ్రలో పాడి పరిశ్రమ ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమను రైతులు, రైతు కూలీలు అనుబంధ వృత్తిగా కొనసాగిస్తున్నారు. దీన్ని గుర్తించిన చంద్రబాబు ప్రభుత్వం.. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రైతులకు పెద్ద ఎత్తున రాయతీలు అందిస్తోంది.

12/15/2016 - 08:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: తగ్గిన కూరగాయల ధరలు, ఇతరత్రా వంట సరకుల ధరలతో గత నెల టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) దిగివచ్చింది. నవంబర్‌లో 3.15 శాతంగానే నమోదైంది. టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు తగ్గుముఖం పట్టడం వరుసగా ఇది మూడో నెల. నిరుడు నవంబర్‌లో మైనస్ 2.04 శాతంగా ఉండగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 3.39 శాతంగా ఉంది.

Pages