S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/13/2017 - 00:39

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: త్రైమాసిక ఆర్థిక ఫలితాలతోపాటు ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

02/13/2017 - 00:34

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలకు ఊతమిచ్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రారంభించిన పథకాల్లో విజేతలకు బహుమతులుగా 133 కోట్ల రూపాయలను అందించినట్లు నీతి ఆయోగ్ తెలియజేసింది. నిరుడు డిసెంబర్ 25న లక్కీ గ్రాహక్ యోజన, డిజి-్ధన్ వ్యాపార్ యోజన పేరిట రెండు డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సాహక పథకాలను కేంద్రం ప్రారంభించినది తెలిసిందే.

02/13/2017 - 00:40

భీమవరం, ఫిబ్రవరి 12: దేశంలోని ఆక్వా రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అనుకూలమని దేశ, విదేశాలకు చెందిన శాస్తవ్రేత్తలు, నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక్కడి వనరులను సక్రమంగా వినియోగించుకుంటే ప్రపంచ ఆక్వారంగంలోనే భారత్ ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న ప్రాఫిట్ ఆన్ ఆక్వాకల్చర్ అంతర్జాతీయ సదస్సులో భాగంగా రెండవ రోజు ఆదివారం సాంకేతిక సదస్సును నిర్వహించారు.

02/13/2017 - 00:31

దుర్గాపూర్/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశీయ విమానయాన రంగంలోకి మరో సంస్థ ప్రవేశించింది. ఈ నెల 15 నుంచి జూమ్ ఎయిర్ వాణిజ్య కార్యకలాపాలు మొదలు కానున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఢిల్లీ నుంచి జూమ్ ఎయిర్ విమానం ఎగరగా, మధ్యాహ్నం ఒంటి గంట 39 నిమిషాలకు దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్) లోగల ఖాజీ నజ్రుల్ ఇస్లాం ఎయిర్‌పోర్టు వద్ద దిగింది.

02/13/2017 - 00:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, దాని బోర్డు సభ్యుల మధ్య నెలకొన్న సంఘర్షణ నేపథ్యంలో అసలు దీనంతటికీ కారణమైన సంస్థ సిఇఒ విశాల్ సిక్కా సోమవారం ముంబయిలో మదుపరులనుద్దేశించి మాట్లాడనున్నారు. ఇన్ఫీ సహవ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి బహిరంగంగానే బోర్డు తీరును తప్పుబడుతున్న నేపథ్యంలో సిక్కా దీనిపై ఈ సందర్భంగా స్పందిస్తారా? అన్నది ప్రాధాన్యతను సంతరించుకుంది.

02/13/2017 - 00:29

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశీయ మార్కెట్లలో పెట్టుబడులకు విదేశీ మదుపరులు మళ్లీ ఆసక్తి కనబరుస్తున్నారు. నిరుడు భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయతే ఈ నెలలో విదేశీ మదుపరుల తీరు మారింది.

02/13/2017 - 00:27

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ).. తమ కొత్త చీఫ్ విక్రమ్ లిమాయేకు 8 కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని ఇవ్వాలని ప్రతిపాదించింది. వచ్చే నెల 7న జరిగే ఇజిఎమ్‌లో ఐదేళ్ల కాలానికిగాను నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా, సిఇఒగా లిమాయేను ఆమోదించాలని భాగస్వాములను కోరనున్న ఎన్‌ఎస్‌ఇ బోర్డు.. ఆయనకు యేటా 8 కోట్ల రూపాయల ప్యాకేజీని ఇచ్చేందుకు అనుమతినీ తీసుకోనుంది.

02/13/2017 - 00:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పరోక్ష పన్నులను తక్షణమే తగ్గించాలని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం.. ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మందగమనంలోకి వెళ్లిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఇది చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

02/12/2017 - 01:14

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: అంబాసడర్.. సంపన్న వర్గాలకు ప్రతిబింబం. రాజకీయ ఠీవీకి, అధికార దర్పానికి చిహ్నాం. కాలం మారినా.. రోజులు గడిచినా.. అంబాసడర్ రాజసం మాత్రం అలాగే ఉండిపోయిందనడం అతిశయోక్తి కాదు. అత్యాధునిక సౌకర్యాలతో, నిత్యనూతన మోడళ్లతో కార్లు వస్తున్నా.. వాటిని అంబాసడర్‌తో పోల్చేవారు ఇప్పటికీ లేరంటే దాని ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది.

02/12/2017 - 01:11

హైదరాబాద్, ఫిబ్రవరి 11: సైబర్ నేరాల నియంత్రణకు దేశంలోని అన్ని బ్యాంకులు సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సర్క్యులర్‌ను జారీ చేసింది. బ్యాంకులు రీజనల్ స్ధాయిలో ఈ కమిటీలను ఏర్పాటు చేసుకోవడంతో సైబర్ నేరాల నియంత్రణపై సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిపుణులను నియమించనున్నాయి. ఇప్పటికే ప్రతి జాతీయ బ్యాంకు సైబర్ వింగ్‌లను ఏర్పాటు చేశాయి.

Pages