S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/22/2016 - 07:52

అమరావతి, డిసెంబర్ 21: రాష్ట్రంలో క్యాష్‌లెస్ లావాదేవీలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇప్పటికే పాత పెద్దనోట్ల రద్దు, కొత్తనోట్ల కొరత వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు వేలల్లో ఈ-పోస్ మిషన్లు సరఫరా చేస్తుండటం సత్ఫలితాలిస్తోంది. దీంతో లక్షల్లో రూపే కార్డులు పంపిణీ చేస్తున్నారు.

12/22/2016 - 07:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్ గ్రూప్‌లోగల రుణపీడిత టెలికామ్ రంగ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్).. తమ టవర్ వ్యాపారంలో మెజారిటీ వాటాను కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అమ్మేసింది. ఈ మేరకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం ఇక్కడ సంస్థ తెలియజేసింది.

12/21/2016 - 00:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: టొయోటా కిర్లోస్కర్ మోటార్.. ప్రీమియం ఎస్‌యువి ఫార్చునర్ అమ్మకాలు దేశీయ మార్కెట్‌లో లక్ష మార్కును దాటాయి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం 2009లో ఫార్చునర్ భారతీయ మార్కెట్‌కు పరిచయమైంది. కాగా, లక్ష అమ్మకాలు సాధించడం పట్ల టొయోటా కిర్లోస్కర్ మోటార్ డైరెక్టర్, మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎన్ రాజా ఆనందం వ్యక్తం చేశారు.

12/21/2016 - 00:35

ముంబయి, డిసెంబర్ 20: మిస్ర్తి-టాటాల వివాదం మరింతగా ముదురుతోంది. సోమవారం స్టాక్ మార్కెట్లలో లిస్టయిన ఆరు టాటా గ్రూప్ సంస్థ బోర్డుల నుంచి తప్పుకున్న సైరస్ మిస్ర్తి.. మంగళవారం టాటా సన్స్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)కు వెళ్లారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం టాటా సన్స్‌కు వ్యతిరేకంగా మిస్ర్తి కుటుంబ సారథ్యంలోని పెట్టుబడుల సంస్థలు ముంబయిలోని ఎన్‌సిఎల్‌టికి వెళ్లాయి.

12/21/2016 - 00:31

వడోదర, డిసెంబర్ 20: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ), అఖిల భారత బ్యాంక్ అధికారుల సంఘం (ఎఐబిఒఎ) ఆందోళనకు దిగుతున్నాయి. ఈ నెల 28న నిరసన తెలియజేయనున్న సంఘాలు.. 29న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి తమ సమస్యలపై ఓ లేఖను సమర్పించనున్నాయి.

12/21/2016 - 00:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: వాహన ధరలను పెంచుతున్నట్లు జనరల్ మోటార్స్ ఇండియా మంగళవారం ప్రకటించింది. పెరిగిన ధరలు వచ్చే నెల ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. వివిధ మోడళ్లపై గరిష్ఠంగా 30,000 రూపాయల వరకు పెంపు ఉంటుందని సంస్థ సేల్స్, నెట్‌వర్క్ ఉపాధ్యక్షుడు హర్దీప్ బ్రార్ ఓ ప్రకటనలో తెలిపారు.

12/21/2016 - 00:31

విశాఖపట్నం, డిసెంబర్ 20: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంశం మళ్ళీ తెరమీదకు వచ్చింది. చాలాకాలం స్తబ్దుగా ఉన్న ఈ అంశంపైనే ఇపుడు అందరి దృష్టిపడింది. ఇటు రైల్వేవర్గాలు, మరోపక్క ఉత్తరాంధ్ర ప్రజానీకం దీని గురించే చర్చించుకుంటున్నారు. 2017 ఫిబ్రవరిలో రైల్వేబడ్జెట్‌లోనైనా దీనిపై అధికారిక ప్రకటన చేయవచ్చని ఇటు ప్రయాణికులు, రైల్వేవర్గాలు విశ్వసిస్తున్నాయి.

12/21/2016 - 00:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎదురవుతున్న నగదు కొరతను ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అన్నివిధాలా సిద్ధంగానే ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. నోట్ల రద్దు జరిగిన నాటి నుంచి ఒక్కరోజు కూడా విరామం లేకుండా ముద్రణ చేస్తోందని మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ జైట్లీ చెప్పారు.

12/21/2016 - 00:26

విజయనగరం, డిసెంబర్ 20: విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు చెల్లిస్తున్న వేతనం సరాసరి కంటే తక్కువగా ఉండడంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం 194 రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఇక్కడ సరాసరి 129 రూపాయలు మాత్రమే ఉండటమేమిటని జిల్లా అధికారులను కమిటీ ప్రశ్నించింది.

12/21/2016 - 00:26

ముంబయి, డిసెంబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. గత నాలుగు రోజులుగా నష్టపోతున్న సూచీలు మంగళవారం కూడా క్షీణించగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 66.72 పాయింట్లు పడిపోయి 26,307.98 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 21.95 పాయింట్లు దిగజారి 8,082.40 వద్ద నిలిచింది.

Pages