S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/20/2016 - 00:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్.. కొన్ని అనుమానిత ఖాతాల లావాదేవీలను నిలిపివేసింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంక్ ఉద్యోగులు కొందరు అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో యాజమాన్యం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే అవినీతికి తావులేకుండా మునుపెన్నడూ లేని చర్యలు చేపడుతోంది.

12/19/2016 - 00:18

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహణ కొనసాగుతోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెలలో దాదాపు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న మదుపరులు.. ఈ నెలలో ఇప్పటిదాకా 3 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, తదనంతర పరిణామాల ప్రభావం కూడా భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది.

12/19/2016 - 00:17

విశాఖపట్నం, డిసెంబర్ 18: నష్టాలు వస్తున్నా.. మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఈపీడీసీఎల్).. ఇపుడు ఇంధన పొదుపుపై మరింతగా ప్రత్యేక దృష్టిని సారిస్తోంది. విద్యుత్‌ని ఆదా చేయడంలో దేశంలో ఉన్న 44 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో ఈపీడీసీఎల్ ప్రథమ స్థానంలో నిలబడగలిగింది.

12/19/2016 - 00:15

ముంబయి, డిసెంబర్ 18: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల నేపథ్యంలో దాని ప్రమోటర్ విజయ్ మాల్యాకి చెందిన కింగ్‌ఫిషర్ హౌస్, కింగ్‌ఫిషర్ విల్లాల అమ్మకానికి మరోసారి బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ముంబయిలోని కింగ్‌ఫిషర్ హౌస్‌తోపాటు, గోవాలోని కింగ్‌ఫిషర్ విల్లాలను వేలం వేసిన బ్యాంకర్లకు నిరాశే మిగిలింది. దీంతో ధరలను తగ్గించి మళ్లీ వీటిని వేలానికి తెస్తున్నాయి బ్యాంకులు.

12/19/2016 - 00:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న అవినీతిలో తమ బ్యాంక్ ఉద్యోగులు ఉండటంపట్ల యాక్సిస్ బ్యాంక్ ఎండి, సిఇఒ శిఖా శర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ పరువును మంటగలిపారన్న ఆమె జరిగినదానిపై కెపిఎమ్‌జితో ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయిస్తున్నామని చెప్పారు. అంతేగాక మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

12/19/2016 - 00:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు సౌమిత్ర చౌధురి కన్నుమూశారు. అనేక ప్రభుత్వ ఉన్నతస్థాయి సలహా సంఘాల్లో పనిచేసిన చౌధురి.. ఆదివారం ఉదయం చనిపోయారు. ఆయన లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు చౌధురి మేనల్లుడు అభిక్ తెలియజేశారు. చౌధురి వయసు దాదాపు 63 ఏళ్లు.

12/19/2016 - 00:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: పాత పెద్ద నోట్ల రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్.. పార్లమెంట్ కమిటీకి వివరణ ఇవ్వనున్నారు. నోట్ల రద్దు ప్రక్రియ, దాని ప్రభావం గురించి ఈ నెల 22న ఉర్జిత్ పటేల్ ఆర్థిక వ్యవహారాలపై పార్లమెంట్ కమిటీకి వివరిస్తారు. ఈ మేరకు పార్లమెంట్ వెబ్‌సైట్‌లో ఆదివారం వివరాలను పొందుపరిచారు.

12/19/2016 - 00:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలూ మదుపరుల పెట్టుబడులను శాసించనున్నాయని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు.

12/18/2016 - 05:33

విశాఖపట్నం, డిసెంబర్ 17: డిజిటల్ కరెన్సీ లావాదేవీల నిర్వహణలో యావత్ ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ప్రపంచం అంతా ప్రస్తుతం డిజిటల్ కరెన్సీ వినియోగం దిశగా నడుస్తోందన్నారు.

12/18/2016 - 05:30

ముంబయి, డిసెంబర్ 17: మసాలా బాండ్లతో దేశీయ మార్ట్‌గేజ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి మరోసారి చేయబోయే నిధుల సమీకరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఆమోదం లభించింది. ఇప్పటికే మసాలా బాండ్ల జారీ ద్వారా 5,000 కోట్ల రూపాయలను హెచ్‌డిఎఫ్‌సి పొందింది. అయితే ఇదే పద్ధతిన మరిన్ని నిధుల కోసం హెచ్‌డిఎఫ్‌సి సిద్ధమవగా, మరో 3,000 కోట్ల రూపాయల వరకు అందుకోవచ్చని ఆర్‌బిఐ అనుమతిచ్చింది.

Pages