S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/15/2016 - 08:25

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (ఐఐటిఎఫ్-2016) ఇక్కడి ప్రగతి మైదాన్‌లో ఘనంగా మొదలైంది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా ప్రారంభమైన ఈ 36వ ఎడిషన్ ప్రదర్శనలో 27 దేశాలకు చెందిన 150కిపైగా సంస్థలు పాల్గొంటున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పెవిలియన్లు ఇందులో కొలువుదీరాయి.

11/15/2016 - 08:25

న్యూఢిల్లీ, నవంబర్ 14: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 9 శాతం పెరిగింది. 206.28 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 188.60 కోట్ల రూపాయలుగా ఉంది.

11/15/2016 - 08:24

ముంబయి, నవంబర్ 14: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 848 కోట్ల రూపాయలు (పన్నుల తర్వాత)గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో సంస్థ ఏకీకృత నష్టం 1,740 కోట్ల రూపాయలు (పన్నుల తర్వాత)గా ఉంది.

11/15/2016 - 08:24

ఇండోర్, నవంబర్ 14: పెళ్ళిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. కిటకిటలాడే బట్టలు, నగల మార్కెట్ ఇప్పుడు బోసిపోతోంది. జనాల వద్ద డబ్బులు లేక కాదు.. ఉన్న డబ్బులు చెల్లక. అవును.. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేయడం పెళ్ళిళ్ల సీజన్ అమ్మకాలను దెబ్బ తీసింది. గార్మెంట్, జ్యుయెలరీ విక్రయాలు దారుణంగా పడిపోయాయి.

11/15/2016 - 08:23

ముంబయి, నవంబర్ 14: పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలకు ఏర్పడిన అసౌకర్యాన్ని అధిగమించేందుకు పలు చర్యలు చేపడుతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ).. తాజాగా డిసెంబర్ 30 వరకు ఎటిఎమ్ లావాదేవీలపై చార్జీలుండవని ప్రకటించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు ఆర్‌బిఐ సోమవారం సూచించింది.

11/14/2016 - 00:23

ఇక్కడ కనిపించేది సరికొత్త ఎన్‌ఎఒ రోబో. అయతే ఏంటి అనుకోకండి. 19 భాషల్లో మాట్లాడగల ఈ రోబో.. నడవగలదు, పాటలు పాడగలదు, డ్యాన్సులు చేయనూగలదు. అదే దీని ప్రత్యేకత మరి. బ్యాంకులు, ఆస్పత్రులు, ఎయర్‌పోర్టుల్లో వినియోగిస్తున్న దీన్ని..ఆదివారం కోయంబత్తూర్‌లో పాన్ ఇండియా పార్ట్‌నర్ ఆఫ్ అల్బెబరన్ ఫ్రాన్స్ సిఇఒ విజయ్ షా చూపిస్తున్నారిలా.

11/14/2016 - 00:22

న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

11/14/2016 - 00:20

హైదరాబాద్, నవంబర్ 13: జిఎంఆర్ సంస్థ హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ (సుంక రహిత) ఉత్సవాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభించింది. వివిధ కంపెనీల ఉత్పత్తులను 15 శాతం డిస్కౌంట్ ఆఫర్‌పై విమాన ప్రయాణీకులకు విక్రయస్తామని హైదరాబాద్ సుంక రహిత రిటైల్ చైర్మన్ ఎస్‌జికె కిషోర్ తెలిపారు. దేశంలోని అతిపెద్ద మెగా డ్యూటీ ఫ్రీ ఉత్సవాల్లో ఇది కూడా ఒకటి అని ఆయన అన్నారు.

11/14/2016 - 00:19

గోదావరిఖని/పరవాడ, నవంబర్ 13: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, విశాఖపట్నం జిల్లాలోని పరవాడలోగల ఎన్‌టిపిసికి చెందిన థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లకు స్వర్ణశక్తి పురస్కారాలు లభించాయ. సామాజిక సేవ, మానవ వనరులు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, భద్రత, ఉత్పాదకత, పర్యావరణం, రాజభాష అభివృద్ధి, సిఎస్‌ఆర్ వంటి విభాగాల్లో దేశవ్యాప్తంగా ఎన్‌టిపిసి పరిధిలోని ప్రాజెక్ట్‌లకు పురస్కారాలు ప్రదానం చేశారు.

11/14/2016 - 00:14

న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 36వ అఖిల భారత అంతర్జాతీయ వ్యాపార ప్రదర్శనలో తెలంగాణ పెవిలియన్ ‘డిజిటల్ తెలంగాణ’ థీమ్ డిజైన్‌తో ముస్తాబైంది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఈ ప్రదర్శనను ప్రారంభిస్తుండగా, తెలంగాణ పెవిలియన్‌ను రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆవిష్కరిస్తున్నారు.

Pages