S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/04/2016 - 08:18

న్యూఢిల్లీ: బంగారు, రత్నాభరణాలపై 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని తిరిగి విధించడానికి నిరసనగా బంగారు నగల వ్యాపారులు చేపట్టిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె ఓ వైపు కొనసాగుతుండగా, మరోవైపు దేశంలో నల్లధనం తయారు కావడానికి ఈ రంగం దోహదపడుతోందని, దీన్ని పన్ను పరిధిలోకి తీసుకు రావలసిన అవసరం ఉందని ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల కేంద్ర బోర్డు (సిబిఇసి) అభిప్రాయ పడింది. ‘ఆభరణాల రంగాన్ని పన్ను పరిధిలోకి తీసుకు వచ్చాం.

03/04/2016 - 08:17

న్యూఢిల్లీ: దేశంలో నల్లధనాన్ని కూడబెట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్రమైన హెచ్చరిక చేసింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన నాలుగు నెలల ‘కాంప్లియన్స్ విండో’ ముగిసేలోగా నల్లధన వివరాలను ప్రకటించకుండా ఆ తర్వాత అక్రమ సంపదతో పట్టుబడిన వారు 30 శాతం పన్నుపై రెండింతల జరిమానా చెల్లించడంతో పాటు ఏడేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

03/04/2016 - 08:16

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లలో బడ్జెట్ సానుకూల పవనాలు వరసగా మూడో రోజు కూడా బలంగా వీచడంతో గురువారం సెనె్సక్స్ మరో 364 పాయింట్లు పెరిగి దాదాపు నెల రోజుల గరిష్ఠస్థాయి అయిన 24,607 పాయింట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణుల కారణంగా మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగడం కూడా మార్కెట్ ర్యాలీకి దోహదపడింది.

03/03/2016 - 00:28

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మూలధన నిధుల సమీకరణకు సంబంధించి బ్యాంకులకున్న నిబంధనలను సడలించడం ఆహ్వానించదగ్గ పరిణామంగా ఆయన పేర్కొన్నారు.

03/03/2016 - 00:25

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో బడ్జెట్ జోష్ బుధవారం కూడా కొనసాగింది. మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఏడేళ్ల గరిష్ఠ స్థాయి లాభాన్ని అందుకున్నది తెలిసిందే. ఒక్కరోజే 777 పాయింట్లు పుంజుకుంది. ఈ క్రమంలో బుధవారం మరో 464 పాయింట్లు ఎగిసింది. ఫలితంగా సెనె్సక్స్ 24 వేల స్థాయిని అధిగమించగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,300 మార్కును దాటింది.

03/03/2016 - 00:22

హైదరాబాద్: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్.. కృష్ణపట్నం యుఎమ్‌పిపి ప్రాజెక్టు నుంచి వైదొలగాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భావిస్తే తమపై కోర్టుల్లో దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకోవాలని రిలయన్స్ పవర్‌కు విద్యుత్ కొనుగోలు ఒప్పందదారులు చెప్పినట్లు ఆంధ్రపద్రేశ్ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ కె విజయానంద్ బుధవారం తెలిపారు.

03/03/2016 - 00:21

విజయవాడ: రాష్ట్రంలో త్వరలో 16 భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు, పలు పారిశ్రామిక నగరాలు, టౌన్‌షిప్‌లు రానున్నాయి. పరిశ్రమలకు వసతులు కల్పించే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి) ఇందుకు మార్గం సుగమం చేయనుంది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై సవివరమైన చర్చ జరిగింది.

03/02/2016 - 06:52

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం లాభాల పంట పండింది. మదుపరుల కొనుగోళ్ల ఉత్సాహంతో సూచీలు పరుగులు పెట్టాయి. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను వార్షిక సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో దాదాపు ఏడేళ్లలో ఎప్పుడూ లేనంతగా సూచీలు ఈ ఒక్కరోజే రికార్డుస్థాయి లాభాలను అందుకున్నాయి.

03/02/2016 - 06:48

హైదరాబాద్: జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో అరుదైన ఘనతను సాధించింది. 2015 సంవత్సరానికి ఏసిఐ ప్రకటించిన ఏఎస్‌క్యు సర్వే సంస్థ ర్యాంకుల్లో ప్రపంచంలోని 5 నుంచి 15 మిలియన్ల సామర్థ్యం కలిగిన ఎయిర్ పోర్టుల్లో జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 3వ స్థానంలో నిలిచింది.

Pages