S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/20/2016 - 02:59

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: దేశంలో బార్‌కోడింగ్‌తో మద్యం అమ్మకాలు ఇప్పటి వరకు ఒక్క న్యూఢిల్లీలోనే జరుపుతున్నారని, వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే విధానంతో మద్యం విక్రయాలకు చర్యలు తీసుకున్నామని అబ్కారీ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు.

02/20/2016 - 02:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఉద్యోగుల భవిష్య నిధి సంస్ధ (ఇపిఎఫ్‌ఓ) వడ్డీ రేటును 8.8 శాతనికి పెంచుతూ మధ్యంతర ఉత్తర్వులు తీసుకువస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

02/19/2016 - 07:17

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని, ముంబయి మహా నగరంలో వారం రోజులు జరిగిన పెట్టుబడుల జాతర గురువారం ముగిసింది. మేక్ ఇన్ ఇండియా వీక్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 15.2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆయా రాష్ట్రాల్లోని వివిధ రంగాల్లోకి వచ్చాయని డిఐపిపి కార్యదర్శి అమితాబ్ కాంత్ ఇక్కడ ఎమ్‌ఎమ్‌ఆర్‌డిఎ గ్రౌండ్స్ వద్ద జరిగిన ముగింపు విలేఖరుల సమావేశంలో తెలిపారు.

02/19/2016 - 07:15

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఈ ఏడాది, వచ్చే ఏడాది 7.5 శాతంగానే ఉంటుందని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం మూడీస్ గురువారం అంచనా వేసింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, చైనా ఆర్థిక మందగమనం దీనికి కారణమని అభిప్రాయపడింది. అయితే ముడి చమురు తదితర ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశంగా అభవర్ణించింది.

02/19/2016 - 07:14

రింగింగ్ బెల్స్ ‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్ఫోన్‌పై ఇప్పటికే భారీ స్థాయిలో అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ స్మార్ట్ఫోన్ మరో సంస్థ స్మార్ట్ఫోన్‌ను కాపీ కొట్టి రీబ్రాండ్‌తో మార్కెట్‌లోకి వస్తోందా? అన్న కోణంలో అనుమానాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. తాజాగా విడుదలైన ఫ్రీడమ్ 251 స్మార్ట్ఫోన్..

02/19/2016 - 07:11

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ సాంకేతిక అభివృద్ధి ప్రోత్సాహక సంస్థ (ఎపిటిడిసి) ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మార్చి 12,13,14 తేదీలలో ప్రపంచ స్థాయి ఆక్వా సదస్సు నిర్వహించనున్నారు. ‘ఆక్వాబిజ్-2016’ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నాయి.

02/19/2016 - 07:10

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడి చమురు ధరలతో నెలకొన్న ఉత్సాహం గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లను లాభాల్లో నడిపించింది. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు సైతం భారతీయ సూచీలను వరుసగా రెండోరోజు లాభాలను అందుకునేలా చేశాయి.

02/18/2016 - 08:18

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే ప్రమాదంలో పడేస్తున్న మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు) సమస్యను పరిష్కరించడానికి ఓ ప్రత్యేక బ్యాంక్ లేదా సంస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి పిటిఐతో అన్నారు. ‘ఈ ప్రతిపాదనన చాలా మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తీసిపారేయాల్సిన ఆలోచనేమీ కాదు.

02/18/2016 - 08:17

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్‌ను బుధవారం దేశీయ మొబైల్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ ఆవిష్కరించింది. కేవలం 251 రూపాయలు ధర కలిగిన ఈ స్మార్ట్ఫోన్‌ను రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్ మార్కెట్‌కు పరిచయం చేస్తారని సంస్థ పేర్కొన్నది తెలిసిందే. కాగా, దేశీయ మొబైల్ పరిశ్రమనే కాదు.. ప్రపంచ మొబైల్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఈ స్మార్ట్ఫోన్ బుకింగ్స్ గురువారం నుంచి మొదలుకాను న్నాయ.

02/18/2016 - 08:13

హైదరాబాద్: ఆర్థిక మార్కెట్‌లో సిఎలకు మంచి డిమాండ్ ఉందని, ఈ కోర్సును అభ్యసించేందుకు ప్రతిభావంతులు చాలామంది చేరుతున్నారని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కొత్త అధ్యక్షుడు ఎం దేవరాజరెడ్డి అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఐసిఎఐ అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి తెలుగువాడిగా దేవరాజరెడ్డి నిలిచారు.

Pages