S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/29/2015 - 22:33

మానవుల సగటు ఆయుఃప్రమాణం 1920 ప్రాంతంలో చాలా తక్కువగా ఉండేది. ఆ కాఠణంగా అన్నదమ్ములు చిన్న వయస్సులోనే తల్లితండ్రులిద్దరినీ కోల్పోయారు. కొద్దిపాటి వ్యవసాయ భూమి మాత్రమే ఉన్న వారికి చదువుకోవాలన్న కోరిక తీవ్రంగా ఉంది. నేటివలె ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మీల్స్ వం టివి అప్పుడు లేవు. ప్రభుత్వ పాఠశాలలోనైనా ఫీజుకట్టి చదువుకోవలసిందే. అన్నగారు వయస్సులో చిన్నవాడైనా ఆలోచించి పరిష్కారం కనుగొన్నాడు.

12/29/2015 - 22:33

చదువు అంటే వారికి తెలియదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే కాయకష్టం చేసి, తమ కుటుంబాన్ని పోషించుకోవడం. ప్రతి రోజు ఉదయానే్న కూలి పనులకు వెళ్ళి, సాయంత్రం ఎప్పుడో తిరిగి రావడం వారి దినచర్య. వారి పిల్లలు రోడ్ల వెంబడి తిరిగి ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త కాగితాలు ఏరుకొని, వాటిని విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో అల్లరిచిల్లరగా తిరుగుతుంటారు. వారికి పాఠశాల అంటే ఎలా ఉంటుందో, చదువుకోవడం అంటే ఏమిటో తెలియదు.

12/28/2015 - 22:50

కొత్త విద్యా సంవత్సరం దాదాపు మూడువంతులు పూర్తికా వచ్చింది. కానీ సర్కారు బడుల్లో సమస్యలు తిష్టవేసే వున్నాయి. పాఠశాల భవనాల కొరత, పాఠ్యపుస్తకాల కొరత, మరుగున పడిన మరుగుదొడ్లు, నీటి సమస్య సక్రమంగా అమలుకాని మధ్యాహ్నభోజన పథకం, అధ్యాపక కొరత ఇలా ఎన్నో ఎనె్నన్నో సమస్యలు విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్నాయి అనటం అతిశయోక్తికాదు.

12/28/2015 - 00:39

‘‘సృష్టిపుట్టకముందే రాముడు పుట్టిండు,’’ అధునాతన పరిశోధకులు తేల్చిన మాట రోజు, వారం, నెల, సంవత్సరం, దశాబ్దం, సహస్రాబ్దం అనేవి కాలం యొక్క పరిధులను తెలియజేసేవి. వీటి మాదిరిగానే యుగము, మహాయుగము కల్పము, మన్వంతరము. కృతయుగం- 17,28,000 సంవత్సనాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాల వయస్సులు కలిగి ఉన్నాయి. ఈ నాలుగు యుగాలను కలిపి ‘మహాయుగం’ అంటారు.

12/25/2015 - 23:58

మాట్లాడితే మనసేమిటో తెలుస్తుంది తప్ప పోయేదేమీ వుండదు. అవసరం వుంటే తప్ప పెదవి కదపనివారు వౌనమునులుగా చెలామణవుతారా? అవకాశవాదులుగా మిగిలిపోతారా? సందర్భం కాకపోయినా ఏదిపడితే అది మాట్లాడేవారు అధిక ప్రసంగానికి చిరునామాగా వుండిపోతారా? ఒక్కొక్క ప్రశ్నకు విభిన్నమైన సమాధానాలు సైతం మాటల రూపంలోనే వినిపిస్తుంటాయి.

12/24/2015 - 22:40

‘నేషనల్ హెరాల్డ్’ స్వాతంత్య్ర సమర కాలంలో అఖిల భారత కాంగ్రెస్ భావాలను బాగా ప్రచారం చేసిన పత్రిక. 1940 దశకంలో ఆ పత్రికకు ఎం.చలపతిరావు సంపాదకులుగా ఉండేవారు. ఆయన నెహ్రూ మిత్రుడు. నెహ్రూ రాజకీయ నాయకుడే కాదు, ఉద్విగ్నమైన ‘నేషనల్ హెరాల్డ్’ అనుభవాలతో పాలుపంచుకున్న ప్రతినిధి కూడా. ఒకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నెహ్రూ పర్యటన ఏర్పాటైంది.

12/24/2015 - 22:39

అయుత చండీయాగం ఒక అపూర్వమైన యోగం. తెలంగాణ రాష్ట్రానికే కాదు తెలుగు ప్రజలందరికీ కీర్తి ప్రతిష్ఠలను, దైవానుగ్రహాన్ని కలిగించే సుయోగం. ‘‘అగ్నిముఖావై దేవాః’’ అన్నది వేదవాక్యం. ‘‘అగ్ని మీళే పురోహితం’’ అనేది ప్రథమ వేదమైన ఋగ్వేదంలోని ప్రథమ మంత్రం.

12/24/2015 - 04:11

మీకు న్యాయం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిఎస్‌సి-98 క్వాలిఫైడ్ టీచర్లకు గతంలో హామీ ఇచ్చారు. ఈ హామీపై గత ఆరునెలలుగా ఢిఎస్‌సి క్వాలిఫైడ్ టీచర్లు కొండంత ఆశతో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్టల్రోని కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన సుమా రు వెయ్యిమంది క్వాలిఫైడ్ టీచర్లు తెలంగాణ సచివాలయం, విద్యాశాఖ మంత్రి చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

12/24/2015 - 04:11

నేను తరగతి గది నుంచి రాగానే టీచర్స్ రూమ్‌కు వెళ్లేవాణ్ణి. నాగలి విడిచిన ఎద్దు మాదిరిగా కాకుండా బడి విడిచిన పిల్లవాడు తల్లి దగ్గరకు వచ్చినట్లు వెళ్లేవాణ్ణి. ఆనాడు టీచర్స్ రూమ్ అంటే అదొక విద్యామండలి. ఎవరికివారుగా వాళ్ల సొంత విషయంకన్నా ప్రతివాడు తరగతి గదిలో ఏం జరిగిందో చర్చకు పెట్టేవారు. ప్రతి ఉపాధ్యాయుడు అన్ని క్లాసులకు పోడు. ఈ చర్చవలన ప్రతి ఉపాధ్యాయుడికి ఏ తరగతిలో ఏం జరుగుతున్నదో తెలిసేది.

12/23/2015 - 03:14

తెలుగు భాష అజంత భాష. అజంత భాష అంటే అచ్చులతో అంతమయ్యే భాష అని అర్థం. రామయ్య, సీతమ్మ, సుబ్బమ్మ ఇవన్నీ అజంత పదాలు. భాష కూడా ముత్యాల్లా గుండ్రంగా ఎవరినైనా ఆకర్షిస్తుంది. తెలుగు సాహిత్య పరిణామక్రమాన్ని నన్నయ యుగంతో మొదలుపెడ్తే అప్పటి నుంచి ఇప్పటివరకు భాష అనేక మార్పులు చెంది కాలానుగుణంగా ఆధునిక భాషగా పరివర్తన చెందింది. నన్నయకు ముందున్న కాలాన్ని ప్రాఙ్నన్నయ యుగమంటారు.

Pages