S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/03/2017 - 21:04

మానవ పరిణామ క్రమం, ఆర్థిక పురోగతి ఎక్కువ భాగం నదుల పరీవాహక ప్రాంతాల్లోనే జరిగినట్టుగా చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నది. నదీజలాలను వినియోగించుకోవడంలో మనం విఫలమవుతునే వున్నాము. వృధాగా సముద్రాల పాలవుతున్న నదీ జలాలను వినియోగించుకునేందుకు అనుసంధాన ప్రాజెక్టులను నిర్మించి బంజరు భూములను సాగులోకి తీసుకురావాలని మొదటి ప్రధాని నెహ్రూ సంకల్పించారు.

10/01/2017 - 23:33

ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నప్పటికీ భారత్‌లో జాతీయ స్థాయిలో ఈ సంఖ్య తగ్గకపోగా ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంలో భారత్ ప్రపంచంలోనే ఆందోళన కలిగిస్తున్న దేశంగా ఉంది. ‘లానె్సట్’ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ -2016 నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.

09/30/2017 - 00:08

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం నుంచి తెలుగును విధిగా పాఠశాలలోనే కాదు ఇంటర్మీడియెట్ వరకు ఒక సబ్జెక్టుగా బోధించేలా చూస్తామని ఓ తెలుగు రాష్ట్రంలో ప్రకటిస్తే ప్రజలు ఆనంద పడిపోతున్నారంటే ఇంతకు ముందు తెలుగుకి తెలుగు వాళ్లిస్తున్న గౌరవం ఏమిటో మనకు అర్థమవుతుంది.

09/29/2017 - 00:18

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో వాయుకాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మిగతా పట్టణాలలోని ప్రజలతో పోలిస్తే ఇక్కడి కాలుష్యం కారణంగా స్థానికులు సగటున రెండున్నర ఏళ్ల జీవన కాలాన్ని నష్టపోతున్నారు. వాయుకాలుష్య ప్రమాణ పరిమాణాన్ని తేలికపాటి లక్ష్యంతో నిర్ధరించడం ఈ సమస్యకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

09/27/2017 - 19:22

హిందూ సంప్రదాయంలో జ్యోతిషానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. నిజానికి ఇది ఒక శాస్త్రం. సనాతన జ్యోతిష శాస్త్రాన్ని పరిరక్షించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో భాగంగానే హైదరాబాద్‌లో ఇటీవల తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు నిర్వహించారు. జ్యోతిషంలో నిష్ణాతులైన పండితులు, సిద్ధాంతులు, యువ సిద్ధాంతులు పాల్గొని తమ అనుభవాలను, వాదనలను, పరిశోధనాపత్రాలను సమర్పించారు. జ్యోతిష శాస్త్రం ప్రధానంగా రెండు భాగాలు.

09/27/2017 - 00:54

ఆర్మ్‌డ్ రివల్యూషనరీ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా (్ఫర్క్) ఇప్పుడు పార్లమెంటరీ రాజకీయాల్లోకి వచ్చింది. కొత్త రాజకీయ పార్టీగా ఇటీవల అవతరించింది. పార్టీ పతాకాన్ని ప్రణాళికను ప్రకటించింది. బగోటా నగరంలో జరిగిన పరివర్తన ర్యాలీలో అశేష ప్రజలు పాల్గొన్నారు. గెరిల్లాల మాజీ నాయకుడు టిమోచెంకో ఉత్తేజకర ప్రసంగం చేసారు. భారతదేశానికి చెందిన శ్రీశ్రీ రవిశంకర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

09/26/2017 - 00:31

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనుంచి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా మూడేళ్లుగా ముందడుగులు వేస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని పాలించిన అందరి ముఖ్యమంత్రులకంటే సుదీర్ఘ అనుభవం వున్న చంద్రబాబుకు దీక్షాదక్షతలకు కొదువలేదు. నదీ జలాల సద్వినియోగం, నగర నిర్మాణాలు ప్రధాన ఎజెండాగా పోలవరం, అమరావతి రెండూ రాష్ట్ర ప్రభుత్వ సామర్ధ్య ప్రచార లక్ష్యాలుగా పరిణమించాయి.

09/24/2017 - 00:28

ప్రస్తుత అధునాతన ప్రపంచం నాల్గవ పారిశ్రామిక విప్లవ కాలగమనంలో పురోగమిస్తోంది. రెండు శతాబ్దాలలో సాధించిన శాస్ర్తియ జ్ఞానానే్వషణతో, అధునాతన నాగరికతా సమాజం సంతృప్తి చెందినా తన అనే్వషణ ఆపలేదు. మానవ మేధ సంపన్నత క్రమేపీ అంతర్జాల ప్రజ్వలనంతో సమ్మిళితమై దూసుకుపోతోంది.

09/22/2017 - 23:35

కేంద్ర మాజీమంత్రి, ఎఐసిసి నాయకుడు ఎస్.జైపాల్‌రెడ్డి ఇటీవల జరిగిన కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆక్షేపిస్తూ చేసిన వ్యాఖ్యలు అబద్ధాలు, అభూతకల్పనలే.

09/22/2017 - 00:09

భాగ్యనగరంలో ఏఏ ప్రాంతాల్లో వాయుకాలుష్యం ఏ పరిమాణంలో ఉందో తెలుసుకునే సౌలభ్యాన్ని ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫేస్‌బుక్ అందిస్తున్న ‘చాట్‌బాత్’ అనేది మెసేజింగ్ యాప్. ఫేస్‌బుక్ వినియోగదారుడు నగరంలో ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలుపుతూ ఆ ప్రాంతంలో వాయుకాలుష్యం ఏ పరిమాణంలో ఉందో తెలుసుకునేందుకు ఈ చాట్‌బాత్ యాప్ ద్వారా ఓ మెసేజ్ పెడితే చాలు.

Pages