S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/22/2017 - 23:51

1947 ఆగస్టు 15 నాటికి ముందు భారతదేశం బ్రిటన్ దేశస్తుల కబంధ హస్తాల్లో బంధింపబడింది. భారతీయులను తమ కట్టుబానిసలుగా భావిస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలను ధ్వంసం చేస్తూ సర్వసంపదను బ్రిటిష్ పాలకులు వారి దేశానికి తరలించుకుపోతుండేవారు. భారతదేశంలోని భూభాగాలను క్రైస్తవ మత ప్రార్ధనా మందిరాల ఆస్తులుగా మార్చుకునేవారు.

08/22/2017 - 00:37

పంజాబ్‌లో అకాలీదళ్-బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని కా దని ప్రజలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఎందుకని..? అక్కడ చండీగఢ్ నగరం కొలంబియాలాగా మారింది. నెదర్‌లాండ్స్, కొలంబియా, మెక్సికో, జర్మనీల్లో నేడు మాదక ద్రవ్యాల ఉత్పత్తి కుటీర పరిశ్రమలా మారింది. ఎన్నికలు వచ్చినపుడు ప్రజలకు పలు రకాల తాయిలాలు అందించటం భారత్‌లో అన్ని రాజకీయ పార్టీలకూ అలవాటే.

08/20/2017 - 00:18

ఈ దేశం నాకేమిచ్చింది?’ అని ప్రశ్నించేవారు ‘దేశం కోసం నేనేమి చేసాను..’ అన్న ప్రశ్న వేసుకోవాలి. పౌరహక్కుల గురించి ప్రశ్నిస్తూ సమ్మెలు, ఉద్యమాలు చేసేవాళ్ళు సమాజం పట్ల తమకున్న బాధ్యతను గుర్తించగలగాలి. అంతేగానీ ప్రతిదానికీ.. ప్రభుత్వం తన ఇంటి ముందుకు నడిచొచ్చి సహాయం చేయాలని ఆశించటం, రాకుంటే గగ్గోలు పెట్టడం అవగాహనా రాహిత్యం అనిపించుకుంటుంది.

08/19/2017 - 00:19

విప్లవాల పురిటిగడ్డగా భావించే లాటిన్ అమెరికాలోని వెనిజులాలో ఇప్పుడు అరాచకం రాజ్యమేలుతోంది. ఆధునిక సోషలిజం ఏర్పాటు చేస్తామన్న ఆ దేశంలో ఆహారం అందక ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. అక్కడ ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని నగరాల్లో నీటి సరఫరా సైతం సరిగా లేక ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు.

08/18/2017 - 00:33

దేశంలో ఉగ్రవాదం పొట్టన పెట్టుకున్న ప్రాణాల కన్నా ఉదాసీనత బలికోరిన ప్రాణాలే అత్యధికం. వివిధ సమస్యలపై బాధ్యుల నుండి జవాబుదారీతనంతో కూడిన ప్రతిస్పందన కన్నా- తప్పును నెట్టివేసే ధోరణి, తప్పించుకునే వైఖరి ప్రబలిపోవడం ఓ సామాజిక వ్యాధిలా ముదిరింది. దీనివల్ల సమస్య పక్కదోవ పట్టడమో, ముదిరిపోవడమో జరిగి మరింత ప్రమాదకరంగా తయారవుతోంది.

08/17/2017 - 01:03

వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలున్నందున ‘ఆధార్ కార్డు’ను తప్పనిసరి చే యడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతుందని కొందరు వ్యక్తులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. దా నిపై తుది తీర్పును ప్రకటించడానికి ముందు- అసలు ‘వ్యక్తిగత గోప్యత’ అనేది రాజ్యాంగం ప్ర కారం ప్రాథమిక హక్కు అవుతుందా? లేదా?

08/15/2017 - 23:31

గొర్రెల పెంపకం అంటే మనలో చాలా మందికి ఇంకా సరైన అవగాహన లేనట్టుగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్టు ప్రకటించగానే ప్రతి అంశాన్ని రాజకీయంగా విమర్శించాలని అనుకునే కొందరు సరైన అవగాహన లేక విమర్శలు చేశారు. కానీ వివిధ దేశాల్లో గొర్రెల పెంపకం ఎంత లాభసాటిగా సాగుతోందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

08/15/2017 - 00:49

ఎందరో త్యాగధనుల పోరాటం ఫలితంగా మన దేశానికి విదీశీయుల పాలన నుంచి విముక్తి కలిగింది. దేశానికి స్వా తంత్య్రం సిద్ధించి ఇప్పటికి 70 వసంతాలు పూర్తయ్యాయి. నేడు జాతి యావత్తూ 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా- దేశానికి స్వాతంత్య్రం ఎలా వచ్చిందో మనం సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉం ది.

08/13/2017 - 00:11

పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ స్థాయిల్లో పరీక్షలు నిర్వహించడం చాలాకాలంగా జరుగుతున్నదే. వి ద్యాభ్యాసంలో ఒక్కొక్క ఘట్టం ముగిశాక పరీక్షలు జరపడం ఆనవాయితీ. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యా క కొన్ని నెలల తరువాత లేదా సంవత్సరాంతంలో పరీక్షలు జరిపినపుడు విద్యార్థులు తాము నేర్చుకున్న మేరకు ప్రశ్నలకు జవాబులు రాస్తారు. మార్కుల ద్వారా విద్యార్థి ప్రతిభను అంచనా వేసి పై తరగతికి పంపడం జరుగుతుంది.

08/10/2017 - 00:15

హైదరాబాద్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు కొనసాగించడం వెనుక పెద్ద కుట్ర దాగివుంది. ముఖ్యంగా యువతను పెడత్రోవ పట్టించేందుకు ఓ వ్యూహం ప్రకారం డ్రగ్స్ మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారతదేశంలో యువత 60 శాతం పైన వుంది.

Pages