S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/09/2017 - 00:02

వివిధ దేశాలతో తన ఆర్థిక కార్యకలాపాలను నిర్వర్తించుకునే నెపంతో చైనా ‘సిల్క్‌రోడ్ ఎకనమిక్ బెల్ట్’, ‘మారిటైం సిల్క్‌రోడ్’లను నిర్మిస్తోంది. భూమార్గం గుండా వివిధ దేశాలను కలుపుకుంటూ ఎకనమిక్ కారిడార్లను ఏర్పాటు చేయడానికి ‘సిల్క్‌రోడ్ ఎకనమిక్ బెల్ట్’ రూపొందింది. పసిఫిక్, హిందూ, అరేబియా సముద్రాల్లోని దేశాలను మణిహారంలా కలుపుతు ఎకనమిక్ కారిడార్లు ఏర్పాటు చేయడానికి ‘మారిటైం సిల్క్‌రోడ్’ ఏర్పాటవుతోంది.

08/07/2017 - 23:30

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అపురూపమైన పోరాట స్ఫూర్తిని రగిలించి, స్వరాజ్య సాధన ఉ ద్యమ ప్రస్థానాన్ని మలుపుతిప్పిన మహోజ్జ్వల ఘట్టం- ‘క్విట్ ఇండియా’ సమరం. అందుకే దేశ చరిత్రలో క్విట్ ఇండియా నినాదం ఇచ్చిన 1942 ఆగస్టు 8వ తేదీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.

08/05/2017 - 23:34

విద్యా ప్రణాళిక- ‘కరిక్యులం’ భావాన్ని ఒకసారి గమనిస్తే కరిక్యులం లాటిన్ పదం. ‘కరిరే’ నుంచి గ్రహింపబడింది. దీని అర్థం పరుగెత్తడం. గ మ్యా న్ని చేరుకునే ఉద్దేశంతో పరుగెత్తడానికి సహకరించే కోర్సుగా దీని భావించవచ్చు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేది విద్యా ప్రణాళిక. పాఠ్య ప్రణాళికలో ఉన్న అంశాలను బోధనాభ్యాసన కృత్యాల ద్వారా సాధించేందుకు రూపొందినదే పాఠ్యగ్రంథం లేదా వాచకం.

08/05/2017 - 02:17

రాజుల కాలం పోయి ప్రజల కాలం వచ్చినా, రథాల రాచరికపు పోకడలు పోయి బుగ్గకార్ల విఐపీ సంస్కృతి వచ్చినా- ఈ మధ్యనే అదీపోయి పాలకుడంటే ‘ప్రజాసేవకుడు’, ‘పబ్లిక్ సర్వెంట్’ అన్న అత్యద్భుత ఆదర్శ భావం ప్రచారంలోకి వచ్చినా ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు మారడం లేదు. ఆ వెనకటి రాజుల దర్జాలు, అధికార అహంకారాలు తొలగిపోవడం లేదు.

08/04/2017 - 00:41

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు ఉన్నా, ప్రత్యేకంగా అధికారులను నియమించినా ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. ఏటా పెద్ద సంఖ్యలో బాల కార్మికుల్ని పాఠశాలల్లో చేర్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఇంకా అనేక చోట్ల బాలలు కాయకష్టం చేస్తూనే ఉన్నారు. ఆటపాటలతో, చదువులతో సరదాగా గడపాల్సిన ఎంతోమంది పిల్లలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

08/03/2017 - 00:14

బ్రిటిష్‌వారి పాలనా కాలంలో మెకాలే రూ పొందించిన విద్యను, వారి భాషయిన ఆం గ్లాన్ని మనపై అప్పటి పాలకులు రుద్ద ప్రయత్నించడం వారి నిరంకుశ పాలనకు నిదర్శనం. సంస్కృతాన్ని ‘మృత భాష’గా వారు ప్రకటించారు. ఆంగ్లాన్ని మాధ్యమంగా చేసి పాఠశాలలు నడిపిద్దామనే వారి పథకం ఎక్కువ కాలం సాగలేదు. ప్రాంతీయ భాషలలోనే దాదాపు అన్ని పాఠశాలల్లో విద్య బోధింపబడేది. మా తరం వారంతా మాతృ భాష మాధ్యమంలో చదువుకున్నవారమే.

08/01/2017 - 00:20

‘‘తాటిచెట్టు ఎందుకు ఎక్కావు?’’ అంటే ‘‘దూడ మేత కోసం’’ అన్నాడట ఒక ప్రబుద్ధుడు.
‘‘తాటిచెట్టుమీద దూడ మేత ఉంటుందా?’’ అంటే ‘‘లేదని తెలిసింది గనుకే కిందకి దిగుతున్నాను’’ అన్నాడట.
‘‘్ఫలిం ఇండస్ట్రీలో ఎందుకు చేరావు?’’ అంటే, ‘‘కళాపోషణ కోసం’’ అన్నాడట ఇంకొకడు.
‘‘ఇండస్ట్రీ ద్వారా కళాసేవ జరుగుతుందా?’’ అంటే-

07/30/2017 - 01:07

కూడు, గూడు, గుడ్డ మనిషికి ప్రాథమిక అవసరాలు. విద్య ప్రాథమిక హక్కు. విద్య అవసరాన్ని గుర్తించి భారత రాజ్యాంగం అధికరణ 15(1) 16(1)ల ప్రకారం కులం ,మతం, జాతి, వర్గం, లింగ వివక్ష లే కుండా అందరూ చదువుకొనేందుకు అవకాశాలను కల్పించింది. 6 నుంచి 14 ఏళ్లలోపు బాలలకు ఆర్టికల్ 45 ప్రకారం నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టి, ఈ లక్ష్య సాధనకు పంచవర్ష ప్రణాళికలను రూపొందించింది.

07/29/2017 - 00:12

ఇంకా వసంత ఋతువు రాకముందే ‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది’ అన్నట్లు ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉండగానే ఈమధ్య వైకాపా ‘మ్యానిఫెస్టో’ కోయిల కూసేసింది. అది తొందరపాటు కాదు, రాజకీయ వ్యూహం అని కొంతమంది అంటున్నారు. అ యితే అయి ఉండవచ్చు.. ఎందుకంటే ఈమధ్యనే వైకాపా అధినేత జగన్ కొత్తగా ప్రశాంత్ కిశోర్ అనే వ్యూహకర్తను కొన్ని కోట్ల రూపాయల ఫీజుతో రంగప్రవేశం చేయించాడు. ఇంతకుముందు ఈయన తన రాజకీయ చాతుర్యంతో..

07/27/2017 - 00:43

మన పాలకులు ఇచ్చిన అందమైన నినాదం ‘పేదరిక నిర్మూలన’. ఈ మంత్రాన్ని దశాబ్దాల తరబడి పఠిస్తూనే ఉన్నా పరిస్థితుల్లో అంతగా మార్పు లేదన్నది నిజం. ఒకప్పుడు సంపన్న దేశమైన భారత్- దురాక్రమణదారులైన ముసల్మాన్లు, బ్రిటిష్ వారి శతాబ్దాల పాలనతో పేద దేశం అయింది. ఇప్పటికీ దేశంలో అత్యధికులు పేదరికంలో మగ్గుతున్నారు. స్వాతంత్య్రం వచ్చాక వయోజన ఓటు హక్కుతో పేదలు రాజకీయ నాయకుల భాగ్య నిర్ణాయకులైనారు.

Pages