S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/24/2017 - 23:58

పర్యావరణంపై పిల్లల్లో అవగాహన పెంచేందుకు ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాషల్లో పాఠ్యాంశాలను రూపొందించాలి. మన దేశంలో అమలులో ఉన్న ‘పర్యావరణ పరిరక్షణ చట్టం-1986’ ప్రకారం ఐక్యరాజ్యసమితి నిర్ణయాలను క్రమం తప్పకుండా అమలు పరచాలి. కాగా, ప్రపంచంలోనే తొలిసారిగా 1950లో ‘న్యూయార్క్ స్టేట్ కాలేజ్ ఆఫ్ ఫారెస్ట్రీ సైరుక్యూజ్ యూనివర్సిటీ’ పర్యావరణంపై డిగ్రీ కోర్సు ప్రారంభించింది.

07/23/2017 - 23:40

నానాటికీ విస్తరిస్తున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి బ్యాంకులు ‘రోబో’లను వినియోగించుకుంటున్నాయి. దీంతో బ్యాంకులకు అనవసర ఖర్చు, ఖాతాదారులకు విలువైన సమయం ఆదా అవుతుంది. బ్యాంకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రోబో తలమీద ‘హై డెఫినిషన్’ కెమెరాలు, వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

07/22/2017 - 00:09

మన దేశానికి ఘనమైన చరిత్ర ఉన్నట్లే మన జాతీయ పతాకానికి కూడా ఒక విశిష్టత ఉంది. విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ సూచనను అనుసరించి పింగళి వెంకయ్య ఒక పతాకాన్ని రూపొందించాడు. ఆ పతాకంలో ఎరుపు, ఆకుపచ్చ రంగులు, మధ్యలో చరఖా ఉన్నాయి. గాంధీజీ సలహా ప్రకారం పతాకంలో తెలుపు రంగును చేర్చారు. ఆ జెండాను కాంగ్రెస్ సమావేశాలలో ఎగురవేస్తూ ఉండేవారు.

07/20/2017 - 03:41

అగ్ర, నిమ్న కులాలనే హిందూ సామాజిక వ్యవస్థ మానవత్వానికీ, సమానత్వానికీ శత్రువు కాబట్టి ఆ వ్యవస్థ అంతం కావాలని దా దాపు వంద సంవత్సరాల నుంచి ఎందరో సం స్కర్తలు బోధిస్తూ వచ్చారు. అంటరానితనం, దేవాలయ ప్రవేశ నిషిద్ధం, కొన్ని కులాల ఆధిపత్యం ఇవన్నీ అదృశ్యం కావాలని గొప్ప వ్య క్తులు, సంస్థలు ఉద్యమాలు చేపట్టిన విషయం తెలిసిందే.

07/19/2017 - 01:14

ఏపి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ 25.10.2016 తేదీతో తీసుకువచ్చిన జి.ఓ.నెం.262 జనంలోకి రాగానే ఒక్కసారి కలవరం మొదలైంది. ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు తల్లిదండ్రుల కోరిక మీదే ఆంగ్ల మాధ్యమంలోనే అన్ని మున్సిపల్ పాఠశాలల్లోనూ విద్యాబోధన జరుగుతుందన్నది ఆ ప్రభుత్వ ఆజ్ఞాపత్రం సారాంశం! ‘తెలుగు మాధ్యమంలో చదివితే పిల్లల భవిష్యత్తు శూన్యం.

07/18/2017 - 00:01

శ్రామిక శక్తే సంపదకు మూలమని సూత్రీకరించిన అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ (1773-90) ఏ దేశానికైనా నె పుణ్యత గల శ్రామికులు అవసరమని కూడా అన్నాడు. శ్రమ విభజన (వివిధ వర్గాలకు చెందినవారు వివిధ వృత్తులు చేపట్టడం) మంచిదని, అందువల్ల నైపుణ్యత పెరుగుతుందని ఆయన భావించాడు. కాగా, ఇటీవలి కాలంలో జనాభా సమస్యను ఆర్థిక వేత్తలు వివిధ కోణాల నుంచి పరిశీలించి లోతుగా అధ్యయనం చేశారు.

07/17/2017 - 01:03

అంతర్జాతీయ స్థాయి పోటీలలో మన దేశం నుంచి జుంబో జుట్టు పాల్గొనడం, అరకొరగా పతకాలు సాధించడం- అటు మీడియా నుంచి ఇటు రాజకీయ పార్టీలవరకు అందరూ గగ్గోలు పెట్టడం. పాలక పక్షం విమర్శల తాకిడినుంచి బయటపడటానికి సమగ్ర క్రీడా విధానంను ప్రవేశపెడుతున్నామని, భవిష్యత్‌లో మన క్రీడాకారులు అద్భుతంగా అంతర్జాతీయ పోటీలలో రాణిస్తారని సుద్దులు చెప్పడం.

07/16/2017 - 01:15

క్రీ.శ.500-1200 మధ్యకాలం భారతదేశ ఖగోళ శాస్త్రానికి స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. ఆ కాలంలోనే ఖగోళ శాస్త్రాన్ని గణితశాస్త్రంతో మేళవించి ఎన్నో అద్భుత విషయాలను చెప్పిన భాస్కరాచార్యుడు జన్మించాడు. 12 వ శతాబ్దానికి చెందిన ఈయన ప్రముఖ ఖగోళ, గణిత శాస్తజ్ఞ్రుడిగా ప్రసిద్ధి చెందాడు. దశాంశ పద్ధతికి సంబంధించి సమగ్ర వివరణతో పుస్తకం రాసిన తొలి వ్యక్తి ఈయనే.

07/15/2017 - 00:39

ప్రాచీన కాలం నుండి మధ్య యుగాలు ముగిసే వరకూ ఏ దేశంలోనైనా చక్రవర్తి లేదా మహారాజు సర్వం సహాధిపతులుగా పాలించేవారు. వారు చేయాలనుకున్నదీ, చేసిందే చట్టం! ప్రజాభిప్రాయంతోను, ప్రజావసరాలతోనూ వారికి సంబంధం లేదు. రాచరిక ఆధిపత్యానికి లోబడి వారి విలాసాలకు, వారు చేసే యుద్ధాలకూ ప్రజలు పన్నులు కడుతూ కష్టాలు భరించాల్సిందే.

07/14/2017 - 00:48

సుమారు ఏభై ఏళ్ల క్రితం ప్రఖ్యాత నటుడు ఎం.బాలయ్య నిర్మించిన చిత్రం పేరు ‘నేరము- శిక్ష’. అందులో విలన్ సత్యనారాయణ- ‘బ్యాంకుకు కన్నం వేస్తే మనకు డబ్బుకు కొదవే వుండదు, మనం పట్టుపడితే మాత్రం డబ్బు అవసరమే ఉండదు’ అంటాడు. అలాగే నేటి మన సమాజంలో పాశ్చాత్య వినిమయ మోజుతో నేర మనస్తత్త్వం, అరాచకాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, అత్యాచారాలు సర్వ సామాన్యమైపోయాయి.

Pages