S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/03/2017 - 00:53

నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనకాల ఆరెస్సెస్ హస్తం ఉంది. ఆరెస్సెస్ ఎజెండానే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దేశాన్ని పాలించేది భాజపా కాదు ఆరెస్సెస్ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్యూనిస్టు నాయకులు ఇటీవల ప్రకటనలు తెగ గుప్పిస్తున్నారు. భాజపాని ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నా కూడా వారింకా భాజపాని మతతత్వ పార్టీ అని చెప్తూనే ఉన్నారు.

07/02/2017 - 00:10

మనం ఐదుగురం.. కౌరవులు నూరుమంది. ఈ ఉ భయ పక్షాల మధ్య శత్రుత్వం ఉన్నా మనపై బ యటి వాళ్లు దాడికి వస్తే మనం నూటఐదుమందిమే! దు ర్యోధనుడిని గంధర్వుడు బంధించినప్పుడు ఆయనను విడిపించమని ధర్మరాజు తన సోదరుడైన భీముడికి హితవు పలుకుతాడు. అందుకు ‘ససేమిరా’ అని భీష్మించిన భీముడితో ధర్మరాజు చెప్పిన హితోక్తులివి!

07/01/2017 - 00:52

గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ రానున్న సంవత్సర కాలంలో ఆరు రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికలలో సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది. రాబోయే ఎన్నికలలో పార్టీ పరిస్థితిని మెరుగుపచుకోవడానికి ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ ఏడాది జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో మాత్రమే అధికారాన్ని సంపాదించింది.

06/30/2017 - 00:26

ప్రకృతి అంటే చెట్లూ చేమలు, కొండకోనలు, నదులు, పర్వతాలు మా త్రమే కాదు. పక్షులు, జంతువులు, జలచరాలు-సమస్త జీవరాశి కూడా. అనంతంగా సాగే ప్రకృతి సమగ్ర జీవన గమనంలో ఇవన్నీ వివిధ అంగాలు. ప్రకృతిలో ఇవన్నీ పరస్పర విరుద్ధములైన ప్రవృత్తితో, వ్యతిరేకాత్మక గుణములతో కనిపించినప్పటికీ ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒకదాని అవసరాన్ని మరొకటి తీర్చేందుకు ప్రకృతి సహజ సిద్ధంగా చేసిన ఏర్పాటు.

06/29/2017 - 00:29

పుట్టుకతోనే బుద్ధిజీవి, విచక్షణాజ్ఞాని అయిన మనిషి స్వార్థపూరిత మనస్తత్వంతో మంచిని, మానవత్వాన్ని మరిచి ఎలా ప్రవర్తిస్తాడో అర్థం కాదు. కలసిమెలసి ఉండే తత్త్వం, ఆపదలో వున్న సాటిజీవిని ఆదుకొనే కరుణ మనం పశువుల్లోనూ, పక్షుల్లోనూ చూ స్తుంటాం. అలాంటిది మహోన్నతమైన మానవజన్మ ఎత్తినవాడిలో మోసం, కుట్ర, అవినీతి, అమానవీయత, అమానుషత్వం ఆశ్చర్యాన్ని కలిగించే అవలక్షణాలు అనేకం చూస్తున్నాం.

06/28/2017 - 02:06

ఇప్పుడు ఏ దేశంలోనైనా డిజిటల్ వర్క్ఫోర్స్, కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే యంత్రాల రాకతో ‘శ్రమశక్తి’ నిర్వచనం పూర్తిగా మారిపోయిం ది. అయితే, దీన్ని కమ్యూనిస్టులు, నక్సలైట్లు-మావోయిస్టులు ఇప్పటికీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కూడు, గూడు, గుడ్డ ప్రజలకు అందేలా ‘క మ్యూనిస్టులు’ కష్టపడి పని చేస్తారని చాలామంది నేటికీ భావిస్తారు.

06/27/2017 - 00:14

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి అటు జీవనోపాధిని ఇటు పౌష్టికాహారాన్ని సముద్రాలు అందిస్తున్నాయి. ప్రపంచ పటంలో మూడు వంతులకు పైగా సముద్రాలు విస్తరించి ఉన్నాయి. ప్రకృతి సంపదలో సముద్ర జలాలది కీలక స్థానం అయినప్పటికీ రానురానూ అవి కాలుష్యం బారిన పడుతున్నా యి. మనం యథేచ్ఛగా సముద్ర జలాలను కలుషితం చేస్తూ, సముద్ర జీవుల మనుగడకే ముప్పు ఏర్పడే విధంగా వ్యవహరిస్తున్నాం.

06/26/2017 - 01:02

చేనేత ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది. వరుస ప్రభుత్వాలు సృష్టించిన విలయంలో నేతన్న బయటకు రాలేక... అందులో ఇమడ లేక చచ్చిపోతున్నాడు. ప్రభుత్వాలకు మాత్రం నేతన్న ఓట్లు కావాలి కానీ... నేతన్న సంక్షేమం మాత్రం అక్కర్లేదు. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి చూపిస్తున్న నేతను పాలకులు బలిపీఠం ఎక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నేతన్న ఓట్లతో గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం...

06/25/2017 - 00:33

ఏదైనా ఒక సంఘటన జరిగితే దానికి కారణమేమిటన్న ప్రశ్న సహజంగా తెరపైకి వస్తుంటుంది. అదే రాజకీయాల్లో అయితే తప్పు పదవి ఇచ్చిన వారిదా? తీసుకున్నవారిదా? అన్న చర్చ జరుగుతుంటుంది. ఇప్పుడు చంద్రబాబునాయుడు-ఐవైఆర్ కృష్ణారావు వ్యవహారంలో సరిగ్గా అలాంటి చర్చనే జరుగుతోంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఏరికోరి తీసుకున్న కృష్ణారావును అవమానకర పరిస్థితిలో తొలగించిన అనంతర పరిణామాలు వివాదానికి గురయ్యాయి.

06/24/2017 - 01:03

‘‘ఓంద్యౌ శాంతిః అంతరిక్షగ్‌ం శాంతిః ఫృథ్వీ శాంతిః ఆపః శాంతిః ఓషధయః శాంతిః వనస్పదయః శాంతిః విశ్వదేవా శాంతిః బ్రహ్మ శాంతిః శాంతి రేవ శాంతిః సామా శాంతి రేధీ ఓం శాంతిః శాంతిః శాంతిః’’
ఇది అధర్వణ వేదం మానవ మనుగడకు మూలాధారంగా చెప్పిన సూక్తి. ప్రకృతితో మానవులకు గల సంబంధాన్ని తెలియజేయడమేకాక, సుఖమయ జీవనానికిగల పునాదులేవో నిర్వచించారు పూర్వ ఋషులు.

Pages