S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/23/2017 - 00:45

చిత్తశుద్ధితో ప్రజల సంక్షేమం కోసం ఎటువంటి పని చేయడానికైనా దీక్ష వహిస్తే ఎలాంటి ఆటంకాలు ఏర్పడవని నిరూపించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. వ్యవసాయ రంగానికి సంబంధించి ఎటువంటి మేలు చేయాలన్నా, అది అమలు సాధ్యం కాదని తడుముకోకుండా చెప్పడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంటుంది. వ్యవసాయ రుణాల మాఫీ విషయానికి వస్తే బ్యాంకు యాజమాన్యాలు ఎప్పుడూ వ్యతిరేకమే.

06/21/2017 - 01:47

ఈ లోకంలో పేదలు మరింత పేదరికంలోకి జా రుకుంటున్నారని, ఉన్నవారు మరింత సంపన్నులవుతున్నారని మార్క్సిస్టుల, మావోయిస్టుల విశే్లషణ. ఈ రెండు వామపక్ష వర్గాల వారు పోత పోసినట్టు ఒకే ఆలోచనతో మాట్లాడతారు. ఇక్కడే వారు వాస్తవాన్ని విస్మరించి ‘తప్పులో’ కాలేస్తున్నారు. చాలా ఏళ్లుగా ఈ రకమైన పొరపాటు పంథాలోనే వారు ప్రయాణిస్తున్నారు.

06/20/2017 - 01:03

‘ఇంతింతై వటుడింతై..’ అన్నట్టు సమాచార సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో ప్రవేశించి సంప్రదాయ పద్ధతుల నుండి దేశాన్ని అత్యాధునిక దిశగా మలుపుతిప్పింది. గ్రామస్థాయిలోని పంచాయతీ కార్యాలయం మొదలు అంబరవీధిలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు వరకూ సమాచార సాంకేతిక పరిజ్ఞానం అగ్రస్థానాన నిలిచింది. దాంతో మనిషి దైనందిన జీవన సరళిలోనే పెనుమార్పు వచ్చింది.

06/19/2017 - 01:41

‘‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’’ అనే నానుడిని అనుసరించడంలో మన సెలబ్రిటీలది అందెవేసిన చెయ్యి. ఏ రంగంలో అయినా తగిన గుర్తింపు రాగానే వారితో తమ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార ప్రకటనలు రూపొందించి, అమ్మకాలను పెంచుకోవడం కోసం బహుళజాతి, కార్పొరేట్ సంస్థలు ప్రయత్నించడం సర్వసాధారణం. అందువల్లనే మన సెలబ్రిటీలు కూడా తాము నటిస్తున్న వ్యాపార ప్రకటనలు ప్రజలకు ఏ మేరకు మేలు చేస్తాయి అనే విషయం ఆలోంచరు.

06/18/2017 - 01:19

ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల పేర్లు దేశమంతా మార్మోగుతున్నాయి. భూ కుంభకోణాలతో ఆంధ్ర, తెలంగాణ ‘చంద్రులు’ చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఏ పిలో అయితే ‘ఈ కీర్తి ప్రతిష్ఠలు’ దిల్లీదాకా వెళ్లాయని రెండు రాష్ట్రాల మీడియా రాజగురువులుంగారే సెలవిచ్చా రు! తెలంగాణ కూడా అందుకు మినహాయింపు కాదు. కా కపోతే ఆ విషయాలు పేపర్లో రాస్తే మళ్లీ రాజగురువుల వారికి తెలంగాణలో తెరువుండదు.

06/17/2017 - 02:05

‘ప్రార్ధించే పెదవుల కన్నా పని చేసే చేతులు మిన్న’ అన్న మాటలు పని ప్రాధాన్యతను చెప్పక చెబుతున్నాయి. అందుకే- ‘వర్క్ ఈజ్ గాడ్’, ‘వర్క్ ఈజ్ వర్షిప్’ అని, ‘పనే దైవం’, ‘పనే పూజ’ అని పెద్దలు చాలా అర్థవంతంగా, ప్రయోజనాత్మకంగా చెప్పారు. ఈ సృష్టిలో ప్రతి మనిషీ ఒక కారణజన్ముడే. చిన్నదో, పెద్దదో ఏదో ఒక పని చేసి సమాజంలోని నలుగురికి తోడ్పడేందుకే జన్మించాడు.

06/16/2017 - 00:35

‘ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు’- అన్న నానుడి ప్రస్తుతం ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా’ అయిన కాంగ్రెస్‌కు చక్కగా సరిపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు చేసిన తప్పిదాలే ప్రస్తుతం వారి పాలిట పెనుశాపంగా మారాయి. కాంగ్రెస్ నేతల వైఖరి- ‘అయితే నా గొప్ప.. కాకపోతే నీ ఖర్మ’ అన్న చందాన ఉంటోంది. దేశంలో 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాల పాలవుతున్నది.

06/15/2017 - 01:32

కృష్ణా డెల్టాకు సకాలంలో నీళ్లందించడంలో వరుసగా మూడో సంవత్సరం కూడా ఏపి ప్రభుత్వం విఫలమైం ది. ఏటా జూన్ మొదటివారంలోనే డెల్టాకు సాగునీరిచ్చేందుకు పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించామని గొప్పలు చెబుతున్న టిడిపి ప్రభుత్వం.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు వారాలు పూర్తికావస్తున్నా కాలువలకు నీటి విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందుకోసం జలవనరుల శాఖ ఎటువంటి కసరత్తు చేసిందీ లేదు.

06/14/2017 - 00:59

ఆధునిక ప్రపంచం తీరును అనూహ్యంగా మార్చిన ప్ర ముఖులలో ‘ఫేస్‌బుక్’ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఒకరు. కేవలం ముప్ఫై ఏళ్ల వయసులోనే ఆయన ఈ ఘనత సాధించారు. సామాజిక మీడియాలో సంచలన వేదికగా ‘ఫేస్‌బుక్’ను స్థాపించాక పిన్న వయసులోనే జుకర్‌బర్గ్ లక్షల కోట్ల రూపాయలు ఆర్జించి, మానవాభ్యుదయానికి భారీగా విరాళాలు ప్రకటించారు. భవిష్యత్‌లో ఇంకా పెద్దఎత్తున ధనాన్ని దానం చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు.

06/13/2017 - 00:41

ఎంతోమంది వీరుల త్యాగాల ఫలితంగా పరాయి పీడన నుంచి మన దేశం స్వాతంత్య్రం పొందింది. అనంతరం గొప్ప రాజ్యాంగాన్ని, ఎనె్నన్నో చట్టాలను అమలులోకి తెచ్చుకున్నాం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని, సమానత్వం సాధించాలని బడుగువర్గాలకు రిజర్వేషన్లను కల్పించాం. అందరికీ న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ ఉంటుందని రాజ్యాంగం భరోసా ఇచ్చింది.

Pages