S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/14/2017 - 01:42

ఐరాస, జనవరి 13: భారత్‌లో నిరుద్యోగ సమస్య మరింత జఠిలం కానుందని ఐరాస నివేదిక వెల్లడించింది. కొత్తగా ఉద్యోగాల సృష్టి లేకపోవడం, స్తబ్ధత ఏర్పడం వల్ల 2017-18 మధ్య నిరుద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని లేబర్ రిపోర్టు స్పష్టం చేసింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఉపాధి, సామాజిక మార్పులకు సంబధించి 2017 నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.

01/13/2017 - 03:05

న్యూయార్క్, జనవరి 12: బరాక్ ఒబామా ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హెల్త్‌కేర్ ప్రోగ్రాంను రద్దు చేసి దాని స్థానంలో కొత్త కార్యక్రమాన్ని ప్రకటిస్తామని త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా ఒబామా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టివేస్తూ ఈ ప్రకటన చేశారు.

01/13/2017 - 03:04

హైదరాబాద్, జనవరి 12: దిల్‌సుక్‌నగర్ బాంబుపేలుళ్ల కేసులో నిందితుడు వక్వాస్ అలియాస్ జియా ఉర్ రెహమాన్‌కు కోర్టు మరణ శిక్ష విధించిన అంశాన్ని ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీకి తెలంగాణ ప్రభుత్వం తెలియచేసింది. రాష్ట్ర జైళ్ల శాఖ హోంశాఖ ద్వారా కేంద్రానికి ఈ విషయాన్ని తెలిపింది. దిల్‌సుక్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో వక్వాస్ పాక్ జాతీయుడనే విషయం విదితమే.

01/13/2017 - 02:34

న్యూయార్క్, జనవరి 12: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ‘ఆఫీస్ ఆఫ్ ది ఫస్ట్ లేడీ’ (అధ్యక్షుడి సతీమణి కార్యాలయం) ‘ఆఫీస్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్యామిలీ’గా మారనుందని ఓ మీడియా కథనం పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వంలో ఆఫీస్ ఆఫ్ ది ఫస్ట్‌లేడీ, ఆఫీస్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్యామిలీగా మారబోతోందని ‘్ఫక్స్ న్యూస్’ కథనం పేర్కొంది.

01/13/2017 - 02:32

న్యూఢిల్లీ, జనవరి 12: భారత్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లాంటి వాటిపైన నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని ఫ్రాన్స్ గురువారం గట్టిగా కోరింది.

01/13/2017 - 01:19

వాషింగ్టన్, జనవరి 12: అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనుకునే వారు ముఖ్యంగా హెచ్-1బి, ఎల్ 1 వీసాలపై వెళ్లే భారతీయ ఐటి నిపుణులకు మరిన్ని కష్టాలు తప్పేట్లు లేవు. ఎందుకంటే అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ వీసాల నిబంధనలను మరింత కఠినతరం చేయబోతోంది.

01/12/2017 - 08:43

చికాగో, జనవరి 11: ప్రపంచ ఆధిపత్యం విషయంలో రష్యా, చైనా దేశాలు అమెరికాకు ఎంతమాత్రం సాటిరావని అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. రాజ్యాంగానికి అందులో నిబిడీకృతమై ఉన్న విలువలతో కూడిన విధానాలకు అమెరికా పౌరులు పునరంకితమైతే దేశానికి ఓటమే లేదని దేశాధ్యక్షుడిగా తన వీడ్కోలు సందేశంలో స్పష్టం చేశారు. ఏ రకమైన విలువలకోసం, వ్యవస్థకోసం దశాబ్దాలుగా అమెరికా పాటుపడుతూ వచ్చిందో వాటిని పరిరక్షించుకోవాలన్నారు.

01/12/2017 - 07:33

‘‘మనకెవరూ సాటిలేరు. చైనా, రష్యాలు ఏమీ చేయలేవు. కలిసికట్టుగా నిలబడ్డాం. భవిష్యత్తు విజయాలను సాధిద్దాం. ప్రజాస్వామ్యమే అమెరికాకు పట్టుగొమ్మ. దీన్ని పరిరక్షించుకుంటేనే భవిత. వివక్షను అంతం చేయాలి. అసమానతలను రూపుమాపాలి. అమెరికా రాజ్యాంగ పునాదులను బలోపేతం చేయడం మనందరి కర్తవ్యం. భయపడితే ప్రజాస్వామ్యానికే ముప్పు. అమెరికా ఎదుగుదలకు దోహదం చేసిన విలువలే భవితకు పునాది.

01/11/2017 - 07:49

వాషింగ్టన్, జనవరి 10: మరో పది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న బరాక్ ఒబామా నిరుద్యోగిగా ఉండాల్సిన అవసరం లేదు. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం వైట్‌హౌస్‌ను విడిచిపెట్టిన తరువాత ఒబామాకు కనీసం ఒక ఉద్యోగమైతే గ్యారంటీగా దొరికేట్లు కనిపిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ స్పూటిఫైనుంచి ఆఫర్ వస్తుందని ఆశిస్తున్నట్లు ఇటీవలే ఒబామా జోక్ చేశారు.

01/11/2017 - 07:48

వాషింగ్టన్, జనవరి 10: అమెరికా నూతన అధ్యక్షుడిగా త్వరలో పదవీ భాద్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ తన అల్లుడు జారెడ్ కష్నర్‌కు కీలక పదవిని కట్టబెట్టారు. శే్వతసౌధం సీనియర్ సలహాదారుగా ఆయనను నియమించారు. దీంతో 35 ఏళ్ల కష్నర్ వైట్‌హౌస్ టీమ్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తికానున్నారు. మధ్యపాచ్య వ్యవహారాల్లో, వ్యాపార అంశాల్లో, దేశ, విదేశీ వ్యవహారాల్లో ఆయన కీలకవ్యక్తిగా మారనున్నారు.

Pages