S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/02/2017 - 02:34

బీజింగ్, ఆగస్టు 1: తమకు చెందిన భూభాగాన్ని అంగుళం కూడా వదులుకునే పరిస్థితి లేదని, అన్ని విధాలుగా ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకుంటామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఉద్ఘాటించారు. పొరుగు దేశాలతో ప్రాదేశిక వివాదాలు తీవ్ర స్థాయిని సంతరించుకున్న నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరిక స్వరాన్ని వినిపించడం గమనార్హం.

08/02/2017 - 02:26

వాషింగ్టన్, ఆగస్టు 1: సౌర వ్యవస్థకు ఆవల నివాసయోగ్యమైన జోన్‌లో ఉన్న మనకు అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం అయిన ప్రాక్సిమా-బి జీవకోటి ఉండడానికి అనువైనది కాకపోవచ్చని, ఎందుకంటే తన వాతావరణంపై దానికి పట్టులేదని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) శాస్తవ్రేత్తలు అంటున్నారు.

08/02/2017 - 02:19

వాషింగ్టన్, ఆగస్టు 1: అగ్రరాజ్యం అమెరికాలో పనిచేయాలన్న మోజు రోజురోజుకూ పెరుగుతోంది. హెచ్-1బి వీసా పొందిన ఉద్యోగి సగటు జీతం చూస్తే కళ్లు తిరుగుతాయి. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో పనిచేసేందుకు హెచ్-1బి వీసాల కోసం గడచిన 11 సంవత్సరాల కాలంలో దరఖాస్తు చేసుకున్న భారతీయుల సంఖ్య అక్షరాల 21 లక్షలు. యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తాజా నివేదిక ప్రకారం వారి సగటు జీతం 92,317 అమెరికన్ డాలర్లు.

08/02/2017 - 02:18

ఇస్లామాబాద్, ఆగస్టు 1: పాకిస్తాన్ ప్రధానిగా షాహిద్ ఖాఖన్ అబ్బాసీని మంగళవారం ఎన్నుకున్నారు. నవాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవికి అనర్హుడిగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడంతో కొత్త ప్రధాని ఎంపిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో షరీఫ్ నేతృత్వంలోని పిఎంఎల్-ఎన్ పార్టీ నేషనల్ అసెంబ్లీలో తనకున్న మెజారిటీ సభ్యుల సహకారంతో అబ్బాసీని ప్రధానిగా ఎన్నుకున్నారు. అబ్బాసీ గతంలో పెట్రోలియం మంత్రిగా పనిచేశారు.

08/02/2017 - 01:58

వాషింగ్టన్, ఆగస్టు 1: తమ దేశానికి అత్యంత ప్రమాదకరమైన ముప్పుల్లో ఇసిస్ ఉగ్రవాద సంస్థ, వాతావరణ మార్పులని భారతీయులు భావిస్తుండగా, చైనా ఆ జాబితాలో మూడోస్థానంలో ఉందని అమెరికాకు చెందిన ‘ప్యూ రిసెర్చ్’ సంస్థ తాజాగా నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది.

07/31/2017 - 02:46

ఇస్లామాబాద్, జూలై 30: పదవీ చ్యుతుడైన నవాజ్ షరీఫ్ స్థానంలో కొత్త ప్రధాన మంత్రిని పాకిస్తాన్ పార్లమెంటు మంగళవారం ఎన్నుకోనుంది. పనామా పత్రాల కుంభకోణంలో నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై దాఖలయిన కేసుల్లో సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనను అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

07/31/2017 - 02:45

సియోల్, జూలై 30: ఉత్తర కొరియా ఇటీవల జరిపిన ఖండాంతర క్షిపణి పరీక్షలకు ప్రతిస్పందనగా అమెరికా ఆదివారంనాడు రెండు సూపర్‌సానిక్‌బి-1బి బాంబర్ విమానాలతో కొరియా ప్రాంతం మీదుగా విన్యాసాలు నిర్వహించి తన బలాన్ని ప్రదర్శించిందని అమెరికా, దక్షిణ కొరియా వైమానిక దళాలు తెలిపాయి.

07/31/2017 - 02:40

బీజింగ్, జూలై 30: తమపై దాడిచేసే శత్రు సేనలన్నింటినీ తిప్పికొట్టగలిగే ఆత్మవిశ్వాసం, సామర్థ్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి (పిఎల్‌ఏ) ఉన్నాయని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆదివారం నాడిక్కడ ఉద్ఘాటించారు. పిఎల్‌ఏ ఆవిర్భవించి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన భారీ సైనిక కవాతులో ఆయన గౌరవ వందనం స్వీకరించారు.

07/31/2017 - 02:29

లండన్, జూలై 30: పారిస్‌లో జరిగిన కారు ప్రమాదంలో ప్రిన్స్ డయానా మరణించి 20 ఏళ్లు గడిచిపోయినా బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ చార్లెస్‌తో ఆమె విఫల వైవాహిక జీవితం, ఆమె ప్రేమకు సంబంధించిన కథనాలు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి.

07/31/2017 - 02:10

మాస్కో, జూలై 30: తమ దేశంలో పని చేస్తున్న 755 మంది అమెరికా దౌత్యవేత్తలను వెళ్లిపోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం నాడు ఆదేశించారు. తాజాగా అమెరికా విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా ఆ దేశ సిబ్బందిని బహిష్కరిస్తామని రష్యా ప్రకటించిన కొద్ది వ్యవధిలోనే పుతిన్ ఈ ఆదేశాలను జారీ చేశారు.

Pages