S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/09/2017 - 08:34

కువైట్ సిటీ, మార్చి 8: కువైట్‌లో పురాతన సిల్క్ రోడ్డు వాణిజ్య మార్గాన్ని పునరుద్ధరించేందుకు దేశంలోని మారుమూల సుబియా ప్రాంతాన్ని సిల్క్ సిటీగా అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రభుత్వం దాదాపు 36 కిలోమీటర్ల(22 మైళ్ల) పొడవైన వంతెనను నిర్మిస్తోంది. ఈ వంతెన నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి.

03/09/2017 - 08:17

న్యూయార్క్, మార్చి 8: భారత్‌పై ఉగ్రదాడులకు కుట్ర పన్నాడన్న అభియోగంపై 42 ఏళ్ల ఎన్నారైకు అమెరికా కోర్టు 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఖలిస్తాన్ ఉద్యమం సందర్భంగా సహాయ, సహకారాలు అందించినట్టు బల్వీందర్‌సింగ్‌పై అభియోగం. యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లారే హీక్స్ 180 నెలలు జైలుశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారని అటార్నీ డేనియల్ బోగ్డెన్ వెల్లడించారు.

03/09/2017 - 08:16

న్యూయార్క్, మార్చి 8: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంకోసం తాత్కాలికంగా ‘వీటో’ అధికారం వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నామని భారత్ ప్రతిపాదించింది. భారత్‌తోపాటు మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కోరుకుంటున్న జి4 కూటమిలోని బ్రెజిల్, జర్మనీ, జపాన్‌లు కూడా ఈ ప్రతిపాదనను ఓకే చేశాయి. ‘్భద్రతామండలిలో వీటో అధికారం చాలా ముఖ్యమైన అంశం.

03/09/2017 - 08:16

వాషింగ్టన్, మార్చి 8: గత నెల తమ రాష్ట్రంలో భారతీయులపై జరిగిన దారుణ హింసాత్మక చర్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ అమెరికాలోని కాన్సాస్ రాష్ట్ర గవర్నర్ శాన్ బ్రౌన్‌బ్యాక్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమ రాష్ట్రంలో విద్వేషానికి, అసహనానికి తావు లేదని ఆ లేఖలో స్పష్టం చేశారు.

03/09/2017 - 07:11

వాషింగ్టన్, మార్చి 8: అమెరికాలో హెచ్-1బి వీసాల గురించి భారతీయుల్లో మరో కొత్త గుబులు మొదలయింది. హెచ్-1బి వీసాలపై అమెరికా వచ్చిన విదేశీయుల జీవిత భాగస్వాములు కూడా అక్కడ పని చేయడానికి 2015లో అప్పటి బరాక్ ఒబామా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ ‘సేవ్ జాబ్స్ యుఎస్‌ఏ’ అనే సంస్థ వాషింగ్టన్ డిసి అపీళ్ల కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది.

03/08/2017 - 03:22

వాషింగ్టన్, మార్చి 7: ఆరు ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ కొత్తగా జారీ చేసిన ఆదేశాలను ఓ పక్క వైట్‌హౌస్ అధికారులు సమర్థిస్తుంటే, మరోపక్క భారత అమెరికన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అమెరికాను సురక్షితం చేయాలనే కారణంతో వలసలపై నిషేధం విధించటంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అమెరికా కాంగ్రెస్‌లో భారత అమెరికన్ సభ్యులు ట్రంప్‌కు హితవు పలికారు.

03/08/2017 - 03:25

జకార్తా, మార్చి 7: ఉగ్రవాద నిరోధనలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, 20 హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలు తీర్మానించాయి. అలాగే ఇందుకు సంబంధించి కీలక సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని, సహకారాన్ని విస్తతం చేసుకోవాలని కూడా ఈ దేశాలు నిర్ణయించాయి. అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఐరాస తీర్మానాలను, ప్రకటనలను త్రికరణశుద్ధిగా అమలు చేయాలని సంకల్పించాయి.

03/08/2017 - 02:21

న్యూయార్క్, మార్చి 7: పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం విషయంలో 2016లో ఆసియాలో వెనుకబడి ఉన్న ఏకైక దేశం భారత్ ఒక్కటేనని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది.పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం పెరడానికి, గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో సాధించిన పురోగతి వేగాన్ని అందుకోవడానికి మరిన్ని చర్యలతో పాటుగా బలమైన రాజకీయ చిత్తశుద్ధి అవసరమని ‘2016లో పార

03/07/2017 - 02:38

వాషింగ్టన్, మార్చి 6: ఇండియన్-అమెరికన్లపై జరుగుతున్న దాడులకు సంబంధించి దర్యాప్తు వేగిరం చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా చూస్తామని అమెరికా హామీ ఇచ్చింది. మరోపక్క ఎన్నారైలపై జరుగుతున్న విద్వేషపూరితపైన దాడులపై అమెరికా విదేశాంగ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘అమెరికా ప్రభుత్వం తరఫున యుఎస్ విదేశాంగశాఖ దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది.

03/07/2017 - 02:19

జెనీవా, మార్చి 6: వాతావరణంలో పెచ్చుమీరుతున్న కాలుష్యం చిన్నారులపై పడగ చాచింది. ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు కాలుష్యానికి బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 17లక్షల మంది పిల్లలు ఈ కారణంగానే మరణిస్తున్నారని ఈ నివేదిక సోమవారం వెల్లడించింది.

Pages