S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/03/2016 - 08:51

వాషింగ్టన్, అక్టోబర్ 2: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ పన్నుల ఎగవేత వ్యవహారం ఆయన అభ్యర్థిత్వంపైనే పెను ప్రభావం కనబరిచే అవకాశం కనిపిస్తోంది. గత 18 ఏళ్లుగా ట్రంప్ అసలు పన్నులే కట్టి ఉండకపోవచ్చునంటూ తాజాగా వెలువడిన కథనంతో పరిస్థితి ఆయనకు మరింత తీవ్రంగా మారింది.

10/03/2016 - 08:29

బీజింగ్, అక్టోబర్ 2: మరో నాలుగేళ్ల కాలంలో చైనా జనాభాలోని 17 శాతం మంది 60ఏళ్లు పైబడిన వృద్ధులే కాబోతున్నారు. అంటే 2020 నాటికి చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య 240 మిలియన్లకు చేరుకుంటుందని తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో స్పష్టమైంది. దీనివల్ల చైనా ఆరోగ్య వ్యవస్థపైన తీవ్ర ప్రభావం పడుతుందని, అదే విధంగా కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుందని ఈ సర్వే స్పష్టం చేసింది.

10/03/2016 - 08:06

న్యూయార్క్, అక్టోబర్ 2:పర్యావరణ మార్పుల నిరోధానికి సంబంధించిన చారిత్రక పారిస్ ఒప్పందాన్ని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారత్ ఆదివారం ఆమోదించింది.

10/03/2016 - 08:00

బిషోఫ్టూ, అక్టోబర్ 2:ఇథియోపియా రాజధాని బిషోఫ్టూ సమీపంలో ఆదివారం జరిగిన తీవ్రస్థాయి తొక్కిసలాటలో 50మందికి పైగా మరణించారు. ఓ మత ఉత్సవం సందర్భంగా అల్లర్లు జరగడంతో పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేయడంతో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. వేలాదిగా ఓ పవిత్ర కొలను వద్దకు చేరుకున్న ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక సంకేతాలను అందించడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

10/02/2016 - 02:24

ఇస్లామాబాద్, అక్టోబర్ 1: భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ కార్యక్రమాల ప్రసారాలను తక్షణం నిలిపివేయాలని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పిఇఎంఆర్‌ఏ) దేశంలోని చానళ్లను ఆదేశించింది.

10/02/2016 - 01:03

వాషింగ్టన్, అక్టోబర్ 1: భారత్‌తో యుద్ధం వస్తే అణ్వస్త్రాలను వాడతామని పాకిస్తాన్ పేర్కొనడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని ఆ దేశానికి తెలియజేసింది. ‘పాకిస్తాన్‌కు మా అభ్యంతరాన్ని పదే పదే తెలియజేశాం’ అని అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

10/02/2016 - 00:55

వాషింగ్టన్, అక్టోబర్ 1: పాకిస్తాన్ వాతావరణానికి ప్రజాస్వామ్యం సరిపోదని, అందుకే సైన్యం అక్కడి పరిపాలనలో తరచూ కీలకపాత్ర పోషించాల్సి వస్తోందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. ‘మాకు స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి కూడా సైన్యానికి ఒక పాత్ర ఉంటోంది.

10/02/2016 - 00:53

లాహోర్, అక్టోబర్ 1: ముంబైపై 26/11 దాడుల కేసుకు సంబంధించి పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఏర్పాటు చేసిన న్యాయ విచారణ బృందం గురువారం ముంబై రానుంది. వందలాది మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు దాడికి వినియోగించిన బోటును ఈ బృందం పరిశీలించనుంది. 2008 ముంబైలో దాడి చేసేందుకు పదిమంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి బోటుద్వారా నగరంలోకి ప్రవేశించి 166 మంది అమాయకులను హతమార్చిన సంగతి తెలిసిందే.

10/02/2016 - 00:25

బీజింగ్, అక్టోబర్ 1: టిబెట్‌లో అత్యంత భారీ వ్యయంతో చైనా నిర్మిస్తున్న హైడ్రో ప్రాజెక్టుకోసం బ్రహ్మపుత్ర ఉపనది అయిన జియాబుకు నది ప్రవాహాన్ని నిలిపివేసింది. టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిని ‘యార్లుంగ్ జంగ్‌బో’ అని పిలుస్తారు.

10/01/2016 - 06:59

ఐరాస, సెప్టెంబర్ 30: జమ్మూకాశ్మీర్‌లోని ఎల్‌ఓసి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై ఐరాస స్పందించింది. ఉద్రిక్తతలు సడలించుకునేందుకు భారత్, పాకిస్తాన్‌లు ప్రయత్నించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ సూచించారు. శాంతియుత పరిస్థితులు ఏర్పడాలని ఆకాంక్షించిన ఆయన దాని కోసం ఇరు దేశాలు దృష్టి సారించాలన్నారు.

Pages