S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/22/2016 - 04:38

బీజింగ్, జూలై 21: భారీ వర్షాలు చైనాను కుదిపేస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి వందమందికి పైగా మృతి చెందడమో, గల్లంతు కావడమో జరిగిందని అధికార వర్గాల సమాచారం. పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

07/22/2016 - 00:55

న్యూఢిల్లీ, జూలై 21: భారతదేశ పురోగతి పొరుగు దేశాల ప్రగతితో ముడిపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో కలిసి ఆయన గురువారం పెట్రాపోల్-బెనాపోల్ ల్యాండ్ పోర్ట్‌ను ప్రారంభించారు. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య కీలక వాణిజ్య మార్గంగా పనిచేసే ఈ ల్యాండ్ పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

07/22/2016 - 00:31

న్యూఢిల్లీ, జూలై 21: జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు, మద్దతు ఇస్తున్నందుకు పాకిస్తాన్‌పై భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో స్పందించింది. తమ ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హెచ్చరించడంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌నుంచి కాళీ చేయాలని కూడా హెచ్చరించింది.

07/21/2016 - 11:38

అంకారా: టర్కీలో మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు తయీప్‌ ఎర్డోగాన్‌ ప్రకటించారు. సైనికుల తిరుగుబాటు నేపథ్యంలో జాతీయ భద్రతామండలి, కేబినెట్‌ సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. సైనికుల తిరుగుబాటు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు.

07/21/2016 - 07:12

క్లీవ్‌లాండ్, జూలై 20: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా నామినేట్ అయ్యారు. క్లీవ్‌లాండ్‌లో రెండు రోజులుగా జరుగుతున్న పార్టీ కనె్వన్షన్‌లో ట్రంప్‌ను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేశారు. అమెరికాలో రియల్ ఎస్టేట్ టైకూన్ అయిన డొనాల్డ్ ట్రంప్ (70) సరిగ్గా ఏడాది క్రితమే క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.

07/20/2016 - 16:46

లండన్‌: హైదరాబాద్‌కు చెందిన రోహిత్‌ ఖండేల్వాల్‌ 2016 మిస్టర్‌ వరల్డ్‌గా ఎంపికయ్యాడు. మిస్టర్‌ వరల్డ్‌గా ఓ భారతీయుడు ఎంపికవడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగిన మిస్టర్‌ వరల్డ్‌ ఫైనల్స్‌లో 46 మంది అభ్యర్థులతో పోటీపడి రోహిత్‌ 2016 మిస్టర్‌ వరల్డ్‌గా ఎంపికయ్యాడు. 26ఏళ్ల రోహిత్‌ ప్రముఖ బుల్లితెర నటుడు, మోడల్‌గా సుపరిచితుడు.

07/20/2016 - 12:45

న్యూయార్క్: అమెరికాలో పోలీసులపై మరోసారి కాల్పులు జరిగాయి. ఈసారి న్యూయార్క్ నగరంలో మంగళవారం ఇద్దరు పోలీసు అధికారులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే, ఈ సంఘటనలో వారు సురక్షితంగా బయటపడడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. న్యూయార్క్‌లో ఇద్దరు పోలీసు అధికారులు నడిచి వెళుతుండగా కారులో వెళుతున్న నలుగురు వ్యక్తులు వారిపై ఆకస్మికంగా కాల్పులు జరిపారు. వెంటనే వారు కారును వదిలేసి పరారయ్యారు.

07/20/2016 - 07:20

ఇస్లామాబాద్, జూలై 19: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు చెందిన ఆస్తులను జప్తు చేయాలని ఆ దేశ కోర్టు ఆదేశించింది. రాజద్రోహం కేసులో ముషారఫ్ విచారణకు హాజరు కాకపోవటంతో ఆయన ఆస్తుల జప్తుతో పాటు ఆయన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కూడా ఆదేశించింది.

07/20/2016 - 07:24

లాస్ ఏంజిలస్, జూలై 19: భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగర్‌మాల కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో సహకరించటానికి అమెరికా అంగీకరించింది. భారత్‌లోని ఓడరేవుల అభివృద్ధికి సమగ్రమైన సహకారాన్ని అందించేందుకు ఇరుదేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత రహదారులు, ఓడరేవులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అమెరికా అధికారులతో సమావేశమై ఈ దిశగా ఫలవంతమైన చర్చలు జరిపారు.

07/20/2016 - 07:15

ఇస్తాంబుల్, జూలై 19: టర్కీలో ఎర్డోగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఆర్మీ, ఇతర ప్రభుత్వ అధికారులపై ప్రభుత్వం ఉక్కుపాదం కొనసాగుతోంది. తిరుగుబాటుకు కుట్రపన్నిన వారుగా భావిస్తున్న వేలాది మంది అధికారులను అరెస్టు చేసిన ఎర్డోగన్ ప్రభుత్వం మరో 9 వేల మంది అధికారులను బర్తరఫ్ చేసింది.

Pages