S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/02/2016 - 18:33

దిల్లీ: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడి మృతుల్లో భారత్‌కు చెందిన 19 ఏళ్ల తరుషి అనే అమ్మాయి ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఢాకాలోని అమెరికన్‌ స్కూల్‌లో చదివిన తరుషి బెర్కెలీ యూనివర్శిటీ స్టూడెంట్‌గా ఉందని మంత్రి తెలిపారు.

07/02/2016 - 17:33

తజికిస్థాన్‌ : తజికిస్థాన్‌లో శనివారం భూకంపం కారణంగా 30 ఇళ్లు, పాఠశాల భవనాలు ధ్వంసమయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. దేశ రాజధానికి 200 కిలోమీటర్ల దూరంలో రాషిట్‌ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

07/02/2016 - 11:42

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంటులో బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు పోలీసు కమెండోలు రంగప్రవేశం చేసి అయిదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి ఆ రెస్టారెంటులో 8 మంది ఉగ్రవాదులు ప్రవేశించి 18 మంది విదేశీయులను బంధించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు పోలీసులు మరణించగా, 20 మంది గాయపడ్డారు.

07/02/2016 - 11:42

ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గమైన హిందూ పూజారులపై దాడులు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. శుక్రవారం ఓ పూజారిని హత్యచేయగా, తాజాగా శక్తిరా జిల్లాలోని రాధాగోవింద ఆలయ పూజారి బాబాసిందూరాయ్‌పై ఆగంతకులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఇంటి తలుపులు కొట్టగానే బయటికి వచ్చిన పూజారిపై దుండగులు విరుచుకుపడ్డారు. గాయపడిన పూజారిని ఆస్పత్రిలో చేర్పించగా అతడి పరిస్థితి విషమంగానే ఉంది.

07/02/2016 - 08:07

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, జులై 1: మన దేశానికి చెందిన 463 మంది మత్స్యకారులు సహా మొత్తం 518 మంది ఖైదీలు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. వీరి జాబితాను పాకిస్తాన్ శుక్రవారం భారత్‌కు అందజేయగా, మన జైళ్లలో ఉన్న పాక్ ఖైదీల జాబితాను భారత అధికారులు దాయాది దేశానికి అందజేశారు.

07/02/2016 - 08:00

డెహ్రాడూన్, జూలై 1: ఉత్తరాఖండ్‌లోని ఎగువ పర్వత ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన కుండపోత వర్షాలకు వివిధ ప్రాంతాల్లో సంభవించిన ప్రమాదాల్లో కనీసం 15 మంది చనిపోగా, వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. పర్వత ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాలకు పితోర్‌గఢ్, చమోలీ జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఆ జిల్లాల ప్రజలు నానా అ వస్థలు పడుతున్నారు.

07/01/2016 - 14:56

సింగపూర్‌ : గత ఏడాది విడుదలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు సంబంధించి సైమా అవార్డుల వేడుక సింగపూర్‌లో గురువారం రాత్రి జరిగింది. తొలిరోజు సైమా వేడుకకు చిరంజీవి, అల్లు అర్జున్‌, రాధిక, సుహాసిని, హన్సిక, సమంత, రానా, అలి, వరుణ్‌తేజ్‌, నిత్యామేనన్‌, విక్రమ్‌, నయనతార, రాజేంద్రప్రసాద్‌, శ్రుతిహాసన్‌, సాయేషా సైగల్‌, ప్రణీత, గాయని సుశీల హాజరయ్యారు.

07/01/2016 - 13:37

బీజింగ్‌: చైనాలో గిజౌ ప్రావిన్స్‌లోని పియాంపో గ్రామంలో కొండచరియలు విరిగి పడటంతో 20మంది గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. 9 మందిని శిథిలాల నుంచి ప్రాణాలతో బయటకు తీసుకురాగా, గాయాల కారణంగా ఓ వ్యక్తి మృతిచెందినట్లు, 20 మంది దాకా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

07/01/2016 - 11:34

ఢాకా: బంగ్లాదేశ్‌లో జెనైదా ప్రాంతంలో శ్యామనందో దాస్‌ అనే హిందూ పూజారి హత్యకు గురయ్యారు. దాస్‌ పూలు కోస్తుండగా ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి కత్తులతో పొడిచి హతమార్చారు. దాస్‌ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో హిందూవులతో పాటు క్రిస్టియన్‌ పౌరులు, మైనార్టీకి చెందిన ప్రొఫెసర్లపై దాడి చేసి చంపేస్తున్నారు.

07/01/2016 - 02:40

కాబూల్, జూన్ 30: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో గురువారం తాలిబన్ తిరుగుబాటుదారులు పోలీసు బస్సులపై చేసిన బాంబు దాడిలో 27 మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు. పోలీసులను తీసికెళ్తున్న బస్సుల కాన్వాయ్‌పై ఈ దాడి జరిగిందని అఫ్గానిస్తాన్ హోంశాఖ తెలిపింది. తిరుగుబాటుదారులు పేల్చిన భారీ పేలుళ్లలో 14 మంది నేపాలీ సెక్యూరిటీ గార్డులు మృతి చెందిన సుమారు పది రోజులకే మళ్లీ ఈ దాడి జరిగింది.

Pages