S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

09/05/2017 - 22:00

మీరెంత అదృష్టవంతులు. ఈ మారుమూల గ్రామంలో చింతామణి వంటి దివ్య పురుషుడిని పెట్టుకుని ఉన్నారు. నాలాంటివాని దగ్గర మంచిమాటలు వినడానికని వచ్చారు. కానీ మీ దగ్గరే మహావజ్రం ఉంది. దాని విలువ ఇప్పుడు మీకు తెలియడంలేదు. తెలిసినా అజ్ఞానంతో వజ్రాన్ని రాయి ముక్కగానే చూస్తున్నారు. కొంతకాలంలోనే ఈ దివ్యపురుషుని సమాధినే మాట్లాడుతుంది.

09/03/2017 - 21:13

అట్లాగే బాబా అంటూ వెళ్ళి వామన్ తాత్యా రెండు పచ్చి కుండలు తెచ్చి ఇచ్చాడు. ఆ తరువాత కుమ్మరి ఆము దగ్గరకు వెళ్లాడు. అనుకోకుండా దూర ప్రాంతం నుంచి ఒకరు వచ్చి తన దగ్గర చేసి ఉన్న కుండలన్నీ కొనుగోలు చేసి తీసుకునివెళ్లారు. మాకు మరలా యాభై కుండల దాకా కావాలి ఎప్పుడు రమ్మంటావు అని కూడా అడిగారు. అలా బేరం అయ్యేసరికి వామన్ తాత్యాకు ఎనలేని సంతోషం వేసింది.

09/02/2017 - 21:18

వెన్న మీగడలు పెడితే తినకుండా మన్ను తింటావా అని అరిచింది. ఏది నోరు చూపిస్తావా లేదా అని గదమాయించింది.

09/01/2017 - 23:15

నన్ను నమ్మిన వాళ్లు ఎంత దూరంలో ఉన్నా సరే నేను కూర్చున్న చోటు నుంచి వారిని కాపాడగలను. వాళ్లు కోరింది నేను ఇవ్వగలను. కాని వారిలో ఓరిమి తప్పక ఉండి తీరాలి అని ఉన్నట్టు ఉండి గంభీరంగా చెప్పారు.
***
అది వర్షాకాలం ఉన్నట్టు ఉండి ఆకాశమంతా మబ్బులు కమ్మి వర్షం ఆరంభమైంది. కుండపోతగా వర్షం కురువసాగింది. అది రాత్రి సమయం. ఎవరూ బయటకు రాలేదు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.

08/31/2017 - 20:41

ఆయన చిరునవ్వు నవ్వి నాయనలారా మీరు మీకై తెలిసి తెలియక ప్రయత్నం చేస్తే మాలాంటివారు కనిపించరు. అందుకే తెలిసినవారిని దగ్గర ఉంచుకుని కావాల్సిన చోటుకు వెళితే మీరు వెళ్ళే మార్గమూ, మీరు కావాల్సింది సులభంగా పొందుతారు కదా! అన్నాడు. దానికి మేమంతా తలకాయలు ఆడించాము.
ఏ పనికైనా ఓర్పు, క్షమ, శాంతి కావాలి సుమా అని ఆయన అన్నారు. ఆయనే నాకు గురువుగారిగా కనిపించారు.

08/30/2017 - 23:17

ఆయనకు కావాల్సిన నీటిని తెచ్చిపెట్టేవాడిని. అగ్నిని రాజేసేవాడిని. అంతే నాకు మాత్రం ఆయన ఏ పని చెప్పేవారు కాదు. కాని ఆయన దేహాన్ని మరిచి ఎన్నో యేండ్లు ధ్యనస్థులై ఉండేవారు. అట్లాంటపుడు ఆయన దేహావసరాలను నేను చూచేవాడిని. నాకు ఏదైనా మంత్రమేదైనా ఉపదేశిస్తారేమో అనుకునేవాడిని. కాని నాకెప్పుడూ ఆయన మంత్రమంటూ చెప్పలేదు. కాని ఓ రోజు నా దగ్గరకు వచ్చి నాకు నీ దగ్గరనుంచి రెండు కావాలి అన్నారు.

08/29/2017 - 23:36

‘‘బాబా నా మేకలు మందలోనుంచి తప్పిపోయాయి. నాకు చాలా కంగారుగా ఉంది. నా మేకలను నేను ఎలా పట్టుకోవాలి. కాస్త నా మేకలు ఎటుపోయి ఉంటాయో చెప్పు బాబా. నేను వెళ్లి తెచ్చుకుంటాను’’ ఆయాసపడుతూ శివుడు వచ్చాడు.

08/29/2017 - 23:34

ఇదిగో మీరంతా రేపల్లెలో ఉన్నప్పుడు వచ్చాను అంటూ కూర్చున్నాడు డేంగలే వారి దగ్గర.
‘మీకి విషయం తెలుసా!’ అడిగాడు డేంగలే.
‘ఏ విషయం’ అందరూ ముక్తకంఠంతో అడిగారు.

08/26/2017 - 20:55

వారిని అట్లా అల్లరి చేయవద్దని, బాబా అంటే దైవం అని వారికి ఎన్నోసార్లు చెప్పింది. పిల్లమూక కదా అందుకే వారు వింటున్నట్టే ఉంటారు కాని వారు చేసేది చేస్తారు. బహుశా అందుకే మళ్లీ బయాజీబాయి వారిని కోప్పడుతున్నట్లు ఉంది.
రహమాన్ అన్నాడు.
అవును నిజమే అయ్యి ఉండవచ్చు. పిల్లలు కూడా నలుగురైదుగురు అక్కడ నేను చూశాను’’ అన్నాడు రాము పాటిల్.

08/24/2017 - 21:47

నేను ఆయనే్న వెతుకుతూ ముందుకు వెళ్ళాను. చాలా దూరం వెళ్ళాను. అక్కడ ఊరికవతల పొలాల్లో జొన్న కంకులు కోసుకుని తింటూ కూర్చుని ఉన్న ఫకీరును చూచాను. ఆనందం వేసింది. గబగబా వెళ్లి నేను తెచ్చిన వాటిని పెట్టి తినమని బతిమిలాడాను.
ఆయన నా వంకనే చూస్తూ గుడ్లు ఉరిమి..
అసలు నిన్ను ఇక్కడికి రమ్మన్నదెవరు? ఇవన్నీ ఎవరు తీసుకుని రమ్మన్నారు. వెళ్లిపో ఇక్కడ నుంచి అని పెద్ద పెద్దగా అరిచారు.

Pages