S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 01:15

గాజువాక, ఏప్రిల్ 28: బయోమ్యాక్స్ కంపెనీలో ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం 48 గంటల పాటు పడిన శ్రమ ఫలించింది. దువ్వాడ సెజ్‌లో గల బయోమ్యాక్స్ ఫ్యూయల్ కంపెనీలో జరిగిన ప్రమాదం కారణంగా బయోడీజిల్ ట్యాంకుల్లో పేలుళ్లు సంభవించి 48 గంటల నుండి మంటలు ఎగసి పడుతున్న విషయం విదితమే.

04/29/2016 - 01:14

విశాఖపట్నం, ఏప్రిల్ 28: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు టిడిపిలో చేరే ప్రక్రియ లాంఛనంగా పూర్తయింది. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో గురువారం ఆయన తన అనుచరులతో కలసి టిడిపి కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి అనుచరులు సైతం తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కిడారి చేరిక ద్వారా విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసల ప్రక్రియ ప్రారంభమైంది.

04/29/2016 - 01:11

ఖైరతాబాద్, ఏప్రిల్ 28: ఫిలింనగర్‌లోని ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...్ఫలింనగర్ రామానాయుడు స్టూడియోను ఆనుకొని ఉన్న సీనర్‌వ్యాలి విల్లాస్‌లో చార్టర్డ్ అకౌంటెంట్ శ్యాంసుందర్ శర్మ కుటుంబం నివసిస్తోంది. ఎప్పటిలాగానే బుధవారం రాత్రి నిద్రించి గురువారం తెల్లవారుజామున మేల్కొనేసరికి ఇళ్లంతా చిందరవందరగా కనిపించింది.

04/29/2016 - 01:11

ఘట్‌కేసర్, ఏప్రిల్ 28: డమీ పిస్తోల్‌తో బెదిరించి ఫైనాన్స్ కంపెనీలో దోపిడీకి యత్నించిన బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని కంపెనీ ఉద్యోగుల అరుపులతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఘట్‌కేసర్ మండల కేంద్రంలో సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

04/29/2016 - 01:10

హైదరాబాద్, ఏప్రిల్ 28: వర్షాకాలంలో నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించేందుకు ఎండాకాలం ముగిసేలోపు నగరంలోని అన్ని ప్రధాన నాలాల్లోని పూడికతీత పనులను పూర్తి చేయాల్సి ఉంది.

04/29/2016 - 01:10

హైదరాబాద్, ఏప్రిల్ 28: నగరంలో నిత్యం రద్ధీగా ఉండే కూడళ్లు, చౌరస్తాలతో పాటు వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు పోలీసులకు నేస్తాలుగా మారాయి. ఎక్కడ ఏ నేరం జరిగినా, నిందితులను గుర్తించేందుకు ఈ సిసి కెమెరాల ఫుటేజీలు ఉపయోగపడుతున్నాయి. 2013 ప్రజాభద్రత చట్టం కింద తొలుత వీటిని రాజధాని దిల్లీలో అమలు చేసిన తర్వాత ఇతర నగరాలకు విస్తరించారు.

04/29/2016 - 01:09

హైదరాబాద్, ఏప్రిల్ 28: భాగ్యనగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం, పర్యావరణం హితం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రోరైలు ప్రాజెక్టు కారణంగా రద్దీ జంక్షన్లలో మున్ముందు ట్రాఫిక్ జాం తీవ్ర రూపం దాల్చే అవకాశాలున్నాయి.

04/29/2016 - 01:08

హైదరాబాద్, ఏప్రిల్ 28: గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయకుడి విగ్రహాలకు సహజ రంగులను వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, జిహెచ్‌ఎంసిని హైకోర్టు ఆదేశించింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయకుండా చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది.

04/29/2016 - 01:07

హయత్‌నగర్, ఏప్రిల్ 28: రంగారెడ్డి జిల్లాలో రూ.19 కోట్లతో మంచినీటి సమస్యను పరిష్కరించనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం చంపాపేట్ డివిజన్ గాంధీబొమ్మ వద్దగల ఖాళీస్థలంలో రూ.2కోట్లతో చేపట్టిన మల్టీలెవల్ ఫంక్షన్‌హాల్, రూ.50 లక్షలతో మోడల్ మార్కెట్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ సామ రమణారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

04/29/2016 - 01:07

హైదరాబాద్, ఏప్రిల్ 28: చెంగిచర్ల గ్రామపంచాయతీని బోడుప్పల్ గ్రామ పంచాయతీలో విలీనం చేసి, అనంతరం బోడుప్పల్ మున్సిపాలిటీగా నోటిఫై చేయాలనుకున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం బోడుప్పల్ గ్రామ పంచాయతీ ఎంపిటిసి సభ్యులు డి.వీరాచారి, జె.పద్మలు దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు బుధవారం విచారణ నిర్వహించింది.

Pages