S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 01:06

హైదరాబాద్, ఏప్రిల్ 28: షెడ్యూల్ తెగల జాబితాలో వాల్మీకి బోయలు, కైతి లంబాడాలను కలప వద్దని గిరిజన రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) షెడ్యూల్ తెగల విచారణ కమిషన్ చైర్మన్ చల్లప్పకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్నంగా జెఎసి తరఫున కమిషన్ చైర్మన్‌కు విజ్ఞాపన పత్రాన్ని అందజేసినట్లు కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం.శోభన్ నాయక్ తెలిపారు.

04/29/2016 - 01:06

హైదరాబాద్, ఏప్రిల్ 28:కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన తారక రామానగర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు స్వయంగా సేకరించిన రెండువేల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తమ విరాళాలు ఉపయోపడాలని ఆకాంక్షించారు.

04/29/2016 - 01:05

ఖైరతాబాద్, ఏప్రిల్ 28: సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే యోగాను అందరికీ అందించాలనే లక్ష్యంతో మే1 నుంచి నగరంలో ఉచిత అష్టాంగ విన్యాస యోగ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్టు డాక్టర్ ఎఎల్‌వి కుమార్ తెలిపారు. గురువారం బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన యోగా ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందిందని అన్నారు.

04/29/2016 - 01:05

తాండూరు, ఏప్రిల్ 28: తాండూ రు శ్రీభావిగి భద్రేశ్వరస్వామి జాతర ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం పల్లకి ఉత్సవ సేవతో ప్రారంభమైన జాతరలో శనివారం రాత్రి రథోత్సవం నిర్వహిస్తారు. ఆదివారం అర్థరాత్రి దాటాక లంకాదహనం ఘట్టం చేపడుతారు. జాతర విజయవంతానికి ఆల య కమిటీ, వీరశైవ సమాజం, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
శాంతి సమావేశం

04/29/2016 - 01:04

ఖైరతాబాద్, ఏప్రిల్ 28: నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సిసి కెమెరాలు ఎంతగానో దోహపడతాయని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఉమానగర్, కుందన్‌బాగ్, మెథడిస్ట్‌కాలనీవాసుల భాగస్వామ్యంతో రూ. 41 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 60 సిసికెమెరాల మానిటరింగ్ సిస్టమ్‌ను కమిషనర్ ప్రారంభించారు.

04/29/2016 - 01:03

హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భక్తి భజన సంకీరతన ప్రచార పరిషత్ నిర్వహిస్తున్న భజన పోటీలు గురువారం రవీంద్రభారతి సమావేశమందిరంలో విజయవంతంగా జరిగాయి.

04/29/2016 - 01:03

ఖైరతాబాద్, ఏప్రిల్ 28: దీర్ఘకాలిక వ్యాధి ఆస్తమా పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని ఛాతి వైద్య నిపుణులు విజయ్‌కుమార్ అన్నారు. గురువారం పంజాగుట్టలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చిన్నపిల్లల వైద్యులు సుదర్శన్ రెడ్డితో కలిసి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్టు సర్వేల ద్వారా వెల్లడౌతున్నాయని చెప్పారు.

04/29/2016 - 01:02

హైదరాబాద్, ఏప్రిల్ 28: రేపటి అవసరానికి కురిసే ప్రతి వాన నీటిబొట్టును ఒడిసి పట్టుకునేలా ఇంకుడు గుంతల తవ్వకాన్ని రంగారెడ్డి జిల్లాలో ఉద్యమంలా చేయుటకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి అంకుటిత నిర్ణయం తీసుకున్నారు. మే 5న జిల్లాలోని 688 గ్రామ పంచాయతీలలో ఒకే ముహూర్తానికి ఐదువేల ఇంకుడు గుంతలు తవ్వుటకు నిర్ణయించారు.

04/29/2016 - 01:02

ఖైరతాబాద్, ఏప్రిల్ 28: క్షణం తీరకలేని నగర జీవితంలో ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లో వెతికేయడం సర్వసాధారణం అయింది. ఇదే తరహాలో అర్చకులను ఆన్‌లైన్‌లో వెతికేందుకు ఓ వైబ్‌సైట్‌ను రూపొందించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆన్‌లైన్‌లో అర్చకుల వివరాలను అందించేందుకు రూపొందించిన వైబ్‌సైట్ గెట్ పురోహిత్ డాట్ కామ్‌ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆవిష్కరించారు.

04/29/2016 - 01:01

వికారాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన వారికి ప్లీనరీలో అవకాశం లేకుండా పోయిందని, తెలంగాణ ద్రోహులే వేదికపై దర్శనమిచ్చారని తెలంగాణ ఉద్యమవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మండిపడ్డారు.

Pages