S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/16/2019 - 23:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: స్ట్ఫా సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) 2017లో నిర్వహించిన పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో ఏప్రిల్ 23వ తేదినాటికి దర్యాప్తుపై తాజా పురోగతి నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను ఆదేశించింది. న్యాయమూర్తులు ఎస్‌ఏ బోబ్డే, ఎస్‌ఏ నజీర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అనంతరం ఈ కేసు విచారణను ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా వేసింది.

04/16/2019 - 23:02

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవడానికి ముస్లిం మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. పుణేకు చెందిన దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, ఎస్‌ఏ నజీర్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కాగా దీనిపై స్పందించాలని, జవాబు ఇవ్వాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

04/16/2019 - 06:13

నాగార్జునసాగర్, ఏప్రిల్ 15: నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని నాయకునితండలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి, ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, నాటు బాంబులు రువ్వుకోవడంతో గ్రామంలోని 30 గృహాలు ధ్వంసమైనాయి. గ్రామస్థుల, పోలీసుల కథనం ప్రకారం గత సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మేరావత్ కొండానాయక్ గెలుపొందారు.

04/16/2019 - 06:12

కంఠేశ్వర్, ఏప్రిల్ 15: ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు వృద్ధుడి తలపై బండరాయితో మోది హత్య చేశారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరంలోని ముదిరాజ్‌వీధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

04/16/2019 - 05:50

తాండూరు, ఏప్రిల్ 15: తాండూరు డివిజన్ యాలాల మండలం దౌలాపూర్ గ్రామ సమీపంలో అంతరాష్ట్ర రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. తాండూరు డీఎస్పీ ఎం.రామచంద్రుడు, రూరల్ సర్కిల్ సీఐ జే.ఉపేందర్, యాలాల ఎస్సై విఠల్ రెడ్డి సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాలాల మండలం జుంటుపల్లి నుంచి తాండూరుకు వస్తున్న ఆటోను మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది.

04/16/2019 - 05:47

చెన్నై, ఏప్రిల్ 15: తన కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకుగాను ఆరు నెలలు తనను సాధారణ సెలవుపై విడుదల చేయాలంటూ రాజీవ్ గాంధీ హత్య కేసులో ముద్దాయిగా జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు సోమవారం తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నళిని పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎం.

04/16/2019 - 05:44

హైదరాబాద్, ఏప్రిల్ 15: బ్యాంకు నుండి 8 కోట్ల రూపాయిలు విత్‌డ్రా చేసి తీసుకువెళ్తుండగా దొరికిపోయిన ఘటనలో తెలంగాణ బీజేపీ నేతలపై తీసుకున్న చర్యలు ఏమిటో వివరించాలని రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అదే విధంగా పార్టీ గుర్తుతో ఓటర్ల స్లిప్‌లను పంచడంపై కూడా వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది.

04/16/2019 - 05:43

హైదరాబాద్, ఏప్రిల్ 15: రాజ్యాంగ విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న పంచాయతీరాజ్ చట్టాన్ని సవాల్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. బీసీ రిజర్వేషన్లను తప్పుల తడకగా చేసి బీసీలకు అన్యాయం చేసే జీవో 81ను రద్దు చేయాలని , బీసీ జనాభా లెక్కలు తీసిన తర్వాతనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని హైకోర్టును కోరింది.

04/16/2019 - 05:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: శారదా చిట్ ఫండ్ కేసులో బీజేపీ నేతల కుట్రల కారణంగానే సీబీఐ తనను టార్గెట్ చేసిందని కోల్‌కత్తా మాజీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ సుప్రీంకోర్టులో స్పష్టం చేశారు. ఈ విస్తృత కుట్రలో బీజేపీ నేతలైన ముకుల్‌రాయ్, కైలాష్, విజయ్‌వార్ఘీయలకు సంబంధం ఉందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి వీడియో సాక్ష్యాలను కూడా ఆయన కోర్టుకు అందించారు.

04/16/2019 - 04:52

నేరేడ్‌మెట్, ఏప్రిల్ 15: గుట్టు చప్పుడు కాకుండా నగరానికి పులి చర్మం తీసుకువచ్చి విక్రయిస్తున్న ముఠా సభ్యులను మల్కాజిగిరి ఎస్‌వోటి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నేరేడ్‌మెట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు.

Pages