S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/18/2019 - 03:53

షాద్‌నగర్ రూరల్, ఏప్రిల్ 17: మద్యం మత్తులో ఓ యువకుడిపై స్నేహితులు పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన మంగళవారం రాత్రి షాద్‌నగర్ పట్టణ సమీపంలోని ఓ వెంచర్‌లో చోటు చేసుకుంది. షాద్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన నలుగురు యువకులు కలిసి సమీపంలో ఉన్న ఓ వెంటర్‌కు వెళ్లి అక్కడ అతిగా మద్యం సేవించారు.

04/18/2019 - 01:46

చెన్నై, ఏప్రిల్ 17: ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచుకున్న కోటీ 48 లక్షల నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏఎంఎంకె పార్టీ టీటీవీ దినకరన్ మద్దతుదారుల నుంచి ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని థేనీ జిల్లాలోని అందిపట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి గురువారం ఉప ఎన్నిక జరగనున్నది.

04/18/2019 - 00:41

తిరుపతి, ఏప్రిల్ 17: తమిళనాడులో గురువారం నాడు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో తిరువళ్లూరు చెక్‌పోస్టు వద్ద ఒక వాహనంలో 1,381 కేజీల బంగారం ఉండటాన్ని బుధవారం సాయంత్రం గుర్తించారు. వెంటనే ఈ బంగారాన్ని పూనమలై ట్రెజరీకి తరలించారు. ఈ బంగారు టీటీడీ గత మూడు సంవత్సరాల క్రితం పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు విచారణలో తేలింది.

04/17/2019 - 21:56

హైదరాబాద్, ఏప్రిల్ 17: రెండేళ్ల డీసెట్ కోర్సులో చేరేందుకు ఇంటర్మీడియట్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్ధులను సైతం అనుమతించాలని రాష్ట్ర హైకోర్టు విద్యాశాఖను ఆదేశించింది.

04/17/2019 - 05:32

నాగార్జునసాగర్/తిరుమలగిరిసాగర్, ఏప్రిల్16: శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, విధ్వంసం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా ఎస్‌పీ ఏవి.రంగనాధ్ అన్నారు. మంగళవారం మండలంలోని నాయకునితండాను సందర్శించారు. ముందుగా తండాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఉద్రిక్త పరిస్థితుల నడుమ జరిగిన సంఘటనలో ధ్వంసమైన ఇండ్లను ఆయన పరిశీలించారు.

04/17/2019 - 04:55

హైదరాబాద్, ఏప్రిల్ 16: మియాపూర్ భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమయ్యే వరకు సేల్ డీడ్‌లను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఈ కేసు తేలే వరకు యదాతథ స్థితి కొనసాగుతుందని కోర్టు పేర్కొంది. ఈ కేసులు పరిష్కారమయ్యే వరకు స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.

04/17/2019 - 04:50

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 16: నగర పోలీసు కమిషనరేట్‌లో లాకప్‌డెత్ ఉదంతం కలకలం రేగింది. అజిత్‌సింగ్‌నగర్ పోలీస్టేషన్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు. పోలీసులే కొట్టి చంపారంటూ ఓ వైపు ప్రచారం ఊపందుకోవడంతో సంచలనం చోటు చేసుకుంది. మరోవైపు పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక ప్రాణాలు విడిచాడని, కాదు నిందితుడు పోలీస్టేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ భిన్న అభిప్రాయాలు తెర మీదకు వస్తున్నాయి.

04/17/2019 - 04:41

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 16: తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన తనయులు సిద్ధార్ధ, రవితేజలపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనె 8వ తేదీన ఎన్నికల ప్రచారంలో పారిశ్రామిక వేత్త కోగంటి సత్యంపై దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో ఈమేరకు కేసు నమోదైంది.

04/17/2019 - 02:07

దిల్‌సుఖ్‌నగర్, ఏప్రిల్ 16: పులి చర్మం విక్రయిస్తున్నామని మోసం చేసిన వ్యక్తిని చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే చైతన్యపురికి చెందిన బాదం రవికుమార్‌కు ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఎండి అఖీమ్ ఫోన్ చేసి పులిచర్మం ఉందని దానిని విక్రయిస్తున్నట్లు తెలిపారు. దాని విలువ రూ.5లక్షలు ఉందని తెలిపారు. చర్మం కొనుగోలు చేసేందుకు నాగోల్ అల్కాపురికి రావాలని సూచించారు.

04/17/2019 - 02:06

షాబాద్, ఏప్రిల్ 16: చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల్ అటవి ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ అతి దారుణంగా హత్య చేసి నిప్పుంటించిన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. చేవెళ్ల ఎస్‌ఐ రేణుకారెడ్డి కథనం ప్రకారం... మండల పరిధిలోని ముడిమ్యాల్ అటవి ప్రాంతంలో మహిళను, గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేసి సగం వరకు మృతదేహన్ని కాల్చి పారిపోయారు. మృత దేహాం గుర్తు పట్టరాకుండ ఉందని అన్నారు.

Pages