S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/31/2019 - 05:06

మూసాపేట, ఆక్టోబర్ 30: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని సంకల్‌మద్ది గ్రామసమీపంలో 44వ జాతీయ రహదారి దగ్గర కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ.

10/31/2019 - 04:38

నెక్కొండ, అక్టోబర్ 30: వరంగల్ రూరల్ జిల్లాలోని నెక్కొండ మండలంలోని మడిపల్లి శివారు గేట్ తండాలో ఇద్దరు వృద్ద దంపతులు బుధవారం సాయంత్రం సజీవ దహనం అయ్యారు. తండాకు చెందిన భూక్య దస్రు(68), బాజు(65)లు అనుమానస్పద స్థితిలో బుధవారం సాయంత్రం సజీవదహనం అయ్యా రు. కాగా ఈ సంఘటనలో సొంత కుమారుడు రెండున్నర ఎకరాల భూమి కోసం ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్లు సీఐ పెద్దన్న కుమార్ తెలిపారు.

10/31/2019 - 01:55

హైదరాబాద్, అక్టోబర్ 30: నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వాహనాలు కొనుగోలు చేసిన ఘటనలో నోటీసులు అందిన బాధితులు కంచన్‌బాగ్ పోలీసులను ఆశ్రాయించారు. పదమూడు మందికి సంబంధించిన నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి వారి పేర్లపై వాహనాలను గొనుగోలు చేసిన ఘటన పాతబస్తీ హాఫిజ్‌బాబానగర్ సీ-బ్లాక్‌లో చోటు చేసుకుంది.

10/30/2019 - 05:08

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 29: మానసిక స్థితి సరిగాలేని కుమారుడు తల్లిదండ్రులను నిద్రిస్తున్న సమయంలో తలపై ఇనుపరాడ్డుతో కొట్టి హత్యచేసిన దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కడియద్ద గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ దారుణానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

10/30/2019 - 04:40

శామీర్‌పేట, అక్టోబర్ 29: ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఉన్నత ఉద్యోగం రాగానే తల్లిదండ్రులతో కలసి భార్యను వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన సంఘటన జవహర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ భిక్షపతిరావు కథనం ప్రకారం..

10/30/2019 - 02:26

జి.కొండూరు, అక్టోబర్ 29: గ్రామ శివార్లలోని శివసాయి హోటల్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వీరి వాహనాన్ని ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టడంతో కేతనకొండ గ్రామానికి చెందిన కంభంపాటి యోహాను (22) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గాలంకి నరేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నరేష్‌ను విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

10/30/2019 - 02:25

గన్నవరం, అక్టోబర్ 29: ప్రజలకు రూ. 43లక్షలు టోపి పెట్టి తప్పించుకు తిరుగుతున్న బ్రాంచి పోస్టుమాస్టరును పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గన్నవరం మండలం బూతిమిల్లిపాడు, అజ్జంపూడి గ్రామాలకు చెందిన పోస్టుమాస్టరు నాగేంద్ర పోస్టాపీస్‌లో జమ చేయాల్సిన సొమ్మును స్వాహా చేసి తప్పించుకుతిరుగుతున్నాడు. అజ్జంపూడి గ్రామానికి చెందిన రూ. 25లక్షలు, బూతిమిల్లిపాడుకు చెందిన రూ.

10/30/2019 - 02:12

దిల్‌సుఖ్‌నగర్, అక్టోబర్ 29: కేంద్ర ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తామని ఓ మహిళ వద్ద రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయాలను వసూలు చేసిన నిందితులను మంగళవారం సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట్ ప్రాంతానికి చెందిన ప్రవర్ణ రెడ్డికి కేంద్ర ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తామని కారా సభ్యుడు రామచంద్రా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి నమ్మబలికారు.

10/30/2019 - 01:45

హైదరాబాద్, అక్టోబర్ 29: ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై మంగళవారం హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదారి పట్టించవచ్చది స్పష్టం చేసింది. తప్పుడు నివేదికలతో కాలక్షేపం చేస్తున్నట్టు సర్కారుపై మండిపడింది. కేసు విచారణ సందర్భంగా ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.

10/30/2019 - 01:22

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డె నియమితులయ్యారు. సుప్రీం కోర్టుకు 47వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన బాబ్డె ప్రస్తుతం అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరుగా ఉన్నారు. ఇంకా అనేక కీలక కేసులను ఆయన విచారించి తీర్పునిచ్చారు.

Pages