S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/29/2019 - 02:07

కలిదిండి, అక్టోబర్ 28: టిప్పర్ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మట్టగుండ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం చాబత్తిన మహేష్ (15), కర్రే స్వామి(18) ఇరువురు ద్విచక్ర వాహనంపై ఖాళీ గ్యాస్ బండను తీసుకువెళుతుండగా మట్టగుంట నుంచి కలిదిండి వెళుతున్న టిప్పర్ లారీ ఢీ కొట్టటంతో తీవ్రంగా గాయపడ్డారు.

10/29/2019 - 01:54

శామీర్‌పేట, అక్టోబర్ 28: కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శామీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కధనం ప్రకారం.. మండల పరిధిలోని కొల్తూరు గ్రామానికి చెందిన ములుగు హారిక అదే గ్రామానికి చెందిన ప్రవీన్‌ను గత కొన్ని సంవత్సరాల నుండి ఇద్దరు ప్రేమించుకొని ఈనెల 25న ఇంట్లో నుండి పారిపోయి ఈ ఇరువురు పెళ్లి చేసుకున్నారు.

10/29/2019 - 01:54

ఉప్పల్, అక్టోబర్ 28: హబ్సిగూడ చౌరస్తాలో సోమవారం ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై ముందు వాహనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో అదే ప్రాంతంలో ఉన్న జనం భయంతో పరుగులు తీశారు. వాహనాలపై ఉన్న కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. జనగామ డిపోకు చెందిన బస్సు జేబీఎస్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా సంఘటన చోటు చేసుకుంది.

10/29/2019 - 01:52

కొత్తూరు రూరల్, అక్టోబర్ 28: ఓ వెంచర్‌లో నిర్మిస్తున్న వాటర్ నిర్మాణంలో విద్యుత్ షాక్ తగిలి ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు కొత్తూరు సీఐ చంద్రబాబు తెలిపారు. సోమవారం రాత్రి కొత్తూరు మండల పరిధిలోని సిద్దాపూర్ గ్రామంలోని ప్రశాంత్ ఎన్‌క్లేవ్ వెంచర్‌లో నిర్మిస్తున్న నీటి ట్యాంక్ నిర్మాణంలో ఈ సంఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు.

10/29/2019 - 01:35

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో మరో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో మనోవేదనకు గురై సత్తుపల్లి డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కొమరబత్తిని నీరజ (31) సోమవారం ఉదయం ఖమ్మం నగరంలోని తన ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

10/29/2019 - 01:21

హైదరాబాద్, అక్టోబర్ 28: హైకోర్టు సమ్మె అంశంతో పాటు జీతాల చెల్లింపు, అద్దె బస్సుల కొనుగోలు అంశంపై దాఖలైన మూడు పిటిషన్లపై సోమవారం నాడు హైకోర్టు విచారణ కొనసాగించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తదుపరి మంగళవారం మధ్యాహ్నం విచారణ కొనసాగించనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింఘ్ చౌహాన్ పేర్కొన్నారు.

10/27/2019 - 04:21

ఒంగోలు, అక్టోబర్ 26:ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన నాగులుప్పలపాడు నుండి ఉప్పుగుండూరు వెళ్ళే మార్గంలో గొల్లవానికుంట జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందిన సంఘటన శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా చినగంజాంకు చెందిన 14మంది మహిళలు ఒంగోలు మార్కెట్‌లో చేపలు విక్రయించేందుకు ఆటోలో బయలుదేరారు.

10/27/2019 - 02:43

కడెం, అక్టోబర్ 26: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని రేవోజిపేట గ్రామ సమీపంలోని కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువలోకి కారు దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఎదులపురం శశాంత్ (25), కొమురవెల్లి సాయి సంగీత్ (26) ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయ్యారు.

10/27/2019 - 01:38

మహేశ్వరం, అక్టోబర్ 26. మహేశ్వరం అగ్నిమాపకసేవల కేంద్రంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహించి దీపావళి సందర్బాంగా తాత్కాలిక టాపాకాయల దుకాణాల కోసం దరఖాస్ చేసుకున్న చిరువ్యాపారుల నుండి లంచం డిమాండ్ చేసిన లీడింగ్ ఫైర్‌మెన్ గురువయ్యను అరెస్టు చేసి ఎ సి బి కోర్టుకు తరలించారు.

10/26/2019 - 23:58

హైదరాబాద్: షైన్ ఆస్పత్రిలో చిన్నారి మృతికి బాధ్యులైన యాజమాన్యంపై పోలీసులు బెయిలబుల్ కేసును నమోదు చేయడంపై హైకోర్టు శనివారం నాడు మండిపడింది. అగ్ని ప్రమాదంలో చిన్నారి మృతితో పాటు మరో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమంటూ ఎండీ సునీల్‌కుమార్ రెడ్డి, ఇతర సిబ్బందిని ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం నాడు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Pages