S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/26/2019 - 01:07

విశాఖపట్నం(క్రైం), అక్టోబర్ 25: విశాఖలోని గాజువాకలో విషాదం చోటు చేసుకుంది. వర్షపు నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసిన ఇంకుడు గొయ్యిలో ప్రమాదవశాత్తు ఇద్దరు బాలికలు పడి మృతి చెందారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన కల్లూరి భాస్కరరావు, ఒడిశాకు చెందిన అల్లిన సంజీవా కూలీ పనులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.

10/26/2019 - 00:59

నిజామాబాద్, అక్టోబర్ 25: విద్యార్థుల భావి జీవితానికి బాటలు వేయాల్సిన సర్కారు బడిలో, అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఓ బాలుడి నిండు ప్రాణాలను బలిగొన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో గల ఫులాంగ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న అయాన్ ఖాన్ (11) అనే బాలుడు బడి ఆవరణలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

10/26/2019 - 00:05

హైదరాబాద్, అక్టోబర్ 25: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించుకునేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, గతంలో దాఖలైన వేర్వేరు పిటిషన్లలో 77 మున్సిపాల్టీల్లో ఎన్నికలపై స్టే విధించడంతో స్టే ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

10/26/2019 - 00:04

హైదరాబాద్, అక్టోబర్ 25: రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకేసారి 68 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర హోం శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. చిక్కడపల్లి ఏసీపీ వై.నర్సింహారెడ్డి మల్కాజిగిరికి, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ వై.వెంకటేశ్వర్ రావు మిర్యాలగూడకు బదిలీ అయ్యారు.

10/26/2019 - 00:04

హైదరాబాద్, అక్టోబర్ 25: ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ పరోక్షంగా వారి ఆత్మహత్యలకు యూనియన్ నేత అశ్వత్థామ రెడ్డి కారణమవుతున్నారని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో రాజు అనే ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు చేశారు. సమ్మె పొడిగింపుతో నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ మంచి అవకాశం ఇచ్చారని, దానిని ఉపయోగించుకోవాలని ఆయన కార్మికులను కోరారు.

10/26/2019 - 00:02

హైదరాబాద్, అక్టోబర్ 25: టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌కు హైకోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు కూకట్‌పల్లి కోర్టును ఆదేశిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. వ్యక్తిగత బాండుతో పాంటు 15 వేల రూపాయల పూచీకత్తును సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. టీవీ-9 సీఈఓగా ఉన్న సమయంలో రవిప్రకాష్ తన స్వప్రయోజనాల కోసం నిధులను మళ్లించుకున్నారనే అభియోగాలతో పోలీసులు అరెస్టుల చేశారు.

10/25/2019 - 23:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: కర్నాటకలో 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన అప్పటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ నిర్ణయంపై దాఖలైన కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ సుప్రీం కోర్టును అభ్యర్ధించారు. కర్నాటక కాంగ్రెస్, కర్నాటక పీపీసీ చీఫ్ దినేష్ గుండూరావు తరఫున ఈ కేసులో తన వాదనలు వినిపించిన సిబల్ పలు అంశాలను ప్రస్తావించారు.

10/25/2019 - 23:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: కోస్టర్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన ‘మరడు’ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టమైన తీర్పును వెలువరించింది. పర్యావరణాన్ని పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు గతంలోనే అపార్ట్‌మెంట్‌లను కూల్చివేయాలని ఆదేశించింది.

10/25/2019 - 23:34

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: సమాజంలో అసమానతలు, అవినీతికి వ్యతిరేకంగా జీవించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు వీలుగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకూ అవగాహన వారోత్సవం నిర్వహించనున్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ ప్రకటించింది.

10/25/2019 - 23:29

విజయవాడ, అక్టోబర్ 25: గోదావరిలో కచ్చలూరు వద్ద బోటు ప్రమాదంలో చనిపోయిన 12 మంది కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Pages