S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2017 - 23:41

స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమోగ్ దేశపతి, అర్చన, శ్రేయవ్యాస్ హీరో హీరోయిన్లుగా పార్సిల్ ఫేం షిరాజ్ దర్శకత్వంలో పి.వి.సత్యనారాయణ నిర్మించిన హారర్ థ్రిల్లర్ మరియు లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చిత్రం షాలిని. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసకొని విడుదలకు సిద్ధమయిన సందర్భంగా యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

08/30/2017 - 23:40

ఎన్టీఆర్ కథానాయకుడిగా కళ్యాణ్‌రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న భారీ చిత్రం జైలవకుశ. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల చిత్రానికి సంబంధించిన టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. చిత్రానికి సంబంధించిన ఆడియోను వచ్చే నెల 3న మార్కెట్‌లో విడుదల చేయనున్నారు.

08/30/2017 - 23:37

శ్రీకరణ్, అమృత, ప్రీతి ప్రధాన తారాగణంగా నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 3బెస్ట్ లవర్స్2. నిర్మాత గొంటి శ్రీకాంత్ శ్రీకరణ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ప్రేమకు సరికొత్త నిర్వచనం తెలిపే ఈ సినిమాలో ప్రేమ గొప్పదనాన్ని చర్చించామని తెలిపారు.

08/30/2017 - 23:36

సితార ఎంటర్ టైన్ మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలపై రెండు చిత్రాలు రూపొందనున్నాయ. నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వివరాల్లోకెళితే చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన మారుతి చేసిన బస్టాప్, ఈరోజుల్లో లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలను అం దుకున్నాయి. ఆ తర్వాత నానితో భలే భలే మగాడివోయ్2తీసి భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నారు.

08/30/2017 - 23:36

ఈమధ్య మాజీ హీరోయిన్స్ అందరూ రీ ఎంట్రీ ఇస్తూ మంచి క్రేజ్ తెచ్చుకునే పాత్రల్లో నటిస్తూ జోరు ప్రదర్శిస్తున్నారు. అప్పట్లో అయితే మాజీ హీరోయిన్స్ కేవలం.. అక్క, తల్లి, అత్త పాత్రలతోనే రాణించేవారు. కానీ నేటి మాజీ హీరోయిన్స్ మాత్రం అటు హీరోలతో రెండోసారి రొమాన్స్ చేయడానికి కూడా వెనుకాడటంలేదు. ముఖ్యంగా కుర్ర హీరోలతో ఘాటు రొమాన్స్, ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు సైతం ఆసక్తి చూపిస్తుండడం విశేషం.

08/30/2017 - 23:35

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం రంగస్థలం 1985 షూటింగ్‌లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. 1985 కాలంనాటి కథగా రూపొందుతున్న ఈ సినిమాలో అన్ని దృశ్యాలు సహజంగాగానే ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సుకుమార్ షూటింగ్ చాలావరకు గోదావరి జిల్లాల్లోనే తీశారు. ఆ తర్వాత రామ్‌చరణ్, సమంతల బిజీ షెడ్యూల్స్‌వలన హైదరాబాద్‌లోనే విలేజ్, ఇసుక తినె్నలు కలిగిన నదీ తీరాలవద్ద సెట్స్‌వేసి చిత్రీకరణ జరుపుతున్నారు.

08/30/2017 - 23:35

ఏసుక్రీస్తు జీవిత చరిత్రను కొత్త కోణంలో ఆవిష్కరించి ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా కొత్త అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం లోకరక్షకుడు. చండ్రస్ ఆర్ట్ మూవీస్ పతాకంపై బ్రహ్మం సిహెచ్. దర్శకత్వంలో చంద్రశేఖర్ చండ్ర రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిపారు. సినిమా టైటిల్ లోగోను లండన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

08/30/2017 - 23:35

బాలీవుడ్ లో 90వ దశకంలో హీరోయిన్‌గా ఒక ఊపు ఊపిన అందా ల భామ మాధురి దీక్షిత్ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న మాధురి ప్రస్తుతం నిర్మాతగా మారడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఆమె ఆర్.ఎన్.ఎం. మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్‌ని స్థాపించారు. మొదటి ప్రయత్నంగా మరాఠీలో ఓ సినిమా తీయడానికి సిద్ధం అయింది.

08/29/2017 - 21:57

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పటికే 70 శాతంపైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. తాజా షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనున్న ఈ టీమ్ పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దానికితోడు చిత్ర యూనిట్ కూడా ఫస్ట్‌లుక్ వస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

08/29/2017 - 21:55

నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా కృష్ణ ఆర్.వి.మారిముత్తు దర్శకత్వంలో వారాహి చలనచిత్ర పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన యుద్ధం శరణం చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ సంగీత దర్శకుడు సీడీలను ఆవిష్కరించి దర్శకుడు రాజవౌళికి అందజేశారు. అనంతరం రాజవౌళి మాట్లాడుతూ- బాహుబలికి ఎంత ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగాయో ఈ సినిమాకు కూడా కృష్ణ అంతే పనిచేశాడు. సినిమా మీద మంచి నమ్మకం ఏర్పడింది.

Pages