S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

11/12/2016 - 22:56

‘నాయనమ్మా! నాయనమ్మా! ఎక్కడున్నావూ?’ అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది మృదుల.
‘ఏమ్మా! ఏమిటీ?’ అడిగింది నాయనమ్మ.
‘నాయనమ్మా! మరే ఈరోజు మా స్నేహితురాలు సుజన పుట్టిన రోజుకదా!’ అన్నది మృదుల.
‘అవును! నిన్న చెప్పావుగా. పొద్దున మీ స్నేహితురాలికి ఇస్తానని గులాబీ పువ్వు కూడా తీసుకెళ్లావుగదా!’ అన్నది నాయనమ్మ.

11/12/2016 - 22:49

రేపు ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారి
వర్ధంతి సందర్భంగా..
**

11/12/2016 - 22:43

భరతమాత మెడలో మణిహారంలా వెలిసిన
హిమాలయ సానువుల్లో
ఉత్తరాన నెలకొన్న ఉన్నత శిఖరాల్లో
అహరహం శ్రమించే
అలుపెరుగని ధీరులు మన సైనికులు
తలిదండ్రులను విడచి
భార్యాబిడ్డలను మరచి
కార్యదీక్షా పరాయణులై
కదనరంగంలో కదంతొక్కుతూ
హిమపాతమైనా జలపాతమైనా
విపత్కర పరిస్థితులెన్నైనా
విధికి ఎదురొడ్డి నిలిచే
మన వీరజవానులకు

11/12/2016 - 22:39

వచ్చే ఏడాది మే 26, 27, 28 తేదీల నాటికి తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాలు 21వ తానా మహాసభలుగా సెయింట్ లూయిస్‌లో జరగబోతున్నాయి. ఈసందర్భంగా తానా వివిధ సాహిత్య కార్యక్రమాలు చేపడుతోంది.

11/06/2016 - 08:35

తెల్లవారింది. టైము ఆరవ్వొస్తోంది. శేఖర్‌కి హఠాత్తుగా మెలకువ వచ్చింది. పక్కకి తిరిగి చూశాడు. భార్య సంధ్య లేదు. అప్పటికే లేచి పనులు చేసుకుంటున్నట్లుంది. గడియారం వైపు చూశాడు. తను లేవటానికి పెట్టుకున్న అలారం మోగడానికి ఇంకా గంట టైముంది. తల భారంగా అనిపించింది. అతి గాఢంగా ఏడు గంటల వరకు నిద్రపోయే తనకి ఈమధ్య అలారం మోగకముందే మెలకువ వస్తోంది. లేవగానే ఆఫీసులోని పనుల ఒత్తిడి గుర్తుకొస్తుంది.

10/29/2016 - 22:41

ఆఫీస్ పనిమీద రాజమండ్రి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళుతూ మా కజిన్ శ్రీ వల్లి అక్క వాళ్లింటికి వెళ్లాను. వెళ్లగానే ఓ షాకింగ్ న్యూస్ చెప్పి, బావురుమంది అక్క. అదేమిటంటే వాళ్ల అబ్బాయి అమర్ ఇంటర్మీడియట్ చదివే ఒక అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయి తిరస్కరించటంతో భగ్నప్రేమికుడై దరిమలా సైకోగా మారాడుట.

10/29/2016 - 22:38

ఆరాధన - భావం కాదు ఒక బంధం
మనసును వెలిగించే దీపం
ఆరాధన వసంతాల్ని పూయిస్తుంది
చీకటి అగాథాల్లో పయనించే కాలాన్ని
కౌగిలిలో బంధించి
ప్రాణవాయువు నింపుతుంది
ఆకాశాన్ని చుంబించి
నక్షత్రాల్ని తాకే శక్తినిస్తుంది
ప్రాణంలో ప్రాణమై
నిత్యనూత్నంగా ఆవిష్కరిస్తుంది నిన్ను
ఆరాధనను కప్పుకో.. అలసట ఉండదు
పెదవులపై చిర్నవ్వులు చెరగవు

10/29/2016 - 22:34

జానకమ్మకి మూడు పదులు నిండకుండానే వైధవ్యం వచ్చింది. ఒక్కగానొక్క కూతురిని కళ్లల్లో పెట్టుకుని పెంచి పద్దెనిమిదేళ్లు నిండగానే తమ్ముడికిచ్చి పెళ్లి చేసింది. మగపిల్లలిద్దరిని (కవలలు) ఇచ్చి, పాతికేళ్లు నిండకుండానే ఆమెను వదిలి పైలోకానికి వెళ్లిపోయాడు. ‘తల్లి వారసత్వమే.. తల్లి, బిడ్డలిద్దరూ దురదృష్టవంతుల’ని అగ్రహారం తీర్మానించింది.

10/29/2016 - 22:42

ప్రతులకు:
స్పృహ సాహితీ సంస్థ,
పద్మా కాలనీ, నల్లకుంట,
హైదరాబాద్.
రాష్ట్రంలోని అన్ని పెద్ద పుస్తకాల షాపుల్లో లభ్యం.
**

10/23/2016 - 04:35

జిల్లా కలెక్టర్ గారు ఆ కళాశాల సందర్శనకు వస్తున్నారు. ప్రాంగణమంతా ఒకటే హడావుడిగా వుంది. విద్యార్థులు, అధ్యాపకులు ప్రధాన ద్వారం నుండి బారులుదీరి స్వాగతం చెప్పడానికి వేచి ఉన్నారు. ఇంతలో కలెక్టర్‌గారి కారు వచ్చి ద్వారం ముందాగింది. అందరూ చప్పట్లతో తమ కళాశాల పూర్వ విద్యార్థికి ఘన స్వాగతం చెబుతుండగా కలెక్టర్ ఇందిర సరాసరి ప్రధానాచార్యుల దగ్గరకు వెళ్లి కిందికి వంగి ఆయన కాళ్లకు నమస్కారం చేసింది.

Pages