S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/24/2017 - 03:11

న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసు అధికారుల్లో జాతీయ సమగ్రతను తీసుకొచ్చే ఉద్దేశంతో ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అధికారుల కేడర్ కేటాయింపులకు సంబంధించి కొత్త పాలసీకి కేంద్రం తుది రూపమిస్తోంది. కొత్త విధానం ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సర్వీసుల అధికారులు తాము పని చేయడానికి ఇప్పటిమాదిరి రాష్ట్రాలను కాక జోన్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

08/24/2017 - 03:10

న్యూఢిల్లీ: నాలుగు రోజుల వ్యవధిలో రెండు రైలు ప్రమాదాలు జరిగినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. రైల్వే బోర్డు అధ్యక్షుడు ఏకె మిట్టల్ కూడా తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మిట్టల్ స్థానంలో కొత్త చైర్మన్‌గా ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వని లోహానిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది.

08/24/2017 - 03:09

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యా సంస్థల రిజర్వేషన్ల కల్పనకు వీలుగా ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి) క్రీమీలేయర్ పరిమితిని ఆరు లక్షల నుండి ఎనిమిది లక్షల రూపాయలకు పెంచుతూ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ బుధవారం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.

08/23/2017 - 03:27

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా రాష్ట్ర ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదనీ, ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగటం లేదని వక్తలు అభిప్రాయపడ్డారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, టిజెఏసి అధ్యక్షుడు కోదండరామ్, సంఘ సంస్కర్త స్వామి అగ్నివేష్ తదితర ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

08/23/2017 - 02:54

చెన్నై, ఆగస్టు 22: అన్నాడిఎంకెలో రెండు గ్రూపులు విలీనం కావడంపై పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ స్పందించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం ఇద్దరూ అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళను మోసం చేశారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. పళని, పన్నీరులపై తీవ్ర విమర్శలు చేస్తూ దినకరన్ వరుస ట్వీట్లు చేశారు. వారిద్దరూ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని టిటివి ధ్వజమెత్తారు.

08/23/2017 - 02:53

న్యూఢిల్లీ, ఆగస్టు 22: సుప్రీం కోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై కోర్టులో అభియోగాలు నమోదయిన రోజునుంచే వారిని అనర్హులిగా ప్రకటించడాన్ని అమలు చేసినట్లయితే అధికారంలో ఉండే పార్టీ దాన్ని దుర్వినియోగం చేయవచ్చన్న భయాందోళనలున్నాయని పార్లమెంటు స్థారుూ సంఘం అభిప్రాయపడింది.

08/23/2017 - 02:52

లక్నో, ఆగస్టు 22: ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్‌బి) తన భవిష్యత్తు కార్యాచరణను భోపాల్‌లో సెప్టెంబర్ 10న రూపొందించుకోనుంది. ఇంతకు ముందే బోర్డు కార్యవర్గ సమావేశం నిర్ణయించినప్పటికీ అజెండాను మాత్రం ఈ రోజు విడుదల చేసినట్లు బోర్డు కార్యవర్గ సభ్యుడు జఫర్యాబ్ జిలానీ చెప్పారు.

08/23/2017 - 02:49

న్యూఢిల్లీ, ఆగస్టు 22: త్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతోపాటు ఎన్‌డిఏ, ప్రతిపక్షానికి చెందిన సీనియర్ నాయకులు ప్రశంసించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మికమని నరేంద్ర మోదీ చెప్పారు.

08/23/2017 - 02:47

న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశంలో ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చటానికి, మనీ లాండరింగ్ వంటి వ్యవహారాలకు పైరసీ, కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కూడా ప్రధాన వనరులుగా మారుతున్నాయని కేంద్రమ హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దేశంలో అన్ని పోలీసు శిక్షణా కళాశాలల్లో మేధో సంపన్న హక్కుల (ఐపిఆర్)కు సంబంధించి ప్రత్యేక కోర్సును మంగళవారం ప్రకటించిన సందర్భంగా రాజ్‌నాథ్ ప్రసంగించారు.

08/23/2017 - 02:46

చెన్నై, ఆగస్టు 22: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని బర్తరఫ్ చేయాలని టిటివి దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు మంగళవారం గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావును కలిసి డిమాండ్ చేశారు. పళనిస్వామి సిఎం పదవికి అనర్హుడని, ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కోల్పోయారని వారు ఆరోపించారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనం అనైతికమని వారు గవర్నకు ఫిర్యాదు చేశారు. ‘ముఖ్యమంత్రి పళనిస్వామిపై మాకు విశ్వాసం లేదు.

Pages