S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/27/2017 - 02:21

ముంబయి, జూన్ 26: ఖైదీ మరణాన్ని నిరసిస్తూ ఆందోళనా కార్యక్రమాన్ని చేపట్టి అల్లర్లకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ముంబయిలోని మహిళా జైలులోని దాదాపు 200 మంది ఖైదీలపై కేసులు నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా కూడా ఈ కేసులు నమోదైన వారిలో ఉన్నారు.

06/27/2017 - 01:58

ముంబయి, జూన్ 26: ఖైదీ మరణాన్ని నిరసిస్తూ ఆందోళనా కార్యక్రమాన్ని చేపట్టి అల్లర్లకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ముంబయిలోని మహిళా జైలులోని దాదాపు 200 మంది ఖైదీలపై కేసులు నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా కూడా ఈ కేసులు నమోదైన వారిలో ఉన్నారు.

06/27/2017 - 01:21

న్యూఢిల్లీ, జూన్ 26: రాష్టప్రతి పదవికి పోటీ చేస్తున్న ప్రతిపక్షం అభ్యర్థి మీరా కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయకముందే ప్రచారం ప్రారంభించారు. మీ అంతరాత్మ సాక్షిగా ఓటు వేయాలని కోరుతూ ఆమె పార్లమెంటు, శాసనసభ్యులకు లేఖలు రాశారు. మీరా కుమార్ మంగళవారం లేదా బుధవారంనాడు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

06/27/2017 - 01:18

హైదరాబాద్, జూన్ 26: రాష్టప్రతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆషామాషీగా ఏమీ పోటీ చేయడం లేదని, ఈ ఎన్నికల్లో ఆమె గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో మీరా కుమార్‌కు మద్దతు తెలపాల్సిందిగా ఎన్‌డిఎ మిత్రపక్షాలను ఒప్పించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తాయని ఆయన తెలిపారు.

06/27/2017 - 01:16

దేశవ్యాప్తంగా ముస్లింలు సోమవారంనాడు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. దేశంలోని అన్ని మసీదులు కిటకిటలాడాయ.

చిత్రం.. ఢిల్లీలోని జామా మసీదులో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

06/27/2017 - 01:13

శ్రీనగర్, జూన్ 26: జమ్మూకాశ్మీర్ అంతటా సోమవారం రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మసీదులు, ఈద్గాల్లో జరిగిన ప్రార్థనల్లో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే కాశ్మీర్ లోయలో రాళ్లదాడులు సంఘటనలు జరిగాయ. పలుచోట్ల భద్రతా దళాలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగారు. ఈద్గాలో ప్రార్థనలు ముగించుకుని బయటకువచ్చిన యువకులు పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు.

06/27/2017 - 01:11

పుదుచ్ఛేరి, జూన్ 26: దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల పర్యటనకు సోమవారం ఇక్కడకు చేరుకున్నారు. దేశంలో బిజెపిని పటిష్టం చేయడానికి జాతీయస్థాయిలో 110 రోజుల పర్యటన రూపొందించుకున్నారు. అమిత్ షా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో రెండోసారి పర్యటనకు వచ్చారు.

06/27/2017 - 01:07

న్యూఢిల్లీ, జూన్ 26: విపత్కర సమయాల్లో ప్రజలకు సాయమందించే ఎన్‌డిఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది తమ పనితీరును మరింతగా పెరుగుపర్చుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యవసర ఫోన్ కాల్స్‌కు మూడు రెట్లు వేగంతో స్పందించేందుకు వీరు సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు ఎన్‌డిఆర్‌ఎఫ్ కంట్రోల్ రూమ్ అత్యవసర ఫోన్ కాల్స్‌కు స్పందించేందుకు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేది.

06/27/2017 - 00:54

న్యూఢిల్లీ, జూన్ 26: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా మరో చారిత్రక అడుగు ముందుకు వేస్తోంది. 150 సంవత్సరాల సంప్రదాయానికి చరమగీతం పాడుతూ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1నుంచి కాకుండా జనవరి ఒకటినే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

06/26/2017 - 02:19

న్యూఢిల్లీ, జూన్ 25: ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజెవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో బిజెవైఎం జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Pages