S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/26/2017 - 01:55

భద్రాచలం టౌన్, జూన్ 25: దండకారణ్యం మళ్లీ నెత్తురోడింది. రెండు రోజుల పాటు నిరంతరాయంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గుట్టల్లో శనివారం మావోయిస్టుల ప్లీనరీని భగ్నం చేసేందుకు భద్రతా బలగాలు యత్నించాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12మంది మావోయిస్టులు హతమయ్యారు.

06/26/2017 - 01:48

దివ్యక్షేత్రం పూరీలో జగన్నాథుడు జనంలోకి వచ్చాడు. భలభద్ర, సుభద్రలతో కలిసి మూడు రథాలపై ఆశీనులై యాత్ర ప్రారంభించారు. భోరున వర్షం కురుస్తున్నప్పటికీ పూరీ నగరం భక్తజన సంద్రమైంది. రథాలు వెళ్లే మార్గంలో లక్షలాది భక్తులు బారులు తీరి భగవంతుడి దివ్యదర్శనం చేసుకున్నారు.

06/26/2017 - 01:36

న్యూఢిల్లీ, జూన్ 25: తెలంగాణలోని రామగుండం ఎరువుల కార్మాగారం నుంచి 2018 చివరికల్లా ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ సిఇవో వివేక్ మల్హోత్రా వెల్లడించారు. ఈ ఎరువుల కార్మాగారానికి తెలంగాణ తన వాటా కింద రూ.72.21 కోట్లు విడుదల చేసింది. దీంతో వివేక్ మల్హోత్రాతో పాటు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

06/26/2017 - 00:56

పూరీ, జూన్ 25: ఒడిశాలోని పూరీలో ఆదివారం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జగన్నాథ రథయాత్ర అశేష భక్త జనావళి జయ జయధ్వానాల మధ్య మొదలైంది. జోరువర్షాలు కురుస్తున్నప్పటికీ దేశం నలుమూలలనుంచి, విదేశాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ రథయాత్రను తిలకించడానికి రావడంతో పూరీ నగరం భక్తజన సంద్రంగా మారిపోయింది.

06/26/2017 - 00:57

న్యూఢిల్లీ, జూన్ 25: నలభై రెండు సంవత్సరాల క్రితం అంటే 1975 జూన్ 25న అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ పీడకలను ఎన్నటికీ మరిచిపోలేమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం విలువలను నిరంతర నిఘాతో పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది మరింతగా స్పష్టం చేస్తోందని తెలిపారు.

06/26/2017 - 00:47

శ్రీనగర్, జూన్ 25: కాశ్మీర్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గుల్మార్గ్‌లో కేబుల్ కారు కూలిపోవడంతో ఏడుగురు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌కు చెందిన జయంత్ అంద్రాస్కర్, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కాగా, మిగతా ముగ్గురు టూరిస్టు గైడ్‌లుగా పని చేసే స్థానికులని అధికారులు చెప్పారు.

06/26/2017 - 00:45

శ్రీనగర్, జూన్ 25: శ్రీనగర్ శివార్లలో శనివారం సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి శ్రీనగర్- జమ్మూ, నేషనల్ హైవేపై ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూలులో దాగిన ఇద్దరు మిలిటెంట్లను భద్రతా దళాలు ఆదివారం సాయంత్రం మట్టుపెట్టడంతో 14 గంటలుగా సాగుతున్న ఎన్‌కౌంటర్‌కు తెరపడింది. నగర శివార్లలో పంథాచౌక్ వద్ద సిఆర్‌పిఎఫ్ బృందంపై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఒక అధికారి మృతి చెందగా మరో కానిస్టేబుల్ గాయపడ్డం తెలిసిందే.

06/26/2017 - 00:39

న్యూఢిల్లీ, జూన్ 25: నేపాల్, భూటాన్‌లలో పర్యటించే భారతీయులకు ఆధార్ కార్డు ప్రామాణికంగా గుర్తించడం లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. నేపాల్, భూటాన్‌లలో పర్యటించేందుకు భారతీయులకు వీసా అవసరం లేదని అయితే వ్యక్తిగత గుర్తింపునకు ఓటరు కార్డు లేదా పాస్‌పోర్టును మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు తెలిపింది.

06/26/2017 - 00:39

న్యూఢిల్లీ, జూన్ 25: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో 100 గంటల్లో 71 గ్రామాల్లో 10వేల మరుగుదొడ్లు నిర్మించడంపట్ల ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆదివారం రేడియోలో 33వ ‘మన్ కీ బాత్’లో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. స్వచ్ఛ్భారత్‌లో భాగంగా విజయనగరం జిల్లాలో స్థానిక ప్రజలను అధికారులు చైతన్యవంతం చేసి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.

06/26/2017 - 00:38

జమ్మూ, జూన్ 5: పాకిస్తాన్ సైన్యం ఆదివారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి జమ్మూ, కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో అధీన రేఖ వెంబడి ఆటోమేటిక్ ఆయుధాలు, మోర్టార్లతో కాల్పులకు తెగబడింది.

Pages