S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/25/2017 - 00:49

న్యూఢిల్లీ, జూన్ 24: భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసిహెచ్‌ఆర్) మెంబర్ సెక్రెటరీ ఆనంద్ శంకర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరు నెలల క్రితమే కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆయను పదవిలో నియమించింది. 51 ఏళ్ల శంకర్ గురువారమే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా పదవికి రాజీనామా చేస్తున్నట్టు శంకర్ చెప్పారని ఐసిహెచ్‌ఆర్ చైర్‌పర్సన్ సుదర్శన్‌రావు అన్నారు.

06/25/2017 - 00:48

జమ్మూ, జూన్ 24: నియంత్రణ రేఖను దాటి వచ్చి జమ్మూ-కాశ్మీరులోని పూంచ్ జిల్లాలో భారత సైనిక గస్తీ బృందంపై దాడికి పాల్పడిన పాకిస్తానీ బోర్డర్ యాక్షన్ టీమ్ (బిఎటి)ను ప్రత్యేక బలగాలకు చెందిన సిబ్బందితో పాటు తీవ్రవాదులతో ఏర్పాటు చేశారు.

06/24/2017 - 03:09

సూళ్లూరుపేట, జూన్ 23: నూతన సాంకేతిక ఒరవడికి ఇస్రో శ్రీకారం చుట్టిందని ఆ సంస్థ చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం పిఎస్‌ఎల్‌వి-సి 38 ప్రయోగ విజయనంతరం ఆయన షార్‌లోని మీడియా సెంటర్‌లో శాస్తవ్రేత్తలతో కలసి విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సాంకేతిక విధాన ప్రయోగాల్లో ఇస్రో ఎంతో ఘనత సాధిస్తోందని , ఇదంతా శాస్తవ్రేత్తల సమష్టి కృషి ఫలితమేనని స్పష్టం చేశారు.

06/24/2017 - 02:54

న్యూఢిల్లీ,జూన్ 23: దేశ వ్యాప్తంగా ఆకర్షణీయ నగరాల (స్మార్ట్ సిటీ) జాబితాలో కరీంనగర్ నగరం చోటు దక్కించుకుంది. అలాగే పట్టణ సంస్కరణల్లో 86.92శాతం మార్కులతో తెలంగాణ రాష్ట్రం ఆరోస్థానంలో దక్కించుకుంది. ఢిల్లీలో శుక్రవారం నాడు అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ జాతీయ వర్క్‌షాప్ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు మూడో దశలో 30 స్మార్ట్ నగరాల జాబితాను ప్రకటించారు.

06/24/2017 - 02:40

న్యూఢిల్లీ, జూన్ 23:రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం, మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేయడమే అమెరికా పర్యటన చేపట్టడంలో తన ఉద్దేశమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అమెరికా, పోర్చుగల్, నెదర్లాండ్స్‌లలో నాలుగు రోజుల పాటు పర్యటించేందుకు శనివారం ఇక్కడి నుంచి బయలు దేరుతున్న సందర్భంగా మాట్లాడారు.

06/24/2017 - 01:50

శ్రీనగర్, జూన్ 23: జమ్మూ, కాశ్మీర్‌లో అల్లరి మూకలు మరోసారి రెచ్చిపోయాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని కొట్టి చంపేశాయి. పోలీసుల కథనం ప్రకారం శ్రీనగర్‌లోని నౌహట్టా ప్రాంతంలో ఉన్న జామియా మసీదు సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ సంఘటన చోటు చేసుకొంది.

06/24/2017 - 02:19

న్యూఢిల్లీ, జూన్ 23: జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరానికి అన్ని బాధ్యతలూ కేంద్రమే తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నిజానికి పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సైతం కేంద్రమే తెచ్చుకోవాలని అన్నారు. జాతీయ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు శాశ్వతంగానో లేదా కనీసం మూడేళ్లపాటు ఇవ్వాలని కోరారు.

06/24/2017 - 01:43

న్యూఢిల్లీ/ ప్రొద్దుటూరు, జూన్ 23: వైద్య (ఎంబిబిఎస్), దంత వైద్య (బిడిఎస్) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన జాతీయ అర్హత/ ప్రవేశ పరీక్ష (నీట్)లో పంజాబ్ విద్యార్థి నవ్‌దీప్ సింగ్ టాప్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. నీట్ ఫలితాల్లో ప్రొద్దుటూరుకు చెందిన మన్వితారెడ్డి 14వ ర్యాంక్ సాధించి తెలుగువారి సత్తా చాటింది.

06/24/2017 - 01:36

సూళ్లూరుపేట, జూన్ 23: వరుస అంతరిక్ష ప్రయోగాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతలో జమ చేసుకుంది. ఒకే రాకెట్ ద్వారా 31 ఉపగ్రహాలను పది కక్ష్యల్లోకి పంపి భారత శాస్తవ్రేత్తలు సత్తాచాటారు. ఇస్రో కదనాశ్వం పిఎస్‌ఎల్‌వి-సి 38 మరోసారి విజయబావుటా ఎగరవేసింది.

06/24/2017 - 01:34

ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబు సహా పదిహేను రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతల సమక్షంలో రాష్టప్రతి పదవికి ఎన్డీయే ఉమ్మడి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కోవింద్ ఎలాంటి మచ్చ లేని నాయకుడని, అన్ని విధాలుగా ఈ రాజ్యాంగ పదవికి సమర్థుడని నేతలు అభివర్ణించారు.

Pages