S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/03/2016 - 01:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రతిపక్షం సైన్యాన్ని వివాదంలోకి లాగటం ద్వారా రాజకీయం చేస్తోందని సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు శుక్రవారం రాజ్యసభలో ఆరోపించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ రామ్రావ్ భామ్రే ప్రతిపక్షం ఆరోపణలను తిప్పికొడుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో సంప్రదించిన తరువాతే 19 చోట్ల శాంతి భద్రతలు, టోల్ గేట్ల నిర్వహణాశిక్షణ చేపట్టిందని వివరించారు.

12/03/2016 - 01:49

కోల్‌కతా/ న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని టోల్ ప్లాజాల వద్ద సైనిక బలగాల మోహరింపు పెద్ద దుమారానికి తెరలేపింది. కేంద్రం తీసుకున్న ఈ చర్యను ‘సైనిక కుట్ర’గా అభివర్ణించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైన్యం మోహరింపును నిరసిస్తూ గురువారం రాత్రంతా రాష్ట్ర సచివాలయమైన ‘నబన్నా’లోనే గడిపారు. మరోవైపు, సైనిక కుట్రంటూ మమత చేసిన ఆరోపణలను కేంద్రం శుక్రవారం తీవ్రంగా ఖండించింది.

12/03/2016 - 01:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సమాజ్‌వాదీ పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఎలాంటి విముఖత లేనట్లుగా కనిపిస్తోంది.

12/03/2016 - 01:43

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) సమావేశానికి తొలిసారి యువనేత రాహుల్ గాంధీ సారథ్యం వహించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్య కారణాల వలన శుక్రవారం ఈ సమావేశానికి రాలేకపోవడంతో రాహుల్ గాంధీ అధ్యక్షత వహించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన ఈ సమావేశంలో ప్రసంగిస్తూ, ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

12/03/2016 - 01:42

అమృత్‌సర్, డిసెంబర్ 2: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం నుంచి ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ వార్షిక సదస్సు ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై విస్తృతమైన చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

12/03/2016 - 01:41

ముంబయి, డిసెంబర్ 2: సరిహద్దుల్లో భారతీయ జవాన్ల హత్యలపై బిజెపి మిత్రపక్షమైన శివసేన కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, పెద్ద నోట్ల రద్దుపై నవంబర్ 8న ప్రకటన వెలువడిన తర్వాత సరిహద్దుల్లో మన సైనికులపై దాడులు ఎందుకు పెరిగాయో చెప్పాలని ప్రశ్నించింది.

12/02/2016 - 03:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 1:ఉగ్రవాద దాడుల మధ్య ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్తాన్‌కు భారత్ తెగేసి చెప్పింది.కాశ్మీర్‌లోని నగ్రొటా సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరింత కటువుగా తన స్వరాన్ని పాక్‌కు వినిపించింది.

12/02/2016 - 03:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజ్యసభకు వచ్చినా ప్రతిపక్షం మాత్రం పెద్దనోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జరుగుతున్న చర్చను ముందుకు సాగించేందుకు అనుమతించలేదు. నల్లధనానికి ప్రతిపక్షం మద్దతు ఇస్తోందంటూ చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పేంతవరకు సభలో చర్చను సాగనివ్వమంటూ ప్రతిపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి గొడవ చేశారు.

12/02/2016 - 02:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రతిపక్షాలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు విమర్శించారు. గురువారం పార్లమెంటులోని తన కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు అంశంపై చర్చ జరగకుండా రాజకీయ దురుద్దేశంతోనే పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

12/02/2016 - 02:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: పెద్దనోట్ల రద్దు వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిపేందుకు సిద్ధమంటూనే షరతులు విధించటం ఎంతవరకు సమంజసమని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం ప్రతిపక్షాన్ని నిలదీశారు. ఏదో ఒక నియమం కింద చర్చ జరిపే అధికారం మీకున్నది, మీకున్న అధికారం మేరకు వెంటనే చర్చ ప్రారంభించాలని అంటారు, చర్చ ప్రారంభిస్తే మాట్లాడకుండా పోడియం వద్దకు వచ్చి గొడవ చేస్తారు, ఏమిటిది?

Pages